
బాలకృష్ణుడు...పేరు కొంచెం క్లాసీగా ఉన్నా కుర్రాడిలో మాత్రం మాస్ లక్షణాలు పుష్కలంగా ఉన్నట్లున్నాయి. ఏదైనా తేడా కొట్టిందో విలన్స్‌ను ఇరగదీస్తాడంతే. సిక్స్‌ప్యాక్ ఉన్నప్పుడు ఆ మాత్రం కుమ్మేయడానికి ఆలోచించడు కదా. హీరో నారా రోహిత్‌నే ఈ నయా బాలకృష్ణుడు. పవన్ మల్లెల దర్శకత్వంలో ఆయన హీరోగా రూపొందుతున్న చిత్రం ‘బాలకృష్ణుడు’.
సరస్‌చంద్రిక విజనరీ మోషన్ పిక్చర్స్, మాయా బజార్ మూవీస్ పతాకాలపై మహేంద్రబాబు, ముసునూను వంశీ, శ్రీ వినోద్ నందమూరి నిర్మిస్తున్నారు. రెజీనా కథనాయిక. మణిశర్మ స్వరకర్త. రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. దేవి నవరాత్రుల సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ‘‘కంప్లీట్ కమర్షియల్ చిత్రమిది. ఈ సినిమా కోసం నారా రోహిత్ తొలిసారి సిక్స్‌ప్యాక్ చేశారు. ఆయన సూపర్‌గా నటిస్తున్నారు. పవన్ మల్లెల చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. దసరాకు టీజర్‌ను రిలీజ్ చేయనున్నాం. మణిశర్మగారి మ్యూజిక్ సినిమాకు హైలైట్’’ అన్నారు.