ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదు : నితిన్‌ | Lie Movie Thanks Meet | Sakshi
Sakshi News home page

ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదు : నితిన్‌

Published Tue, Aug 15 2017 11:59 PM | Last Updated on Sun, Sep 17 2017 5:33 PM

ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదు : నితిన్‌

ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదు : నితిన్‌

‘‘అఆ’ తర్వాత కొత్తగా చేయాలనుకున్నప్పుడు హను నన్ను కలిసి ‘లై’ లైన్‌ చెప్పారు. స్టోరీ రెడీ చేయమని చెప్పా. మా ఇద్దరితో పాటు నిర్మాతలు కూడా ఈ కథను నమ్మారు. మా అందరి ఏడాది కష్టమే ‘లై’’ అని హీరో నితిన్‌ అన్నారు. నితిన్, మేఘా ఆకాష్‌ జంటగా వెంకట్‌ బోయిన్‌పల్లి సమర్పణలో రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మించిన ‘లై’ గత శుక్రవారం విడుదలైంది. హైదరాబాద్‌లో థ్యాంక్స్‌మీట్‌ నిర్వహించారు. నితిన్‌ మాట్లాడుతూ– ‘‘ఆగస్ట్‌ 11న విడుదలైన మూడు సినిమాలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. విడుదలకు ముందు రోజు టెన్షన్‌తో నాకు నిద్ర పట్టలేదు. ముందు యూఎస్‌ నుంచి పాజిటివ్‌ టాక్‌ వచ్చింది.

 ఇండియాలో తొలి రోజు డివైడ్‌ టాక్‌ వచ్చినా, ఇప్పుడు 85 శాతం మంది బావుందంటున్నారు. కొత్త కాన్సెప్ట్‌ను ప్రేక్షకులు ఎంతగానో ఎంజాయ్‌ చేస్తున్నారు’’ అన్నారు. ‘‘నితిన్‌కి ‘లై’ లైన్‌ చెప్పగానే ఒప్పుకోవడం నాకెంతో హ్యాపీగా అనిపించింది. 14 రీల్స్‌ బ్యానర్‌లో ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ సినిమా చేయడంతో నిర్మాతలు ‘లై’కు నాకు మరింత స్వేచ్ఛనిచ్చారు. 150 సినిమాలు చేసిన అర్జున్‌గారు విలన్‌గా చేయడంతో ఈ సినిమాకి బలం వచ్చింది.

గడచిన పదేళ్లల్లో ఇలాంటి సినిమా రాలేదని చెప్పగలను’’ అన్నారు హను రాఘవపూడి. ‘‘హీరోగా చేస్తున్న నన్ను విలన్‌గా చూపెట్టిన అందాల రాక్షసుడు హను. తనను రాక్షసుడని ఎందుకు అన్నానంటే..  పని పట్ల అంత డెడికేటెడ్‌గా ఉంటాడు. నితిన్‌ 102 డిగ్రీల జ్వరంతో ఉన్నా యాక్షన్‌ సీన్స్‌లో నటించాడు’’ అన్నారు అర్జున్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement