
ఆల్ సెట్ అయితే హీరో రామ్‌చరణ్ నెక్ట్స్ టార్గెట్ చేసే విలన్ నేమ్ ప్రతాప్ రవినే అని ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ఎవరీ ప్రతాప్ రవి? అంటే... రక్తచరిత్రను బయటికి తీయాల్సిందే. కన్‌ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా చెప్పేస్తాం. రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘రక్తచరిత్ర’ సినిమాలో ప్రతాప్ రవి క్యారెక్టర్‌ను బీ టౌన్ యాక్టర్ వివేక్ ఒబెరాయ్ చేసిన విషయం తెలిసిందే.
అంతేకాదు అజిత్ హీరోగా చేసిన తమిళ చిత్రం ‘వివేగం’
లో వివేక్ ఒబెరాయ్‌నే విలన్. మళ్లీ తెలుగు తెరపై వివేక్ కనిపించనున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. రామ్ చరణ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో వివేక్‌ను ప్రతినాయకుడి పాత్రకు సెలక్ట్ చేయాలని చిత్రబృందం ఆలోచిస్తోందని ఫిల్మ్‌నగర్ టాక్. అంతే కాదండోయ్.. ఓ కీలక పాత్రకు శివగామిని.. అదేనండి.. రమ్యకృష్ణను సంప్రదించారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment