నితిన్ సినిమాలో హాలీవుడ్ స్టార్
అ..ఆ.. సినిమాతో 50 కోట్ల క్లబ్లో స్థానం సంపాదించుకున్న యంగ్ హీరో నితిన్ తన నెక్ట్స్ సినిమాను మరింత భారీగా ప్లాన్ చేస్తున్నాడు. యంగ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో లై అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం భారీగా గడ్డం పెంచి డిఫరెంట్ లుక్ లోకి మారిపోయాడు నితిన్. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఒకటి నితిన్ అభిమానులను ఖుషీ చేస్తోంది.
ఈ సినిమాలో ఒలంపస్ హాజ్ ఫాలెన్, ది ఈక్వలైజర్, వార్ డాగ్స్ లాంటి హాలీవుడ్ చిత్రాలతో ఆకట్టుకున్న డాన్ బిల్జరియాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం అమెరికాలో నితిన్, బిల్జరియాన్ల కాంబినేషన్లో సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ విషయాన్ని ట్వీట్టర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు నితిన్. మేఘా ఆకాష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.
Thanks @DanBilzerian for being such a sport n for being part of our film..u r a total natural!! 😎#LIEthemovie pic.twitter.com/lkBOEOZ7Eh
— nithiin (@actor_nithiin) 18 April 2017