ఇన్నాళ్లకు విడుదలవుతోంది..! | Dhanush starrer Enai Noki Payyum Thota Releasing Soon | Sakshi
Sakshi News home page

ఇన్నాళ్లకు విడుదలవుతోంది..!

Published Sat, Feb 16 2019 12:52 PM | Last Updated on Sat, Feb 16 2019 12:56 PM

Dhanush starrer Enai Noki Payyum Thota Releasing Soon - Sakshi

క్రియేటివ్‌ డైరెక్టర్‌ గౌతమ్‌ మీనన్‌, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘ఎన్నై నోకి పాయుమ్ తొట్ట’. చాలా క్రితమే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆర్ధిక పరమైన కారణాల వల్ల చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్‌కు లైన్‌ క్లియర్‌ అయినట్టుగా తెలుస్తోంది. ఈ విషయాన్నిచిత్ర నిర్మాత మధన్ అధికారికంగా ప్రకటించారు.

‘ఎన్నై నోకి పాయుమ్ తొట్ట’ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యు/ఏ సర్టిఫికేట్ సాధించినట్టుగా వెల్లడించారు. త్వరలోనే ప్రచార కార్యక్రమాలు ప్రారంభించి రిలీజ్‌ డేట్‌ను కూడా ప్రకటించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ధనుష్ సరసన మేఘా ఆకాష్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో శశికుమార్‌ కీలక పాత్రలో నటించారు.


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement