‘బాహుబలి’లో రాజమాతగా?
‘బాహుబలి’లో రాజమాతగా?
Published Thu, Aug 15 2013 1:04 AM | Last Updated on Fri, Sep 1 2017 9:50 PM
గ్లామర్, నాన్-గ్లామర్.. ఏ పాత్రనైనా సునాయాసంగా చేయగలరు రమ్యకృష్ణ. అమ్మాయిలా యువహృదయాల్లో కలవరం పుట్టించి, అమ్మోరుగా చేతులెత్తి మొక్కేలా అభినయించారామె. ఇక, నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర అయితే ఏ స్థాయిలో విజృంభిస్తారో చెప్పడానికి ‘నరసింహ’ సినిమాలో నీలాంబరి కేరక్టర్ చాలు.
ఇప్పుడు రమ్యకృష్ణ రాజమాతగా మౌల్డ్ అయ్యారని సమాచారం. భారీ చిత్రం ‘బాహుబలి’ కోసమే ఆమె ఈ అవతారం ఎత్తారని వినికిడి. ప్రభాస్, రానా, అనుష్క కాంబినేషన్‌లో రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.
ఇందులో ప్రభాస్, రానాల తల్లిగా రమ్యకృష్ణ నటిస్తున్నారట. రియల్ లైఫ్‌లో ఇంత పెద్ద కొడుకులు ఉండే వయసులో రమ్య లేకపోయినా రీల్ మీద ఈ పాత్రను అద్భుతంగా పోషిస్తారనే నమ్మకంతోనూ పైగా ఇది రాజసం ఉట్టిపడే పాత్ర కాబట్టి ఆమెను తీసుకుని ఉంటారని ఊహించవచ్చు.
Advertisement
Advertisement