హీరోయిన్ల హంగామా! | Trisha 31th Birthday Celebration | Sakshi
Sakshi News home page

హీరోయిన్ల హంగామా!

Published Mon, May 5 2014 10:39 PM | Last Updated on Sat, Sep 2 2017 6:58 AM

హీరోయిన్ల హంగామా!

హీరోయిన్ల హంగామా!

తారలు దిగి వచ్చిన వేళ... మల్లెలు నడిచొచ్చిన వేళ... అన్నట్టుగా ఆదివారం రాత్రి చెన్నైలోని ఓ ప్రై వేట్ హోటల్‌లో దక్షిణాది అగ్రశ్రేణి కథానాయికలంతా సందడి చేశారు. రమ్యకృష్ణ, నయనతార, త్రిష, అమలాపాల్... ఇలా ఈ అందాల తారలందరూ కలిసి పండగ చేసుకున్నారు. ఈ పండగకు ముఖ్య కారకురాలు త్రిష. ఆదివారం తన పుట్టినరోజు. ఈ వేడుకను అత్యంత సన్నిహితుల మధ్య జరుపుకున్నారామె. ఒకప్పుడు నయనతార, త్రిష మధ్య మనస్పర్థలున్నప్పటికీ ఆ తర్వాత స్నేహితులయ్యారు. రమ్యకృష్ణ, త్రిష ఎప్పట్నుంచో క్లోజ్‌ఫ్రెండ్స్. ఇక అమలాపాల్, నికిషా పటేల్.. ఇలా త్రిష స్నేహితుల జాబితాలో చాలామందే ఉన్నారు. వీళ్లల్లో త్రిష బర్త్‌డే పార్టీకి చాలామంది హాజరయ్యారు. వాళ్లతో కలిసి బర్త్‌డే బేబీ త్రిష ఫొటోలు దిగారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement