
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సాయిధరమ్ తేజ్
హైదరాబాద్: యువ హీరో సాయిధరమ్ తేజ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం ప్రత్యేక దర్శనం ద్వారా శ్రీవారి ఆశీస్సులు పొందారు. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన 'పిల్లా నువ్వులేని జీవితం' ఇటీవల విడుదలైంది.
ఇదిలావుండగా తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 7 కంపార్ట్‌మెంట్లు నిండాయి.