
‘‘బొంబాటుగుందిరా పోరి...’’ అని పాడుతూ మేఘా ఆకాశ్‌ని ’లై’ సినిమాలో ఆటపట్టించారు నితిన్. తెలుగులో మేఘా ఆకాశ్‌కి ఇది తొలి సినిమా. ఆ పాట చాలా ఫేమస్. ఈ సినిమా ద్వారా మేఘాకి బాగానే పేరొచ్చింది. ఆ తర్వాత ’చల్ మోహనరంగ’ సినిమాలో నటించారామె. రజనీకాంత్ ’పేటా’లో కూడా మంచి పాత్ర చేశారీ బ్యూటీ. ఇప్పుడు తెలుగులో ‘గుర్తుందా శీతాకాలం’లో అతిథి పాత్ర చేయడానికి అంగీకరించారు. సత్యదేవ్, తమన్నా జంటగా రొమాంటిక్ ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. నాగశేఖర్, భావనా రవి నిర్మిస్తున్నారు. నాగశేఖర్ దర్శకుడు. నేటినుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో జరుపుకోనుంది. హీరో సత్యదేవ్ పాత్రతో మేఘా పాత్ర ట్రావెల్ అవుతుందట. ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నవీన్ చింతల.
Comments
Please login to add a commentAdd a comment