Sai Dharam Tej Interesting Comments On Ram Charan Daughter Klin Kaara Konidela - Sakshi
Sakshi News home page

Dharam Tej On Klin Kaara Eyes: క్లీంకార ఎలా ఉంది? ఎవరి పోలికలు?.. సాయి తేజ్‌ క్లారిటీ

Published Tue, Jul 25 2023 3:58 PM | Last Updated on Tue, Jul 25 2023 4:29 PM

Sai Dharam Tej Interesting Comments On Ram Charan Daughter Klin Kaara Konidela - Sakshi

మెగా ప్రిన్సెస్‌ క్లీంకార ఎలా ఉంటుంది? తండ్రి రామ్‌ చరణ్‌లా ఉంటుందా? లేక తల్లి ఉపాసనలా ఉంటుందా? చిరంజీవి పోలికలు వచ్చాయా? లేవా?.. మెగా అభిమానుల మనసుల్లో మెదలుతున్న ప్రశ్నలివి. క్లీంకార జన్మించి నెల రోజులు దాటినా.. ఇప్పటికీ ఆమె ముఖాన్ని మాత్రం బాహ్య ప్రపంచానికి చూపించలేదు. కొన్ని ఫోటోలు, వీడియోలను వదిలినా.. కూతురి ముఖం కనిపించకుండా జాగ్రత్తపడ్డారు ఉపాసన-రామ్‌ చరణ్‌.

దీంతో క్లీంకార ఎలా ఉందనే క్యూరియాసిటీ మెగా ప్యాన్స్‌లో మరింత పెరిగింది. ఫోటోలను షేర్‌ చేయండంటూ సోషల్‌ మీడియా వేదికగా రామ్‌ చరణ్‌-ఉపాసలను వేడుకుంటున్నారు. అయినా కూడా ఇప్పటికీ మెగా ప్రిన్సెస్‌ ఫోటోలు బయటకు రాలేదు.

అయితే తాజాగా క్లీంకారకు ఎవరి పోలీకలు వచ్చాయో చెప్పేశాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. క్లీంకార ప్రస్తావన వచ్చింది. ‘క్లీంకారకు తండ్రి పోలికలు వచ్చాయి. అచ్చం రామ్‌ చరణ్‌లాగే ఉంటుంది. కళ్లు చాలా బాగున్నాయి. నాకు చాలా నచ్చాయి. కూతురు తండ్రి పోలీకలతో పుడితే అదృష్టం అంటారు. క్లీంకార విషయంలో అదే జరిగింది’అని సాయి ధరమ్‌ తేజ్‌ చెప్పుకొచ్చాడు. 

(చదవండి:  టాలీవుడ్‌లో టాప్‌ వన్‌ హీరో, టాప్‌ వన్‌ హీరోయిన్‌ ఎవరంటే..?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement