
ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకముందే మేఘా ఆకాష్‌కు కోలీవుడ్‌లో మరో అవకాశం తలుపు తట్టింది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో మూడు చిత్రాలున్నాయి. తాజాగా మరో అవకాశం వరించింది. ఈ చెన్నై చిన్నది తొలుత టాలీవుడ్ తెరపై మెరవడం మరో విశేషం. తెలుగులో నితిన్‌తో రొమాన్స్ చేసిన లై చిత్రం ఆ మధ్య విడుదలయింది. కోలీవుడ్‌లో గౌతమ్ మీనన్ దృష్టిలో పడి ధనుష్ సరసన 'ఎన్నైనోకి పాయుం తోటా' చిత్రంలో నటిస్తోంది.
దాంతో పాటు ఒరుపక్క కథై, వర్మ చిత్రాలలో నటిస్తోంది. వీటిలో ఒరుపక్క కథై చిత్ర విడుదల హక్కులను నటుడు విజయ్‌సేతుపతి పొంది త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా తాజాగా నటుడు అధర్వతో డ్యూయెట్లు పాడటానికి రెడీ అవుతోంది. దర్శకుడు కన్నన్ తెరకెక్కించనున్న ఈ చిత్రం త్వరలో సెట్‌పైకి వెళ్లనుందట. దీని గురించి దర్శకుడు తెలుపుతూ ఇందులో నటి మేఘా ఆకాష్ విజువల్ కమ్యునికేషన్ చదివే విద్యార్ధినిగా నటించనుందనీ, ఈ పాత్రకు తనే కరెక్ట్‌గా ఉంటుందని ఎంపిక చేసినట్లు వివరించారు. మొత్తం మీద ఒక్క చిత్రం కూడా తెరపైకి రాకుండానే నాలుగు చిత్రాల అవకాశాలను అందుకుంది మేఘా ఆకాష్.
Comments
Please login to add a commentAdd a comment