
రెజీనా కోసం రాశీఖన్నా..!
హీరోలే కాదు.. ఈ జనరేషన్ హీరోయిన్లు కూడా మల్టీ టాలెంటెడ్ గా ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నారు. సినిమాల్లో నటనతో పాటు ఇతర విభాగాల్లోనూ సత్తా చాటేందుకు ఉత్సాహపడుతున్నారు. అదే బాటలో హీరోయిన్ రాశీ ఖన్నా కూడా గాయనిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉంది. తను హీరోయిన్ గా నటించిన జోరు సినిమా కోసం తొలి సారిగా పాట పాడింది రాశీ.
తరువాత మలయాళ చిత్రం విలన్ లోనూ గొంతు సవరించుకుంది. తాజాగా నారా రోహిత్ హీరోగా తెరకెక్కుతున్న బాలకృష్ణుడు సినిమాలో పాట పాడుతుంది. అయితే ఈ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్ కాదు. తొలి చిత్రాల్లో తన క్యారెక్టర్ కోసం పాట పాడిన రాశీ ఖన్నా, తొలిసారిగా రెజీనా పాత్ర కోసం పాడుతోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణం దశలో ఉంది.