అబద్ధం చెపుతున్న నితిన్ | Nithin New Movie Lie | Sakshi

అబద్ధం చెపుతున్న నితిన్

Mar 30 2017 9:54 AM | Updated on Sep 5 2017 7:30 AM

అబద్ధం చెపుతున్న నితిన్

అబద్ధం చెపుతున్న నితిన్

అ..ఆ.. బ్లాక్ బస్టర్ సక్సెస్ తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో

అ..ఆ.. బ్లాక్ బస్టర్ సక్సెస్ తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ డిఫరెంట్ మూవీ చేస్తున్నాడు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సరికొత్త మేకోవర్ తో  ఈ సినిమాలో నటిస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ లను క్రైం బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కించే హను రాఘవపూడి నితిన్ కోసం కూడా అదే తరహా కథను రెడీ చేశాడన్న టాక్ వినిపిస్తోంది. కృష్ణగాడి వీర ప్రేమగాథ లాంటి సూపర్ హిట్ తరువాత హను దర్శకత్వంలో తెరకెక్కుతున్న కావటంతో నితిన్ కొత్త సినిమాపై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి.

ఆ అంచనాలను మరింత పెంచేస్తూ నితిన్ పుట్టిన రోజు సందర్భంగా సినిమా టైటిల్ లోగోతో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. గడ్డంతో నితిన్ మాస్ లుక్ లో కనిపిస్తున్న ఈ సినిమాకు 'లై' అనే టైటిల్ ను ఫైనల్ చేశారు. LIE అనే అక్షరాలకు విడివిడిగా లవ్, ఇంటలిజెన్స్, ఎన్మిటి అనే ట్యాగ్ తో రూపొందుతున్న ఈ సినిమాను 14 రీల్స్ సంస్థ భారీగా నిర్మిస్తోంది. నితిన్ సరసన మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతో సీనియర్ హీరో అర్జున్ నెగెటివ్ రోల్ లో నటిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement