తేడా వస్తే! | 'Balakrishnudu' starring Nara Rohith and Regina to release on 10 | Sakshi
Sakshi News home page

తేడా వస్తే!

Published Fri, Nov 3 2017 12:14 AM | Last Updated on Fri, Nov 3 2017 12:14 AM

'Balakrishnudu' starring Nara Rohith and Regina to release on 10 - Sakshi

బాలకృష్ణుడు..పేరుకు తగ్గట్లే కుర్రాడు కూల్‌గా ఉంటాడు. కామ్‌గా తన పనేంటో తాను చూసుకుంటాడు. కానీ, ఏదైనా తేడా వస్తే మాత్రం తాట తీస్తాడు. ఇంతకీ ఈ బాలకృష్ణుడు ఎవరో కాదు.. హీరో నారా రోహిత్‌. పవన్‌ మల్లెల దర్శకత్వంలో నారా రోహిత్‌ హీరోగా రూపొందిన చిత్రం ‘బాలకృష్ణుడు’. శరత్‌చంద్రిక విజనరీ మోషన్‌ పిక్చర్స్, మాయా బజార్‌ పిక్చర్స్‌ పతాకాలపై బి. మహేంద్రబాబు, ముసునూరు వంశీ, వినోద్‌ నందమూరి నిర్మించిన ఈ సినిమాను ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

పాటలను ఈ నెల 10న విడుదల చేయనున్నారు. ‘‘కమర్షియల్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రమిది. ఈ సినిమా కోసం నారా రోహిత్‌ సిక్స్‌ప్యాక్‌ చేశారు. రమ్యకృష్ణ ఓ పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌లో నటించారు. రెజీనా బాగా నటించింది. ఇక మణిశర్మగారి సంగీతం సూపర్‌. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు నిర్మాతలు. కోట శ్రీనివాసరావు, పృథ్వీ, ఆదిత్యా మీనన్, దీక్షా పంత్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా విజయ్‌ సి. కుమార్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement