
టాలీవుడ్ యంగ్ హీరోయిన్స్‌లో మేఘా ఆకాశ్ ఒకరు. లై సినిమాతో తెలుగు తెరకు పరిచమైన ఈ బ్యూటీ.. ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. ఒకవైపు హీరోయిన్‌గా నటిస్తూనే..సినిమాల్లోనూ ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో నటిస్తుంది. నేడు(అక్టోబర్ 26) ఆ అమ్మడి పుట్టిన రోజు. ఈ సారి తన బర్త్‌డే సెలెబ్రేషన్స్‌ని సఃకుటుంబనాం సినిమా సెట్స్‌లో జరుపుకుంది. అచ్చం తెలుగమ్మాయిలా చీర కట్టుకొని.. చిత్రబృందం సమక్షంలో కేక్ కట్ చేసింది.
అనంతరం యూనిట్ అంతా తనకు విషెస్ తెలియజేశారు. సఃకుటుంబనాం సినిమా విషయానికొస్తే.. ఇందులో రామ్ కిరణ్ హీరోగా నటిస్తున్నాడు. హెచ్ఎన్‌జీ మూవీస్ సినిమాస్ పతాకంపై ఉదయ్‌శర్మ దర్శకత్వంలో హెచ్.మహాదేవ్ గౌడ, హెచ్.నాగరత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, సత్య, రాహుల్ రామకృష్ణ. రచ్చరవి, శుభలేఖ సుధాకర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment