ఆస్ట్రేలియాలో ఎన్నారై యువతి అనుమానస్పద మృతి | hyderabad woman dies in australia | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియాలో ఎన్నారై యువతి అనుమానస్పద మృతి

May 28 2016 8:22 AM | Updated on Sep 4 2017 1:08 AM

ఆస్ట్రేలియాలో ఎన్నారై యువతి అనుమానస్పద మృతి

ఆస్ట్రేలియాలో ఎన్నారై యువతి అనుమానస్పద మృతి

ఆస్ట్రేలియాలో హైదరాబాద్కు చెందిన ఓ యువతి అనుమానస్పదంగా మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్: ఆస్ట్రేలియాలో హైదరాబాద్కు చెందిన ఓ యువతి అనుమానస్పదంగా మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కూకట్‌పల్లికి చెందిన రమ్యకృష్ణ అనే యువతి నాలుగు ఏళ్ల క్రితం ఆస్ట్రేలియాకు చెందిన మహంత్‌తో వివాహమైంది. వారం కిందట ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. గత కొంతకాలంగా అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేస్తునట్లు ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు.

వివరాల్లోకి వెళితే... వరంగల్ జిల్లా గోవిందరావుపేటకు చెందిన పూర్ణచంద్రరావు విద్యుత్ శాఖలో పనిచేస్తున్నారు. ఆ కుటుంబం ప్రస్తుతం కూకట్‌పల్లిలో నివాసం ఉంటోంది. ఆయన కుమార్తె రమ్యకృష్ణకు మెల్‌బోర్న్‌కు చెందిన మహంత్‌తో వివాహమైంది. వివాహ సమయంలో రెండు అపార్టుమెంట్లు, కిలో బంగారు ఆభరణాలు కట్నంగా ఇచ్చారు. మహంత్ చేపట్టిన పిజ్జా వ్యాపారం కోసం కూడా రూ.40 లక్షలు అందజేశారు. అయితే, ఈ దంపతులకు పిల్లల్లేరు.

ఈ నేపథ్యంలో వారం క్రితం రమ్యకృష్ణ చనిపోయినట్లు కుటుంబసభ్యులకు అక్కడి నుంచి సమాచారం అందింది. శుక్రవారం రాత్రి విమానంలో ఆమె మృతదేహం హైదరాబాద్ చేరుకుంది. కుటుంబసభ్యులు, బంధువులు మృతదేహాన్ని పరిశీలించి, అత్తింటి వారే చంపారని ఆరోపిస్తున్నారు. చనిపోయిందని చెబుతున్న రోజు కూడా ఆమె తమతో ఫోన్‌లో మాట్లాడిందని చెబుతున్నారు. వ్యాపారంలో నష్టాన్ని భర్తీ చేసేందుకు అదనపు కట్నం కోసం మహంత్ వేధిసున్నాడని తెలుస్తుంది. అయితే, పిల్లలు పుట్టలేదని ఆమెను హింసించారని ఉంటారని వారు ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement