నిహారిక స్థానంలో మేఘా ఆకాశ్‌ | Megha Akash Replaces Niharika Konidela In Ashok Selvan Next Movie | Sakshi
Sakshi News home page

నిహారిక స్థానంలో మేఘా ఆకాశ్‌

Published Thu, Sep 10 2020 8:18 PM | Last Updated on Thu, Sep 10 2020 8:40 PM

Megha Akash Replaces Niharika Konidela In Ashok Selvan Next Movie - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అశోక్‌ సెల్వన్‌ హీరోగా త్వరలో తెరకెక్కనున్న ఓ చిత్రంలో మెగా డాటర్‌ కొణిదెల నిహారిక స్థానంలో మేఘా ఆకాశ్‌ నటించనున్నారు. కెనన్యా ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్వాతిని తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా మొదట నిహారిక ఎంపికైంది. అయితే ఇటీవల నిహారిక నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.  త్వరలో ఆమె పెళ్లి పీటల ఎక్కనున్న నేపథ్యంలో డేట్స్‌ లేకపోవడంతో ఈ చిత్రం నుంచి నిహారిక వైదొలగినట్లు సమాచారం. ఆమె స్థానంలో మేఘా ఆకాశ్‌ను ఎంపిక చేసినట్లు చిత్ర బృందం ఇటీవల వెల్లడించింది. (చదవండి: నిహారిక - చైత‌న్య‌ల నిశ్చితార్థం)

దీనిపై నిర్మాత సెల్వకుమార్ స్పందిస్తూ..‌ ఈ చిత్రంలో హీరోయిన్‌ పాత్ర విభిన్నంగా ఉంటుందన్నారు. అందుకే తొలుత నిహారికను ఎంచుకున్నామన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఈ పాత్రకు హీరోయిన్‌ మేఘా ఆకాశ్‌ సరిగ్గా సరిపోతుందని దర్శకురాలు పేర్కొన్నారు. ఆ పాత్రకు మేఘా సరిపోతుందనిపించి  వెంటనే ఆమెను సంప్రదించి కథను వివరించామన్నారు. తనకు కూడా కథ నచ్చడంతో ఒకే చెప్పిందన్నారు. త్వరలోనే సినిమా టైటిల్‌ను ఖరారు చేసి వచ్చే నెలలో షూటింగ్‌ ప్రారంభిస్తామని నిర్మాత పేర్కొన్నారు. (చదవండి: నిహారిక ఎంగేజ్‌మెంట్‌: వైరల్‌ వీడియో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement