Lai
-
అప్పుడు నిరాశపడలేదు... ఆ తర్వాత పొంగిపోలేదు
‘‘అందాల రాక్షసి’ ఫలితం చూసి నిరాశ పడలేదు. ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ విజయం చూసి పొంగిపోలేదు. హిట్టూ ఫ్లాపుల గురించి ఆలోచిస్తే క్రియేటివిటీకి దూరమైపోతామని నా అభిప్రాయం. మనసుకు నచ్చిన సినిమాలను చేసుకుంటూ వెళ్లాలన్నదే నా అభిమతం’’ అన్నారు హను రాఘవపూడి. నితిన్, మేఘా ఆకాశ్ జంటగా ఆయన దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనిల్ సుంకర నిర్మించిన సినిమా ‘లై’. వెంకట్ బోయినపల్లి చిత్రసమర్పకులు. రేపు రిలీజవుతోన్న ఈ సినిమా గురించి హను చెప్పిన సంగతులు... ⇒ అబద్ధాల వల్ల ఓ యువకుడు ఎలాంటి సమస్యల్లో చిక్కుకున్నాడనేది చిత్రకథ. అయితే... అతను చెప్పే ప్రతి అబద్ధం వెనుక ఓ నిజం దాగుంటుంది. అదే ‘లై’లో అసలు లాజిక్–మేజిక్. ప్రేక్షకులు ఆ మేజిక్‌ను క్యాచ్ చేస్తే... సినిమా చాలా సరదాగా సాగుతుంది. నాకు తెలిసి ప్రేమలేని కథ, సినిమా ఉండదు. కాకపోతే సినిమాను బట్టి, కథను బట్టి ఆ ప్రేమను చూపించే విధానం మారుతుంటుంది. ఈ ‘లై’ కూడా ప్రేమకథే. మంచి యాక్షన్ అంశాలను మేళవించి రివెంజ్ డ్రామా నేపథ్యంలో తీశా. ⇒ ఎప్పట్నుంచో నితిన్ నాతో సినిమా చేయాలనుకుంటున్నాడు. ‘అందాల రాక్షసి, కృష్ణగాడి వీరప్రేమగాథ’ సినిమాల మధ్య గ్యాప్ వచ్చినప్పుడు నా మైండ్‌లో ఓ ఐడియా వచ్చింది. వెంటనే కథ రెడీ చేశా. నితిన్‌కు చెప్పగానే నచ్చేసింది. విలన్ యాంగిల్ నుంచి సినిమా సాగుతుంది. విలన్ క్యారెక్టరైజేషన్ కూడా స్టైలిష్‌గా, డిఫరెంట్‌గా ఉంటుంది. అయితే... ఆ పాత్రకు అర్జున్‌గారు అయితే బాగుంటుందనుకున్నా. నేను ఆయనకు పెద్ద అభిమానిని. కానీ, అర్జున్‌గారి దగ్గరకెళ్లి కథ చెప్పేంత ధైర్యం లేదు. సుధాకర్‌రెడ్డిగారు (నితిన్ తండ్రి) ఆయన దగ్గరకు తీసుకెళితే, భయపడుతూనే కథ చెప్పా. ‘కథ నచ్చింది. నేను చేస్తున్నా’ అని అర్జున్‌గారు చెప్పగానే, సిన్మా హిట్టవుతుందనే నమ్మకం వచ్చేసింది. ⇒ కథ ప్రకారం, నితిన్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని సినిమా తీశాం. స్క్రీన్‌పై చూస్తే 70 కోట్ల బడ్జెట్ సినిమాలా ఉంటుంది. మా నిర్మాతలు నాకెంతో స్వేచ్ఛనిచ్చారు. అనిల్‌గారి ప్లానింగ్ సూపర్బ్. విజయం వచ్చాక మనం చెప్పేది చాలామంది వింటారు. కానీ, ఏం చెబుతున్నామనే దాంట్లో స్పష్టత లేదంటే, ఎప్పటికీ తప్పుల్ని సరిదిద్దుకునే ఛాన్స్ రాదు. ⇒ ఆర్మీ నేపథ్యంలో నానీతో ఓ స్వచ్ఛమైన ప్రేమకథ చేయబోతున్నా. దాన్ని లడఖ్‌లోనే చిత్రీకరించాలి. మే వరకు అక్కడ చిత్రీకరణ చేయలేం గనుక ఈలోపు మరో సినిమా చేయాలనుకుంటున్నా. అఖిల్ కోసం ఓ టిపికల్ సబ్జెక్ట్ రెడీ చేశా. మా మధ్య డిస్కషన్స్ కూడా జరిగాయి. కానీ, అదెప్పుడు సెట్స్‌పైకి వెళుతుందనేది చెప్పలేను. -
ఆయన సినిమాల్లోని ఒక్క సీన్ అయినా వాడుకుంటా!
‘అ ఆ’ హిట్ తర్వాత ఏ సినిమా చెయ్యాలి? అనే డైలమాలో త్రివిక్రమ్‌గారికి ఫోన్ చేశా. రెగ్యులర్ సినిమా కాకుండా కొంచెం వైవిధ్యమైన సినిమా చేయమన్నారు. చాలా కథలు విన్నా.. నచ్చలేదు. హను రాఘవపూడి చెప్పిన కథ నచ్చడంతో ఫస్ట్ సిట్టింగ్‌లోనే ఓకే చేశా’’ అని నితిన్ అన్నారు. నితిన్, మేఘా ఆకాష్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి సమర్పణలో రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర నిర్మించిన ‘లై’ ఈ నెల 11న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నితిన్ చెప్పిన విశేషాలు... ♦ ఆవారాగా తిరిగే ఓ కుర్రాడు అమెరికా వెళ్లి బాగా డబ్బున్న అందమైన అమ్మాయిని పెళ్లాడి డాలర్స్ సంపాదించుకోవాలనుకుంటాడు. అలా యూఎస్ వెళ్లి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? అన్నదే ఈ చిత్రకథ. సినిమా ప్రారంభం నుంచి ఇంట్రెస్టింగ్గా, థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ♦ ఒక ఎమోషన్‌తో, మంచి స్టైలిష్ సినిమా చూశామనే ఫీలింగ్‌తో ఆడియన్స్ థియేటర్స్ నుంచి బయటికి వస్తారు. నా మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకొని కథకు అవసరమైనంత ఖర్చుపెట్టి హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమా నిర్మించినందుకు నిర్మాతలకి థ్యాంక్స్. ఈ సినిమా చిత్రీకరణను ఎక్కువ శాతం అమెరికాలోని కాస్ట్లీ ప్రదేశాల్లో జరిపాం. ♦ యాక్షన్ సీన్స్ కోసం బ్యాంకాక్‌లో ట్రైనింగ్ తీసుకున్నా. కిచ్చ మాస్టర్ ఫెంటాస్టిక్ యాక్షన్ కంపోజ్ చేశారు. ‘లై’ సినిమా నాకొక కొత్త ఇమేజ్‌తోపాటు నా కెరీర్లో మరచిపోలేని చిత్రంగా నిలుస్తుంది. ♦ ‘శ్రీ ఆంజనేయం’ తర్వాత అర్జున్‌గారితో వర్క్ చేయడం హ్యాపీ. ఆయన్నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. సినిమాలో మా ఇద్దరి మధ్య గేమ్ థ్రిల్లింగ్‌గా ఉంటుంది. క్లైమాక్స్ ఫైట్‌లో అర్జున్‌గారు రియలిస్టిక్‌గా చేశారు. ♦ మణిశర్మగారు ఈ సినిమాకి ప్రాణం పెట్టి సంగీతం ఇచ్చారు. ఆయన రీ–రికార్డింగ్ ఎక్స్ట్రార్డినరీ. హను, నేను వన్ ఇయర్ నుంచి ట్రావెల్ అవుతున్నాం. ఫస్ట్ సార్.. అని పిలుచుకునేవాళ్లం. ఆ తర్వాత పేర్లు పెట్టి.. ఇప్పుడు ఏరా.. పోరా అనుకుంటున్నాం. అంత క్లోజ్ అయ్యాం. ♦ ‘తమ్ముడు’లో పవన్ కల్యాణ్‌గారు లుంగీ కట్టుకుని, బీడీ కాల్చే డ్యాన్స్ సీన్‌ని ‘లై’లో వాడాం. నేను పవన్‌కి వీరాభిమాని. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. లైఫ్‌లాంగ్ నా సినిమాల్లో ఆయన చిత్రంలోని ఏదొక సీన్ ఉపయోగిస్తాను. ఆయనంటే నాకంత ఇష్టం. ♦ ప్రస్తుతం కృష్ణచైతన్య దర్శకత్వంలో పవన్‌కల్యాణ్–త్రివిక్రమ్గార్లు నిర్మిస్తున్న సినిమా చేస్తున్నాను. ఇందులో మేఘా ఆకాష్ హీరోయిన్. కొన్ని కథలు వింటున్నా. ఏదీ ఫైనలైజ్ కాలేదు. చర్చల దశలోనే ఉన్నాయి. -
దర్శకులు మూడు రకాలు! – త్రివిక్రమ్
– త్రివిక్రమ్ ‘‘దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ డైరెక్టర్లు రెండు రకాలు. ఎడిటింగ్ రూమ్ డైరెక్టర్లు. సెట్ డైరెక్టర్లు అన్నారు. ఆయనకు తెలియని మూడో రకం డైరెక్టర్లు కూడా ఉన్నారు. సినిమా అంతా అయిపోయి రిలీజ్ తర్వాత ఇది ఇలాకన్నా ఇంకోలా చేస్తే బాగుండు అనుకుంటాను. అది నేను. సో .. మూడో రకం డైరెక్టర్లు కూడా ఉన్నారు’’ అన్నారు డైరెక్టర్ త్రివిక్రమ్. నితిన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘లై’. వెంకట్ బోయనపల్లి సమర్పణలో రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. మణిశర్మ స్వరకర్త. ఈ సినిమా ప్రీ–రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. థియేట్రికల్ ట్రైలర్‌ను సుకుమార్, ఆడియోను త్రివిక్రమ్ లాంచ్ చేశారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ– ‘‘నేను మణిశర్మ ఫ్యాన్‌ని. ఆయన గురించి చెప్పే స్థాయి మనకు లేదు. ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా హిట్ అవుతుందనుకున్నాను. రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర, వెంకట్‌లా సినిమాను ప్రేమించి తీసే నిర్మాతలు చాలా తక్కువ మంది ఉంటారు’’ అన్నారు. డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ– ‘‘డైరెక్టర్లు రెండు రకాలు. ఎడిటింగ్ రూమ్ డైరెక్టర్, సెట్ డైరెక్టర్. నేను ఎడిటింగ్ రూమ్ డైరెక్టర్‌ను. హను సెట్లో సీన్‌ను ఊహించగలడు. రామ్‌గారి ప్రేమ, గోపీగారి నిశ్శబ్దం, అనిల్‌గారి దూకుడు కలిస్తే 14 రీల్స్. ఇప్పుడు వీరికి తోడుగా వెంకట్ వచ్చారు. వారి కోసం సినిమా పెద్ద హిట్ కావాలి. నితిన్ లుక్ బాగుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా అవుట్‌పుట్ బాగా రావడం వెనక చిత్రబృందం కృషి ఎంతో ఉంది. ఈ సినిమాను నితిన్ నాకన్నా ఎక్కువగా నమ్మాడు’’ అన్నారు హను రాఘవపూడి. నితిన్ మాట్లాడుతూ– ‘‘కల్యాణ్ (పవన్ కల్యాణ్) గారు ఈ ఫంక్షన్‌కి రాలేదు. ఆయన సోల్మెట్ త్రివిక్రమ్ వచ్చారు కాబట్టి, ఆయన వచ్చినట్టే. నా కెరీర్లో ఇది 24వ సినిమా. నెక్ట్స్ 25వ సినిమా కల్యాణ్‌గారి ఫస్ట్ ప్రొడక్షన్లో నేను చేయబోతున్న ఫస్ట్ సినిమా. అంతకంటే ఒక ఫ్యాన్‌గా నాకేం కావాలి. అనిల్‌గారు నా స్వీట్ హార్ట్. గోపీగారు, రామ్‌గారు, వెంకట్‌గారు చాలా ప్యాషనెట్ అండ్ డేరింగ్ ప్రొడ్యూసర్స్. హనూకి సినిమా అంటే పిచ్చి, ప్యాషన్. మణిశర్మ మంచి మ్యూజిక్ ఇచ్చారు. రీ–రికార్డింగ్ ఇంటర్నేషనల్ లెవల్లో ఉంటుంది’’ అన్నారు. నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ– ‘‘మూవీ స్టార్ట్ చేసిన రోజునే ఆగస్టు 11న రిలీజ్ అనుకున్నాం. ఇప్పుడు అదే రోజున రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. ఈ వేడుకలో చిత్రబృందంతో పాటు పలువురు అతిథులు పాల్గొన్నారు.