ఇది అబద్ధం కాదు! | Nitiin' LIE Movie First Look Poster Out | Sakshi
Sakshi News home page

ఇది అబద్ధం కాదు!

Mar 30 2017 11:15 PM | Updated on Sep 5 2017 7:30 AM

ఇది అబద్ధం కాదు!

ఇది అబద్ధం కాదు!

‘లై’ అంటే ఆంగ్లంలో అబద్ధం అని అర్థం. అయితే హను రాఘవపూడి కొత్త అర్థం చెబుతున్నారు.

‘లై’ అంటే ఆంగ్లంలో అబద్ధం అని అర్థం. అయితే హను రాఘవపూడి కొత్త అర్థం చెబుతున్నారు. ‘లై’ అంటే ప్రేమ, తెలివి, పగ అంటున్నారు. నితిన్, మేఘా ఆకాష్‌  జంటగా ఆయన దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘లై’. ‘ప్రేమ... తెలివి..పగ’ ఉపశీర్షిక. 14రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లిమిటెడ్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి సమర్పణలో రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్నారు. గురువారం నితిన్‌ పుట్టినరోజున సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను విడదల చేశారు.

ఇందులో యాక్షన్‌ కింగ్‌ అర్జున్  కీలక పాత్ర చేస్తున్నారు. నిర్మాతలు  మాట్లాడుతూ– ‘‘ఆల్రెడీ హైదరాబాద్‌లో ఓ భారీ షెడ్యూల్‌ జరిపాం. ఏప్రిల్‌ 4న అమెరికాలో మరో షెడ్యూల్‌ మొదలుపెడతాం. అక్కడ జరిపే చిత్రీకరణతో 90 శాతం కంప్లీట్‌ అవుతుంది. చిత్రాన్ని ఆగస్టు 11న విడుదల చేయాలనుకుంటున్నాం. నితిన్‌–హను రాఘవపూడి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం మా బ్యానర్‌లో మరో సూపర్‌ హిట్‌ మూవీ అవుతుంది’’ అన్నారు. ఈ చిత్రానికి లైన్‌ ప్రొడ్యూసర్‌: హరీష్‌ కట్టా, కెమేరా: యువరాజ్, సంగీతం: మణిశర్మ, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌ శేఖర్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement