
హీరోయిన్ మేఘా ఆకాశ్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆమె ఎంతగానో ప్రేమించే అమ్మమ్మ బుధవారం (మార్చి 1) కన్నుమూసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడిస్తూ ఎమోషనలైంది మేఘా. 'ప్రియమైన అమ్మమ్మ.. నువ్వు లేకుండా ఎలా బతకాలి? అలాంటి ఒక రోజు వస్తుందని నేనెన్నడూ ఊహించలేదు. కానీ నేను నీలాంటిదాన్నే కాబట్టి ఎలాగోలా బతికేస్తాను. నువ్వు ఎంతో సరదాగా, దయామయురాలిగా ఉండేదానివి. అందరికీ కడుపు నింపి వారి ముఖంలో చిరునవ్వు చూసి సంతోషించేదానివి.
నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్‌వి. నీతోనే గాసిప్స్ మాట్లాడేదాన్ని. ఇకమీదట నీతో మాట్లాడలేను, నీ మాటలు వినబడవు అని ఆలోచిస్తేనే నా హృదయం ముక్కలవుతోంది. కానీ ఇప్పుడు నువ్వు కోరుకున్న నీ వ్యక్తి దగ్గరకు వెళ్లిపోయావు. మనం కలిసున్న ఆదివారాలు నేనెప్పటికీ మర్చిపోలేను. ఇకపై ఆదివారాలు ఒకేలా ఉండవు. మా అందరిలో నిన్ను చూసుకుంటాం. మాలోనే నువ్వు జీవించి ఉంటావు. నువ్వే నా ఫస్ట్ లవ్.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి..' అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment