ఆయన సినిమాల్లోని ఒక్క సీన్ అయినా వాడుకుంటా!
‘అ ఆ’ హిట్ తర్వాత ఏ సినిమా చెయ్యాలి? అనే డైలమాలో త్రివిక్రమ్‌గారికి ఫోన్ చేశా. రెగ్యులర్ సినిమా కాకుండా కొంచెం వైవిధ్యమైన సినిమా చేయమన్నారు. చాలా కథలు విన్నా.. నచ్చలేదు. హను రాఘవపూడి చెప్పిన కథ నచ్చడంతో ఫస్ట్ సిట్టింగ్‌లోనే ఓకే చేశా’’ అని నితిన్ అన్నారు. నితిన్, మేఘా ఆకాష్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి సమర్పణలో రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర నిర్మించిన ‘లై’ ఈ నెల 11న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నితిన్ చెప్పిన విశేషాలు...
♦ ఆవారాగా తిరిగే ఓ కుర్రాడు అమెరికా వెళ్లి బాగా డబ్బున్న అందమైన అమ్మాయిని పెళ్లాడి డాలర్స్ సంపాదించుకోవాలనుకుంటాడు. అలా యూఎస్ వెళ్లి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? అన్నదే ఈ చిత్రకథ. సినిమా ప్రారంభం నుంచి ఇంట్రెస్టింగ్‌గా, థ్రిల్లింగ్‌గా ఉంటుంది.
♦ ఒక ఎమోషన్‌తో, మంచి స్టైలిష్ సినిమా చూశామనే ఫీలింగ్‌తో ఆడియన్స్ థియేటర్స్ నుంచి బయటికి వస్తారు. నా మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకొని కథకు అవసరమైనంత ఖర్చుపెట్టి హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమా నిర్మించినందుకు నిర్మాతలకి థ్యాంక్స్. ఈ సినిమా చిత్రీకరణను ఎక్కువ శాతం అమెరికాలోని కాస్ట్‌లీ ప్రదేశాల్లో జరిపాం.
♦ యాక్షన్ సీన్స్ కోసం బ్యాంకాక్‌లో ట్రైనింగ్ తీసుకున్నా. కిచ్చ మాస్టర్ ఫెంటాస్టిక్ యాక్షన్ కంపోజ్ చేశారు. ‘లై’ సినిమా నాకొక కొత్త ఇమేజ్‌తోపాటు నా కెరీర్‌లో మరచిపోలేని చిత్రంగా నిలుస్తుంది.
♦ ‘శ్రీ ఆంజనేయం’ తర్వాత అర్జున్‌గారితో వర్క్ చేయడం హ్యాపీ. ఆయన్నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. సినిమాలో మా ఇద్దరి మధ్య గేమ్ థ్రిల్లింగ్‌గా ఉంటుంది. క్లైమాక్స్ ఫైట్‌లో అర్జున్‌గారు రియలిస్టిక్‌గా చేశారు.
♦ మణిశర్మగారు ఈ సినిమాకి ప్రాణం పెట్టి సంగీతం ఇచ్చారు. ఆయన రీ–రికార్డింగ్ ఎక్స్‌ట్రార్డినరీ. హను, నేను వన్ ఇయర్ నుంచి ట్రావెల్ అవుతున్నాం. ఫస్ట్ సార్.. అని పిలుచుకునేవాళ్లం. ఆ తర్వాత పేర్లు పెట్టి.. ఇప్పుడు ఏరా.. పోరా అనుకుంటున్నాం. అంత క్లోజ్ అయ్యాం.
♦ ‘తమ్ముడు’లో పవన్ కల్యాణ్‌గారు లుంగీ కట్టుకుని, బీడీ కాల్చే డ్యాన్స్ సీన్‌ని ‘లై’లో వాడాం. నేను పవన్‌కి వీరాభిమాని. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. లైఫ్‌లాంగ్ నా సినిమాల్లో ఆయన చిత్రంలోని ఏదొక సీన్ ఉపయోగిస్తాను. ఆయనంటే నాకంత ఇష్టం.
♦ ప్రస్తుతం కృష్ణచైతన్య దర్శకత్వంలో పవన్‌కల్యాణ్–త్రివిక్రమ్‌గార్లు నిర్మిస్తున్న సినిమా చేస్తున్నాను. ఇందులో మేఘా ఆకాష్ హీరోయిన్. కొన్ని కథలు వింటున్నా. ఏదీ ఫైనలైజ్ కాలేదు. చర్చల దశలోనే ఉన్నాయి.