ప్రేక్షకులు థ్రిల్‌ అవుతారు  | Megha Akash about Ravanasura movie | Sakshi
Sakshi News home page

ప్రేక్షకులు థ్రిల్‌ అవుతారు 

Published Fri, Apr 7 2023 4:42 AM | Last Updated on Fri, Apr 7 2023 4:50 AM

Megha Akash about Ravanasura movie  - Sakshi

‘‘రావణాసుర’ మూవీలో నాది చాలా కీలకమైన పాత్ర. కామెడీ, ఇంటెన్స్‌.. ఇలా వేరియేషన్స్ ఉంటాయి. ఆ పాత్ర చేయడం సవాల్‌గా అనిపించింది’’ అని మేఘా ఆకాష్‌ అన్నారు. రవితేజ హీరోగా సుధీర్‌ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘రావణాసుర’. అభిషేక్‌ నామా, రవితేజ  నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది.

ఈ చిత్రంలో ఓ హీరోయిన్‌గా నటించిన మేఘా ఆకాష్‌ మాట్లాడుతూ–‘‘రావణాసుర’లో నేను రిచ్, క్లాసీ అమ్మాయిగా కనిపిస్తాను. ఈ మూవీలో చాలా మలుపులు, ట్విస్ట్‌లు, సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి. ప్రేక్షకులు థ్రిల్‌ ఫీలవుతారు. సుధీర్‌ వర్మగారు ఒక యాక్టర్‌కి చాలా కంఫర్ట్‌ జోన్‌ ఇస్తారు. ప్రస్తుతం విజయ్‌ ఆంటోనీతో ఒక సినిమా, మా అమ్మగారి సమర్పణలో ఓ చిత్రం చేస్తున్నాను’’ అన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement