భంబోలో ఉందిరా పోరి | Megha Akash and Nithin togather doing movie | Sakshi
Sakshi News home page

భంబోలో ఉందిరా పోరి

Published Tue, Jun 13 2017 11:46 PM | Last Updated on Tue, Sep 5 2017 1:31 PM

భంబోలో ఉందిరా పోరి

భంబోలో ఉందిరా పోరి

పోరడు అమెరికా పోయిండు. అక్కడో చిన్నదాన్ని చూశాడు. ఇంకేముంది? మనోడికి పగలే వెన్నెల కాసినట్టు ఉంది. వెంటనే... ‘భంబోలే ఉన్నదిరా పోరి... బంబాటు గుందిరా నారి’ అని ఓ పాటేసుకున్నాడు. పాటతో ఆగలేదు. పోరిని ప్రేమించాడు. ఆ పోరడు నితిన్‌. పోరి మేఘా ఆకాశ్‌. వీళ్ల ప్రేమకథ ఏ కంచికి చేరిందనేది ఆగస్టు 11న తెలుస్తుంది. నితిన్, మేఘా ఆకాశ్‌ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న సినిమా ‘లై’. లవ్‌.. ఇంటెలిజెన్స్‌.. ఎన్‌మిటి.. అనేది ఉపశీర్షిక.

ఇందులో తొలి పాట ‘భంబోలే ఉన్నదిరా పోరి...’ను చికాగోలో విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘చికాగోలో విడుదల చేసిన తొలి పాటకు మంచి స్పందన లభిస్తోంది. మణిశర్మ అద్భుతమైన స్వరాలందించారు. 75 రోజుల పాటు అమెరికాలో టాకీతో పాటు భారీ యాక్షన్‌ సీన్లు తీశాం. మరో పది రోజులు హైదరాబాద్‌లో జరిగే షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణంతా పూర్తవుతుంది. ఆగస్టు 11న చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. అర్జున్, శ్రీరామ్, రవికిషన్, పృథ్వీ, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: యువరాజ్, సంగీతం: మణిశర్మ, సమర్పణ: వెంకట్‌ బోయనపల్లి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement