ఛల్‌ మోహన్‌రంగ | Chal Mohana Ranga First Look Motion Teaser | Sakshi
Sakshi News home page

ఛల్‌ మోహన్‌రంగ

Published Mon, Feb 12 2018 4:11 AM | Last Updated on Mon, Feb 12 2018 4:11 AM

Chal Mohana Ranga First Look Motion Teaser  - Sakshi

నితిన్‌

‘బొమ్మోలే ఉన్నదిరా పోరి.. బొం బొంబాటుగుందిరా నారి.. లడ్డోలె ఉన్నదిరా కోరి.. లై లైలప్ప బుగ్గల్ది ప్యారి’ అంటూ ‘లై’ సినిమాలో సందడి చేశారు నితిన్‌–మేఘా ఆకాశ్‌. మరోసారి ఈ ఇద్దరూ జంటగా నటిస్తోన్న చిత్రానికి ‘ఛల్‌ మోహన్‌రంగ’ టైటిల్‌ పెట్టారు. కృష్ణచైతన్య దర్శకత్వంలో శ్రేష్ట్‌ మూవీస్, పవన్‌ కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ని ఆదివారం విడుదల చేశారు. నితిన్‌ కెరీర్‌లో ‘ఛల్‌ మోహన్‌రంగ’ 25వ సినిమా కావడం ఒక విశేషమైతే.. దర్శకుడు త్రివిక్రమ్‌ ఈ చిత్రానికి కథ అందించడం మరో విశేషం.

ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు కృష్ణ చైతన్య, సుధాకర్‌ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ప్రేమతో కూడిన కుటుంబ కథా చిత్రమిది. చాలా సరదాగా సాగుతుంది. ఒక్క పాట మినహా షూటింగ్‌ పూర్తయింది. ఈ నెల 14 నుంచి హైదరాబాద్‌లో ఆ పాట చిత్రీకరించనున్నాం. మరోవైపు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ప్రేమికులరోజు సందర్భంగా ఈ నెల 14న టీజర్‌ని, ఏప్రిల్‌ 5న సినిమాని విడుదల చేయనున్నాం’’ అన్నారు. ‘‘నా అభిమాన హీరో పవన్‌ కల్యాణ్‌గారు ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేయటం ఎంతో సంతోషంగా ఉంది’’ అన్నారు నితిన్‌. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: ఎం.నటరాజ సుబ్రమణియన్, సమర్పణ: నిఖిత రెడ్డి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement