తూటా వస్తోంది | thoota movie press meet | Sakshi
Sakshi News home page

తూటా వస్తోంది

Published Tue, Dec 17 2019 12:09 AM | Last Updated on Tue, Dec 17 2019 12:09 AM

thoota movie press meet - Sakshi

ధనుష్

ధనుష్, మేఘా ఆకాష్‌ జంటగా గౌతమ్‌ మీన¯Œ  దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఎనై నోకి పాయుమ్‌ తోట’. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని ‘తూటా’ పేరుతో గొలుగూరి రామకృష్ణారెడ్డి సమర్పణలో విజయభేరి బ్యానర్‌పై జి.తాతా రెడ్డి, జి.సత్యనారాయణ రెడ్డి ఈ నెల 27న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా జి.తాతరెడ్డి, జి.సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. తమిళంలో సూపర్‌ హిట్‌ సాధించిన ఈ సినిమా తెలుగులోనూ ఘన విజయం సాధిస్తుందనే నమ్మకంగా ఉన్నాం. ఇప్పటికే విడుదలయిన పోస్టర్స్, సాంగ్స్‌కు, ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు బాగున్నాయి. ధనుష్‌కి కోలీవుడ్‌తో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్‌ ఉండటం మాకు కలిసొస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: దర్బుక శివ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement