Mahendra Bahubali Thanvi's Latest Photos Goes Viral On Social Media- Sakshi
Sakshi News home page

చిన్నప్పటి మహేంద్ర బాహుబలి ఇప్పుడెలా ఉందో చూడండి..

Published Thu, Jan 28 2021 5:33 PM | Last Updated on Thu, Jan 28 2021 8:11 PM

Bahubali Baby Girl Photos Goes Viral On Social Media - Sakshi

ద‌ర్శ‌క‌ ధీరుడు రాజ‌మౌళి  తెర‌కెక్కిన భారీ బ‌డ్జెట్ మూవీ బాహుబ‌లి బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపించిన విషయం తెలిసిందే. ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందించిన ఈ సినిమా రెండు భాగాలు తెలుగు సినిమా ఖ్యాతిని ద‌శ‌దిశ‌లు వ్యాపించేలా చేసింది. ఈ సినిమాలో బాహుబలిగా ప్ర‌భాస్‌కు ఎంత పేరు వచ్చిందో, భ‌ళ్ళాదేవుడుగా రానా కూడా అదే స్థాయిలో మెప్పించారు. ఇక శివగామిగా ర‌మ్య‌కృష్ణ పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అయితే బాహుబలి- ది బిగినింగ్‌లో శివ‌గామి త‌న చేతిలో ఉన్న‌ చిన్నారిని నీటిలో మున‌గ‌కుండా పైకి లేపి “మహేంద్ర బాహుబలి బ్రతకాలి ” అంటూ తుది శ్వాస విడిచిన సన్నివేశం అందరికీ గుర్తుండే ఉంటుంది. చదవండి: ఆచార్య: 20 నిమిషాల కోసం రూ. కోటి

పసిబిడ్డను రెండు చేతులతో పైకి ఎత్తి పట్టుకుని ప్రవాహానికి ఎదురు వెళ్లడం. పైకి ఎత్తుకున్న రెండు చేతుల్లోని పసిబిడ్డ పోస్టర్ కూడా అప్పట్లో విపరీతంగా పాపులర్ అయింది.  ఈ అద్భుతమైన ఆ దృశ్యం ప్రేక్షకుల జ్ఞాపకాల నుంచి ఇప్పటికీ చెదిరిపోదు. అయితే ఆ చిన్నారిని చిన్న‌ప్ప‌టి ప్ర‌భాస్‌గా మ‌న‌కు చూపించ‌గా, ఆ పాత్ర పోషించింది తన్వి అనే అమ్మాయి. సినిమాలో నెల‌ల పిల్ల‌గా చిన్నగా చూపించ‌గా, ఇప్పుడు ఆమె చాలా పెద్దది అయ్యింది. ఇప్పుడే స్కూల్‌కు కూడా వెళుతోంది. యూకేజీ చదువుతోంది. ప్ర‌స్తుతం కొందరు తన్వితో దిగిన ఫోటోలను ట్విటర్‌లో పోస్టు చేయడంతో ఆ ఫొటోలు ఒక‌టి సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. చదవండి: బాహుబలిని తలపించే ఫేక్‌ వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement