
‘హాయ్ నేను మేఘా స్వరూప్. నాకు లవ్‌లో పీహెచ్‌డీ ఉంది. నిన్ను చూసినన్నిసార్లు బుక్స్ చూసి ఉంటే క్లాస్ టాపర్ అయ్యుండేదాన్ని’ అంటూ మేఘా ఆకాశ్ చెప్పే డైలాగులతో విడుదలైంది ‘డియర్ మేఘ’ సినిమా టీజర్. అదిత్ అరుణ్, అర్జున్ సోమయాజులు హీరోలుగా, మేఘా ఆకాశ్ హీరోయిన్‌గా రూపొందిన చిత్రం ‘డియర్ మేఘ’. సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో అర్జున్ దాస్యన్ నిర్మించారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా టీజర్‌ని మేఘా రిలీజ్ చేశారు. అర్జున్ దాస్యన్ మాట్లాడుతూ– ‘‘సుశాంత్, నేను చాలా కథలు విన్నాం.. వాటిలో ‘డియర్ మేఘ’ కథ నచ్చి, నిర్మించాం.
సుశాంత్ రెడ్డి, మేఘా ఆకాశ్, అదిత్ అరుణ్, అర్జున్
ఆగస్టులో థియేటర్లలో సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘మా సినిమా వంద శాతం ప్రేక్షకుల మనసులను తాకుతుంది’’ అన్నారు సుశాంత్ రెడ్డి. ‘‘నాకు తెలుగు సినిమాలు చేయడం ఇష్టం కానీ పలు కారణాలతో ఇక్కడ ఎక్కువగా చేయలేకపోతున్నాను’’ అన్నారు మేఘా ఆకాశ్. ‘‘నా కాలేజ్ డేస్‌లో తరుణ్, ఉదయ్ కిరణ్, సిద్ధార్థ్ మంచి ప్రేమకథా సినిమాలు చేసేవారు.. అలాంటి ఒక స్వచ్ఛమైన ప్రేమ కథను ‘డియర్ మేఘ’లో చూపించబోతున్నాం’’ అన్నారు అదిత్ అరుణ్. సంగీత దర్శకుడు హరి గౌర మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: ఐ ఆండ్రూ.
Comments
Please login to add a commentAdd a comment