వెయిట్‌ చేయండి | nithin megha akash movie shooting completed | Sakshi
Sakshi News home page

వెయిట్‌ చేయండి

Published Fri, Jan 26 2018 12:36 AM | Last Updated on Fri, Jan 26 2018 12:36 AM

nithin megha akash movie shooting completed - Sakshi

.... ఇంకొన్నిరోజులు వెయిట్‌ చేయండి అంటున్నారు హీరో నితిన్‌. రచయిత కృష్ణ చైతన్య దర్శకత్వంలో నితిన్, మేఘా ఆకాష్‌ జంటగా ఓ సినిమా రూపొందుతోంది. సుధాకర్‌ రెడ్డి, త్రివిక్రమ్, పవన్‌ కల్యాణ్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘‘ఒక్క పాట, కొంత ప్యాచ్‌ వర్క్‌ మినహా ఈ సినిమా షూటింగ్‌ మొత్తం కంప్లీట్‌ అయింది. త్వరలోనే టైటిల్‌ను, ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేస్తాం’’ అని సోషల్‌ మీడియా ద్వారా పేర్కొన్నారు నితిన్‌. ఇది నితిన్‌ కెరీర్‌లో 25వ సినిమా కావటం విశేషం. ఈ చిత్రంలో మాజీ కథానాయిక లిజీ కీలక పాత్ర చేస్తున్నారు. చాలా గ్యాప్‌ తర్వాత ఆమె నటిస్తోన్న చిత్రమిది. ఈ సినిమాకు సంగీతం: తమన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement