shivagami
-
‘బాహుబలి’ ఆఫర్ వదులుకున్నందుకు గర్వపడుతున్నా: మంచు లక్ష్మి
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన తొలి పాన్ ఇండియా చిత్రం ‘బాహుబలి’. ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూవీతో తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇందులో బాహుబలి, దేవసేన, కట్టప్ప, భళ్లాలదేవుడు, కాలకేయ, శివగామి పాత్రలు ఎంతో ప్రేక్షకాదరణ పొందాయి. అందులో ముఖ్యంగా రాజమాత శివగామి రోల్‌ను ఇప్పటికీ మర్చిపోలేదు. ఈ పవర్ఫుల్ రోల్ చేసిన రమ్యకృష్ణకు విశేషమైన గుర్తింపు దక్కింది. చదవండి: చిరు ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. ‘మెగా154’ నుంచి క్రేజీ అప్డేట్ ఈ పాత్ర ఆమె కోసమే క్రియేట్ చేశారా? అనేంతగ రాజమాతగా రమ్యకృష్ణ ఒదిగిపోయారు. ఇందులో శివగామిగా రమ్యకృష్ణ తప్ప మరే నటి చేసిన అంతగా గుర్తింపు వచ్చి ఉండేది కాదని రాజమౌళితో సహా అందరు అభిప్రాయపడ్డారు. అయితే మొదట ఈ రోల్ కోసం రాజమౌళి మంచు లక్ష్మిని సంప్రదించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్‌కు అమ్మగా తాను చేయలేనని మంచు లక్ష్మి ఈ ఆఫర్‌ను వదులుకుంది. ఇదే విషయాన్ని ఎన్నో సందర్భాల్లో స్వయంగా మంచు లక్ష్మియే చెప్పుకొచ్చింది. తాజాగా మరోసారి ఇదే విషయంపై ఆమె స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించిన ఆమె బాహుబలిలో తాను శివగామి పాత్ర చేయనందుకు గర్వపడుతున్నానంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. చదవండి: 31 ఏళ్ల తర్వాత మళ్లీ రిపీట్ కాబోతోన్న ‘దళపతి’ కాంబినేషన్ ‘బాహుబలిలో శివగామి పాత్ర కోసం నన్ను సంప్రదించారు. అయితే ప్రభాస్‌కు తల్లిగా చేయాలనుకోలేదు. ఇండియాలో మనం ఒక పాత్ర పోషించిన తర్వాత దానిలోనే ఉండిపోతాం. కానీ నేను మాత్రం ఒకే తరహా పాత్రలకు పరిమితం కావాలనుకోలేదు. బాహుబలి సినిమా అంత పెద్ద హిట్ అయ్యాక .. నిజానికి నేను చాలా గర్వపడ్డాను. హమ్మయ్యా.. నేను ఆ సినిమా చేయలేదు అనుకున్నాడు. అది ఓ ప్రత్యేకమైన సినిమా కావచ్చు. కానీ ఆ పాత్రకు నేను కరెక్ట్ అనిపించలేదు. నా జీవితం.. నా కెరీర్ దృష్టిలో పెట్టుకుని ఆ నిర్ణయం తీసుకున్నాను. అలాగే నేను నా కెరీర్లో నేను చేసిన ఐరేంద్రి(అనగనగా ఓ ధీరుడు చిత్రంలోని పాత్ర) లాంటి పాత్ర ఇంకోటి రాలేదు. ఇక మీదట రాదు కూడా’ అని ఆమె పేర్కొంది. -
చిన్నప్పటి మహేంద్ర బాహుబలిని ఇప్పుడు చూశారా..
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ బాహుబలి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపించిన విషయం తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ సినిమా రెండు భాగాలు తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలు వ్యాపించేలా చేసింది. ఈ సినిమాలో బాహుబలిగా ప్రభాస్‌కు ఎంత పేరు వచ్చిందో, భళ్ళాదేవుడుగా రానా కూడా అదే స్థాయిలో మెప్పించారు. ఇక శివగామిగా రమ్యకృష్ణ పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అయితే బాహుబలి- ది బిగినింగ్‌లో శివగామి తన చేతిలో ఉన్న చిన్నారిని నీటిలో మునగకుండా పైకి లేపి “మహేంద్ర బాహుబలి బ్రతకాలి ” అంటూ తుది శ్వాస విడిచిన సన్నివేశం అందరికీ గుర్తుండే ఉంటుంది. చదవండి: ఆచార్య: 20 నిమిషాల కోసం రూ. కోటి పసిబిడ్డను రెండు చేతులతో పైకి ఎత్తి పట్టుకుని ప్రవాహానికి ఎదురు వెళ్లడం. పైకి ఎత్తుకున్న రెండు చేతుల్లోని పసిబిడ్డ పోస్టర్ కూడా అప్పట్లో విపరీతంగా పాపులర్ అయింది. ఈ అద్భుతమైన ఆ దృశ్యం ప్రేక్షకుల జ్ఞాపకాల నుంచి ఇప్పటికీ చెదిరిపోదు. అయితే ఆ చిన్నారిని చిన్నప్పటి ప్రభాస్‌గా మనకు చూపించగా, ఆ పాత్ర పోషించింది తన్వి అనే అమ్మాయి. సినిమాలో నెలల పిల్లగా చిన్నగా చూపించగా, ఇప్పుడు ఆమె చాలా పెద్దది అయ్యింది. ఇప్పుడే స్కూల్‌కు కూడా వెళుతోంది. యూకేజీ చదువుతోంది. ప్రస్తుతం కొందరు తన్వితో దిగిన ఫోటోలను ట్విటర్లో పోస్టు చేయడంతో ఆ ఫొటోలు ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. చదవండి: బాహుబలిని తలపించే ఫేక్ వీడియో వైరల్ బాహుబలి సినిమాలో కట్టప్ప ఎత్తుకున్న ఈ పాప(మహేంద్ర బాహుబలి) ఇప్పుడు యూకేజీ చదువుతుంది. పేరు తన్వి. @ssrajamouli pic.twitter.com/Aj31XvG6EB — DONTHU RAMESH (@DonthuRamesh) January 27, 2021 -
గోదావరిలో శివగామి..
రాజమండ్రి/కొవ్వూరు : గోదావరి పుష్కరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. పుష్కర ఘాట్లకు లక్షలాది మంది భక్తులు వచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లాల్లోని పుష్కర ఘాట్ల వద్ద ఓ ఆసక్తికర దృశ్యం కనిపించింది. బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ శివగామి పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో శివగామి ఒంటి చెత్తో ఓ శిశువును పట్టుకొని వాగులో ఉంటుంది. అలాంటి చిత్రమే రెండు ప్రాంతాల్లో కనిపించింది. కొవ్వూరులో ఓ తల్లి ఇద్దరు బిడ్డలను, రాజమండ్రిలో ఓ తల్లి తన బిడ్డను గోదావరిలో ఒంటి చెత్తో పైకి ఎత్తిన దృశ్యం కనిపించింది. ఇదిలా ఉండగా, నాలుగో రోజైన శుక్రవారం పుష్కర ఘాట్లు భక్తులతో కిటకిటలాడాయి. వేల సంఖ్యలో పిండ ప్రదానం చేశారు. ఉభయ గోదావరి జిల్లాల్లో 30 లక్షల మందికి పైగా భక్తులు స్నానాలు ఆచరించారని తెలుస్తోంది.