
‘‘ఇంటెన్స్ లవ్‌స్టోరీతో వచ్చిన చిత్రాలు కచ్చితంగా హిట్ అవుతాయి. ‘మను చరిత్ర’ కూడా అలాంటిదే కాబట్టి తప్పకుండా ఘనవిజయం సాధిస్తుంది. ఈ చిత్రాన్ని దేనితోనూ పోల్చను. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌కు తగ్గట్టుగా భరత్ కథ రాసుకున్నాడు’’ అని నిర్మాత రాజ్ కందుకూరి అన్నారు. శివ కందుకూరి హీరోగా, మేఘా ఆకాశ్ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘మను చరిత్ర’. భరత్ పెదగాని దర్శకత్వంలో నార్ల శ్రీనివాసరెడ్డి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.
ఈ సందర్భంగా టీజర్‌ని విడుదల చేశారు. భరత్ పెదగాని మాట్లాడుతూ– ‘‘సిరాశ్రీ వల్లే ఈ చిత్రం ప్రారంభమైంది. లవ్ అండ్ వార్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. చంద్రబోస్‌గారు మా సినిమాకు రెండు పాటలు రాయడమే కాకుండా నటించారు’’ అన్నారు. ‘‘మంచి కథతో తీసిన మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తే మరిన్ని సినిమాలు తీస్తాం’’ అన్నారు నార్ల శ్రీనివాసరెడ్డి. శివ కందుకూరి మాట్లాడుతూ– ‘‘ప్రతి నటుడు తన కెరీర్‌లో ఓ మంచి సినిమా చేయాలనుకుంటాడు. ఆకోరిక నాకీ చిత్రంతోనే నెరవేరింది’’ అన్నారు. సంగీత దర్శకుడు గోపీ సుందర్ మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment