నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం జెర్సీ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయిన తరువాత విలక్షణ దర్శకుడు విక్రమ్ కుమార్‌తో ఓ సినిమా చేయనున‍్నట్టుగా ప్రకటించాడు. ఈ సినిమా కూడా విక్రమ్ స్టైల్‌లో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కనుంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో నానితో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు. వీరిలో ఒక హీరోయిన్‌గా మేఘా ఆకాష్ ను తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
నితిన్ హీరోగా తెరకెక్కిన లై సినిమాతో వెండితెరకు పరిచయం అయిన మేఘా తొలి సినిమాతో నిరాశపరిచింది. తరువాత మరోసారి నితిన్‌కు జోడిగా నటించిన ఛల్ మోహన్ రంగ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. దీంతో తెలుగులో మేఘా కెరీర్ ముగిసినట్టే అని భావించారు. అయితే తాజాగా నాని సినిమాలో ఛాన్స్ రావటంతో మేఘా కెరీర్ ఊపందుకుంటుదన్న టాక్ వినిపిస్తోంది. తాజాగా పేట సినిమాలో కనిపించిన మేఘా ఆకాష్‌కు మంచి పేరొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment