
మేఘా ఆకాష్, విజయ్ సేతుపతి, అమలాపాల్
అమలాపాల్ హీరోయిన్‌గా ఎంపికైన సినిమాలో ఆమెకు బదులుగా హీరోయిన్ మేఘా ఆకాష్‌ను చిత్రబృందం ఫైనలైజ్ చేశారన్నది కోలీవుడ్ తాజా ఖబర్. విజయ్ సేతుపతి హీరోగా వెంకట్ కృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ప్రారంభోత్సవం ఇటీవల చెన్నైలో జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. తొలుత ఈ సినిమాకి కథానాయికగా అమలా పాల్‌ను తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఆమె ప్లేస్‌లోకి మేఘా వచ్చారని సమాచారం. ఆల్రెడీ ఊటీలో ఈ సినిమా చిత్రీకరణ కూడా జరుగుతోంది. అయితే.. సడన్‌గా ఇప్పుడు అమలా ఎందుకు ఈ సినిమా చేయడం లేదు అంటే... ఏదో కొత్త సినిమాకు సైన్ చేశారని కొందరు, రెమ్యునరేషన్ ప్రాబ్లమ్ అని మరికొందరు అంటున్నారు. అయితే ఈ విషయంపై చిత్రబృందం స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment