తొలి సినిమా రిలీజ్కు ముందే క్రేజీ ఆఫర్స్ | Megha Akash flooded with Offers in Telugu Industry | Sakshi
Sakshi News home page

తొలి సినిమా రిలీజ్కు ముందే క్రేజీ ఆఫర్స్

Nov 20 2016 11:14 AM | Updated on Sep 4 2017 8:38 PM

తొలి సినిమా రిలీజ్కు ముందే క్రేజీ ఆఫర్స్

తొలి సినిమా రిలీజ్కు ముందే క్రేజీ ఆఫర్స్

తమిళనాట త్వరలో రిలీజ్కు రెడీ అవుతున్న ఓ చిన్న సినిమాతో హీరోయిన్ గా పరిచయం అవుతుంది మేఘా ఆకాష్. ఒరు పాక్క కథై అనే సినిమాతో తొలిసారిగా వెండితెర మీద మెరిసేందుకు ప్లాన్...

తమిళనాట త్వరలో రిలీజ్కు రెడీ అవుతున్న ఓ చిన్న సినిమాతో హీరోయిన్ గా పరిచయం అవుతుంది మేఘా ఆకాష్. ఒరు పాక్క కథై అనే సినిమాతో తొలిసారిగా వెండితెర మీద మెరిసేందుకు ప్లాన్ చేసుకుంది. ఈ సినిమా ఇంకా రిలీజ్ కూడా కాకుండానే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మను క్రేజీ ఆఫర్స్ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న తమిళ సినిమాకు మేఘాను హీరోయిన్ గా తీసుకున్నారు.

అదే సమయంలో నితిన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు కూడా మేఘానే హీరోయిన్ అంటూ ఎనౌన్స్మెంట్ ఇచ్చేశారు. ఇప్పుడు మరో భారీ చిత్రంలో అమ్మడి ఛాన్స్ వచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. అక్కినేని నటవారసుడు అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న రెండో సినిమాలో మేఘాను హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నారట. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ జనవరిలో సెట్స్ మీదకు వెళ్లనుంది. అఖిల్ సినిమా కూడా మేఘా ఖాతాలో పడితే ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోవడం ఖాయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement