Veyyinokka Lyrical Song Released From Ravi Teja Ravanasura Movie - Sakshi
Sakshi News home page

వెయ్యిన్నొక్క జిల్లాల వరకు...

Published Thu, Mar 16 2023 5:14 AM | Last Updated on Thu, Mar 16 2023 9:03 AM

Ravi Teja Ravanasura lyrical song launch - Sakshi

‘వెయ్యిన్నొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తినే.. ముల్లోకాల ఏ మూల ఉన్నా నీ అందాల సంకీర్తనే’ అని పాడుతున్నారు రావణాసుర. రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘రావణాసుర’. సుశాంత్‌ కీ రోల్‌ చేసిన ఈ చిత్రంలో అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజితా పొన్నాడ హీరోయిన్లు. రవితేజ, అభిషేక్‌ నామా నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 7న విడుదల కానుంది.

ఈ సందర్భంగా బుధవారం ఈ చిత్రంలోని ‘వెయ్యిన్నొక్క జిల్లాల..’ పాట లిరికల్‌ వీడియోను రిలీజ్‌ చేశారు. వెంకటేశ్‌ ‘సూర్య ఐపీఎస్‌’ చిత్రంలోని ‘వెయ్యిన్నొక్క జిల్లాలకు..’ పాటకు ఇది రీమిక్స్‌ వెర్షన్‌. అప్పట్లో ఈ పాటకు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి లిరిక్స్‌ అందించారు. శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీలో అనురాగ్‌ కులకర్ణి ఈ లేటెస్ట్‌ వెర్షన్‌ను పాడారు. ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్థన్‌ రామేశ్వర్, భీమ్స్‌ సిసిరోలియో, కెమెరా: విజయ్‌ కార్తీక్‌ కన్నన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement