
లై, ఛల్‌మోహన్ రంగా సినిమాలు ఆశించినంతగా ఆడకపోయినా హీరోయిన్ మేఘా ఆకాష్‌కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. మేఘా తన అందం,నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజాగా.. ఈ భామ తరువాతి సినిమాకు సంబంధించిన ఓ వార్త హల్‌చల్ చేస్తోంది.
సూపర్‌స్టార్ రజనీకాంత్, కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో మేఘా ఆకాష్ నటించబోతోందన్న ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చిత్రబృందం కానీ, మేఘా ఆకాష్ కానీ ఇప్పటికీ వరకు స్పందించలేదు. సన్ నెట్‌వర్క్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి, బాబి సింహా కీలకపాత్రల్లో నటించనున్నారు. మేఘా ఆకాష్ ప్రస్తుతం ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న ఓ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment