'లై' బ్యూటీతో మరోసారి..! | Megha Akash again romance with Nithin | Sakshi
Sakshi News home page

'లై' బ్యూటీతో మరోసారి..!

Published Wed, Jun 7 2017 12:27 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

'లై' బ్యూటీతో మరోసారి..! - Sakshi

'లై' బ్యూటీతో మరోసారి..!

అ..ఆ.. సినిమాతో 50 కోట్ల క్లబ్లో అడుగు పెట్టిన యంగ్ హీరో నితిన్, ప్రస్తుతం భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న 'లై' సినిమాలో నటిస్తున్నాడు. హాను రాఘవపూడి దర్శకత్వంలో యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం అమెరికాలో షూటింగ్ జరుపుకుంటోంది. నితిన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మేఘా ఆకాష్.., నితిన్కు జోడిగా నటిస్తోంది. దాదాపు రెండు నెలలుగా అమెరికాలోని వివిధ లోకేషన్లలో ఈసినిమా షూటింగ్ జరుగుతోంది.

త్వరలో ఈ సినిమా పూర్తి కానుండటంతో తన నెక్ట్స్ సినిమా మీద దృష్టి పెట్టాడు నితిన్. ఈ సినిమాను రౌడీఫెలో ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్లు నిర్మిస్తున్నారు. ఈ నెలాఖరున ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ సినిమాలో కూడా నితిన్కు జోడిగా లై ఫేం మేఘా ఆకాష్నే తీసుకోవాలని నిర్ణయించారట. మోడలింగ్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగు, తమిళ్ లో వరుస సినిమాలకు అంగకీరిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement