
బిగ్‌బాస్ ఆరో వారాంతంలో రాజమాత శివగామి హోస్ట్‌గా వ్యవహరించనుంది. బిగ్‌బాస్ రాజ్యాన్ని చక్కదిద్దేందుకు శివగామి అధికారాన్ని చేపట్టింది. ఈ వీకెండ్‌లో హోస్ట్‌గా వచ్చి.. ఇంటి సభ్యులతో పాటు, ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేందుకు రమ్యకృష్ణ రెడీ అయింది. నాగార్జున విదేశాల్లో ఉండటంతో ఈ వీకెండ్‌ను ఓ స్పెషల్ గెస్ట్‌చే నిర్వహిస్తారనే వార్తలు వైరల్ అయినా.. అవన్నీ రూమర్సే అని కొట్టిపారేశారు.
చివరకు అవే నిజమయ్యాయి. రాజు దూరంగా ఉన్నప్పుడు.. రాణి వచ్చిందంటూ రిలీజ్ చేసిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఈ వీకెండ్ ఎలా ఉండబోతుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే నా మాట.. నా మాటే శాసనం అని తనశైలిలో చెప్పిన డైలాగ్ హైలెట్‌గా నిలిచింది. ఈ వారం ఎలిమినేషన్ ఉండబోదని మరో టాక్ వినిపిస్తోంది. మరి నేటి ఎపిసోడ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ ఏరేంజ్‌లో ఉంటుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment