
నితిన్
‘రౌడీ ఫెలో’ సినిమాతో సెన్సిబుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు కృష్ణచైతన్య. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో నితిన్, మేఘా ఆకాష్ జంటగా శ్రేష్ట్ మూవీస్, పవన్ కల్యాణ్ క్రియేటీవ్ వర్క్స్ బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న కొత్త చిత్రం ఒక్క పాట మినహా పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాత సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ – ‘‘అమెరికా, హైదరాబాద్, ఊటీలో షూటింగ్ జరిపాం.
మోషన్ పోస్టర్‌ను ఈ నెల 12న, టీజర్‌ను వేలెంటేన్స్ డే సందర్భంగా 14న, సినిమాను ఏప్రిల్ 5న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అని అన్నారు. ‘‘ప్రేమతో కూడిన కుటుంబ కథా చిత్రం ఇది. ప్రేమతో పాటు వినోదం కూడా అదే స్థాయిలో ఉంటుంది’’ అన్నారు దర్శకుడు. ఇది నితిన్‌కి 25వ సినిమా కావడం, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ అందించడం విశేషం. ఈ సినిమాకు సంగీతం: తమన్, కెమెరా: ఎం.నటరాజ సుబ్రమణియన్, నిర్మాత: సుధాకర్ రెడ్డి, స్క్రీన్ ప్లే–మాటలు–దర్శకత్వం: కృష్ణ చైతన్య.
Comments
Please login to add a commentAdd a comment