
తమిళం, తెలుగు, హిందీ భాషల్లో స్టార్ హీరోలతో నటించిన యువ తమిళ నటి మేఘా ఆకాష్. ముఖ్యంగా తమిళంలో రజనీకాంత్‌తో కలిసి పేట చిత్రంలోనూ, ధనుష్ సరసన ఎనై నోక్కి పాయుమ్ తూటా చిత్రంలోనూ నటించింది. అదేవిధంగా శింబుకు జంటగా వందా రాజాదాన్ వరువేన్ చిత్రంలో నటించింది. అయితే ఇప్పటికీ ఈ భామకు అనుకున్న స్థాయిలో స్టార్ అంతస్థు రాలేదని చెప్పాలి.
అందుకు కారణం సరైన సక్సెస్ పడకపోవడమే అని భావించవచ్చు. కాగా ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన గురించి తెలుపుతూ తాను చైన్నెలో పుట్టిన పెరిగిన అచ్చ తమిళ అమ్మాయినని చెప్పింది. అమ్మ, నాన్నలకు ఒకత్తే కూతురునని, బీఎస్సీ విజువల్ కమ్యూనికేషన్ చదివినట్లు తెలిపింది. నాకు చిన్నతనంలో బిడియం ఎక్కువ అని చెప్పింది. నలుగురితో ధైర్యంగా మాట్లాడడం కూడా తెలీదని, దానిని మార్చుకోవాలని భావించినట్లు పేర్కొంది.
దీంతో తాను చదువుకుంటునే పాకెట్ మనీ కోసం చిన్న చిన్న వాణిజ్య ప్రకటనల్లో నటించానని చెప్పింది. ఆ తరువాత సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయని తెలిపింది. తన చూట్టూ ఉన్న తన తల్లి తనతో ఉండాల్సిందేనని చెప్పింది. చిత్ర షూటింగ్‌లకు కూడా తనతో తల్లి వస్తుందని తెలిపింది. తనకు క్రికెట్ క్రీడాకారుడు ఎంఎస్ ధోని అంటే చాలా ఇష్టమని, తాను ఆయన వీరాభిమానినని చెప్పింది. ఇక నటి త్రిష అంటే చాలా ఇష్టమని పేర్కొంది. పుస్తకాలు చదవడం, పాటలు వినడం తన హాబీ అని మేఘా ఆకాష్ పేర్కొంది.
వైరల్‌గా ఫోటో!
ఇదిలాఉండగా.. ఇటీవల చెపాక్ వేదికగా చెన్నై, రాజస్థాన్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. మ్యాచ్ వీక్షించేందుకు వెళ్లిన మేఘ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. చప్పట్లు కొడుతూ ధోని టీమ్‌ను ఎంకరేజ్ చేసింది. చెన్నై ఓడిపోవడంతో ఒకింత నిరాశకు గురైంది. ఈనేపథ్యంలో ధోనితో కలిసి ఆమె దిగిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment