అది దా సారు! | Megha Akash Sahakutumbanam Adhi Dha Saaru Song Launch By Dill Rju | Sakshi
Sakshi News home page

అది దా సారు!

Published Thu, Dec 26 2024 4:58 AM | Last Updated on Thu, Dec 26 2024 4:58 AM

Megha Akash Sahakutumbanam Adhi Dha Saaru Song Launch By Dill Rju

హీరోయిన్‌ మేఘా ఆకాశ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సః కుటుంబానాం’. ఉదయ్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రామ్‌ కిరణ్‌ హీరోగా నటిస్తున్నారు. హెచ్‌. మహాదేవ గౌడ, హెచ్‌. నాగరత్న నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ‘అది దా సారు...’ పాట లిరికల్‌ వీడియోను నిర్మాత ‘దిల్‌’ రాజు విడుదల చేశారు. 

ఈ పాటకు అనంత శ్రీరామ్‌ సాహిత్యం ఇవ్వగా, భాను మాస్టర్‌ కొరియోగ్రఫీ అందించారు. ‘‘కుటుంబ నేపథ్యంలో వస్తున్న మా ‘సః కుటుంబానాం’ టైటిల్‌తోనే అంచనాలు పెంచేసింది. ‘అది దా సారు...’ పాటలోని లిరిక్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి కెమేరా: మధు దాసరి, ఎగ్జిక్యూటివ్‌ప్రొడ్యూసర్‌: రోహిత్‌ కుమార్‌ పద్మనాభ, లైన్‌ప్రొడ్యూసర్‌: అంకిత్‌ కనయ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement