విక్రమ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘వీర ధీర శూరన్ పార్ట్ 2’. ఎస్‌యు అరుణ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఎస్‌జే సూర్య, సూరజ్ వెంజరమూడు, దుషారా విజయన్ ఇతర పాత్రల్లో నటించారు. హెచ్‌ఆర్ పిక్చర్స్‌పై రియా శిబు నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ను సోమవారం విడుదల చేశారు. ‘‘వీర ధీర శూరన్ పార్ట్ 2’ చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ అందర్నీ ఆకట్టుకోవడంతో యూట్యూబ్‌లో 14 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
తాజాగా విడుదల చేసిన టీజర్‌లో విక్రమ్ నటన, యాక్షన్ సీక్వెన్సులు, విజువల్స్, నేపథ్య సంగీతం వంటివి అభిమానుల అంచనాలను మించిపోయాయి. విక్రమ్ డిఫరెంట్ లుక్స్, యాక్టింగ్, పోలీస్ ఆఫీసర్‌గా ఎస్‌జే సూర్య పెర్ఫామెన్స్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటాయి. ఈ జనవరిలో తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమాని విడుదల చేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకి కెమెరా: తేని ఈశ్వర్, సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్.
Comments
Please login to add a commentAdd a comment