దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన తొలి పాన్ ఇండియా చిత్రం ‘బాహుబలి’. ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూవీతో తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇందులో బాహుబలి, దేవసేన, కట్టప్ప, భళ్లాలదేవుడు, కాలకేయ, శివగామి పాత్రలు ఎంతో ప్రేక్షకాదరణ పొందాయి. అందులో ముఖ్యంగా రాజమాత శివగామి రోల్‌ను ఇప్పటికీ మర్చిపోలేదు. ఈ పవర్ఫుల్ రోల్ చేసిన రమ్యకృష్ణకు విశేషమైన గుర్తింపు దక్కింది.
చదవండి: చిరు ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. ‘మెగా154’ నుంచి క్రేజీ అప్‌డేట్
ఈ పాత్ర ఆమె కోసమే క్రియేట్ చేశారా? అనేంతగ రాజమాతగా రమ్యకృష్ణ ఒదిగిపోయారు. ఇందులో శివగామిగా రమ్యకృష్ణ తప్ప మరే నటి చేసిన అంతగా గుర్తింపు వచ్చి ఉండేది కాదని రాజమౌళితో సహా అందరు అభిప్రాయపడ్డారు. అయితే మొదట ఈ రోల్ కోసం రాజమౌళి మంచు లక్ష్మిని సంప్రదించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్‌కు అమ్మగా తాను చేయలేనని మంచు లక్ష్మి ఈ ఆఫర్‌ను వదులుకుంది. ఇదే విషయాన్ని ఎన్నో సందర్భాల్లో స్వయంగా మంచు లక్ష్మియే చెప్పుకొచ్చింది. తాజాగా మరోసారి ఇదే విషయంపై ఆమె స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించిన ఆమె బాహుబలిలో తాను శివగామి పాత్ర చేయనందుకు గర్వపడుతున్నానంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
చదవండి: 31 ఏళ్ల తర్వాత మళ్లీ రిపీట్ కాబోతోన్న ‘దళపతి’ కాంబినేషన్
‘బాహుబలిలో శివగామి పాత్ర కోసం నన్ను సంప్రదించారు. అయితే ప్రభాస్‌కు తల్లిగా చేయాలనుకోలేదు. ఇండియాలో మనం ఒక పాత్ర పోషించిన తర్వాత దానిలోనే ఉండిపోతాం. కానీ నేను మాత్రం ఒకే తరహా పాత్రలకు పరిమితం కావాలనుకోలేదు. బాహుబలి సినిమా అంత పెద్ద హిట్ అయ్యాక .. నిజానికి నేను చాలా గర్వపడ్డాను. హమ్మయ్యా.. నేను ఆ సినిమా చేయలేదు అనుకున్నాడు. అది ఓ ప్రత్యేకమైన సినిమా కావచ్చు. కానీ ఆ పాత్రకు నేను కరెక్ట్ అనిపించలేదు. నా జీవితం.. నా కెరీర్ దృష్టిలో పెట్టుకుని ఆ నిర్ణయం తీసుకున్నాను. అలాగే నేను నా కెరీర్‌లో నేను చేసిన ఐరేంద్రి(అనగనగా ఓ ధీరుడు చిత్రంలోని పాత్ర) లాంటి పాత్ర ఇంకోటి రాలేదు. ఇక మీదట రాదు కూడా’ అని ఆమె పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment