Tanvi
-
హేమ కమిటీపై తన్వి రామ్ సంచలన కామెంట్స్..
-
ఆసియా అండర్–15 బాలికల సింగిల్స్ విజేత తన్వీ పత్రి
ఆద్యంతం నిలకడగా ఆడిన భారత టీనేజ్ షట్లర్ తన్వీ పత్రి ఆసియా అండర్–15 బ్యాడ్మింటన్ బాలికల సింగిల్స్ చాంపియన్‌గా అవతరించింది. చైనాలోని చెంగ్డూ నగరంలో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో ఒడిశాకు చెందిన 13 ఏళ్ల తన్వీ వరుస గేముల్లో గెలిచింది. టాప్ సీడ్ హోదాలో బరిలోకి దిగిన తన్వీ తుది పోరులో 22–20, 21–11తో రెండో సీడ్ థి థు హుయెన్ ఎన్గుయెన్ (వియత్నాం)పై విజయం సాధించింది. టైటిల్ గెలిచిన క్రమంలో తన్వీ టోర్నీ మొత్తంలో తన ప్రత్యర్థులకు ఒక్క గేమ్ కూడా కోల్పోకపోవడం విశేషం. ఈ గెలుపుతో ఆసియా అండర్–15 బాలికల సింగిల్స్ విభాగంలో టైటిల్ సాధించిన మూడో భారత క్రీడాకారిణిగా తన్వీ గుర్తింపు పొందింది.2017లో హైదరాబాద్ అమ్మాయి సామియా ఇమాద్ ఫారూఖీ, 2019లో గుజరాత్ అమ్మాయి తస్నీమ్ మీర్ ఈ ఘనత సాధించారు. ఇదే టోర్నీలో బాలుర అండర్–17 సింగిల్స్ విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్ ప్లేయర్ జ్ఞాన దత్తు సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాన్ని సాధించాడు. -
ఓటు మన బాధ్యత
హృతిక్ శౌర్య, తన్వి నేగి జంటగా రవి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఓటు’. ఫ్లిక్ నైన్ స్టూడియోస్‌పై ఫ్లిక్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ సినిమా టీజర్‌ని నటుడు, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ విడుదల చేసి, సినిమా హిట్ కావాలని ఆకాంక్షించారు. ‘‘మన దేశంలో కుల, మత, ప్రాంతీయ అభిప్రాయ బేధాలు లేకుండా జరుపుకునే ఏకైక పండగ.. ఎన్నికల పండగ’ అనే డైలాగ్‌తో టీజర్ మొదలవుతుంది. ‘‘మందుకు, నోటుకు ఓటు అమ్మకోవడం కరెక్ట్ కాదు కదా?’, ‘ఓటు అనేది హక్కు కాదు.. మన బాధ్యత’’ వంటి డైలాగులు టీజర్లో ఉన్నాయి. హృతిక్ శౌర్య మాట్లాడుతూ– ‘‘ఫ్యామిలీ, లవ్ ఎమోషన్స్‌తో పాటు చాలా ముఖ్యమైన కథతో ‘ఓటు’ రూపొందింది’’ అన్నారు. ‘‘మా సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు తన్వి నేగి. నటుడు గోపరాజు రమణ మాట్లా్లడారు. ఈ చిత్రానికి సంగీతం: అగస్త్య, కెమెరా: ఎస్. రాజశేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రామకృష్ణ. -
చాలా విలువైనది
హృతిక్ శౌర్య, తన్వి నేగి జంటగా రవి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఓటు’. ‘చాలా విలువైనది’ అనేది ట్యాగ్ లైన్. ఫ్లిక్ నైన్ స్టూడియోస్‌పై ఫ్లిక్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ సినిమాకి ‘ఓటు’ అనే టైటిల్ ఖరారు చేసి, ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. ‘‘ఓటు విలువ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. ఫస్ట్ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచింది. త్వరలో మా చిత్రం విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: అగస్త్య, కెమెరా: ఎస్. రాజశేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: రామకృష్ణ. -
మహిళల్లో క్రీడాస్ఫూర్తికి..
తాన్వీ హన్స్, శ్వేతా సుబ్బయ్య. ఒకరు ఫుట్ బాల్ క్రీడాకారిణి, మరొకరు ఫిట్నెస్ ట్రైనర్. ఈ ఇద్దరు ఏడేళ్ల క్రితం బెంగళూరులో మహిళల కోసం సరదాగా ఓ స్పోర్ట్స్ సెషన్‌ను ఏర్పాటు చేశారు.అది మొదలు ఇప్పుడు దేశం అంతటా మహిళల కోసం స్పోర్ట్స్ సెషన్ లు, నెట్వర్కింగ్ ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు దాదాపు 5000 మందికి పైగా ఈ మహిళా నెట్వర్క్ ఉమెన్ స్పోర్ట్స్ కమ్యూనిటీని విస్తరించడానికి ట్రావెల్ గ్రూప్స్ ఏర్పాటు చేస్తుంటారు. 14 ఏళ్లలోపు అమ్మాయిల నుంచి అరవై ఏళ్లకు పైగా వయసున్న బామ్మలు కూడా వీరి గ్రూప్‌లో సభ్యులు. ఈ నెల నుంచి సెప్టెంబర్ వరకు మహిళల్లో క్రీడాస్ఫూర్తి నింపడానికి ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు తాన్వి, శ్వేత. క్రీడల ద్వారా కనెక్ట్ అయిన మహిళల సంఘంగా తాన్వి, శ్వేతలు ఏర్పాటు చేసిన ‘సిస్టర్స్ ఇన్ స్వెట్’ గురించి చెప్పుకోవచ్చు ప్రోఫెషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్ అయిన తాన్వీ హన్స్ 2017లో ఢిల్లీ నుంచి బెంగళూరుకు వెళ్లింది. అక్కడ ఆమెకు శ్వేత సుబ్బయ్య పరిచయం అయ్యింది. తన ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్లలో శ్వేత ఒకరు. కొద్దిరోజుల్లోనే వారిద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది. ‘‘ఒకసారి జరిగిన ఫ్రెండ్స్ పార్టీలో లేడీస్ అంతా ‘మాకు కూడా క్రీడలు నేర్పించవచ్చు కదా! అని అడిగారు. దాంతో ఆ వీకెండ్లో ఒక గ్రౌండ్ బుక్ చేసి, కొంతమంది మహిళలను ఆహ్వానించాం. అదొక ఫన్ సెషన్ అనుకున్నాం. నలుగైదుగురు వస్తారు అనుకుంటే ఏకంగా 17 మంది మహిళలు వచ్చారు’ అని నాటి రోజులను గుర్తుచేసుకుంటుంది తాన్వి. సరదాగా మొదలై.. 35 ఏళ్ల వయసున్న మహిళల కోసం గంటన్నర స్పోర్ట్స్ సెషన్‌ను మొదటిసారి ఏర్పాటు చేశారు. ఆ సమయంలో శ్వేత ఫిట్నెస్ ట్రైనర్‌గా... తాన్వి క్రీడల కోసం మహిళలు తమ శరీరాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలో వివరించింది. అంతా సరదాగా జరిగిన ఈ కార్యక్రమం తర్వాత కొత్త ఆలోచనకు దారి వేసింది. ‘ఆ మొదటి సెషన్ తర్వాత లేడీస్ మా వద్దకు వచ్చారు. ఈప్రోగ్రామ్ చాలా బాగుందని, ప్రతి వారాంతంలో తమకోసం ఓ సెషన్ ఏర్పాటు చేయాలని కోరారు. అలా ఈ కమ్యూనిటీ మొదలైంది’ అని వివరిస్తుంది తాన్వి. స్కూళ్లు, కాలేజీల తర్వాత క్రీడల నుండి తప్పుకుంటున్న మహిళల ఆలోచనల్లో తిరిగి స్పోర్ట్స్ పట్ల జీవం పోయడమే తమ ధ్యేయంగా చెబుతారు వీరు. ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, టచ్ రగ్బీతో సహా ఇతర స్పోర్ట్స్ ఫార్మాట్లతో ఈ గ్రూప్ రన్ అవుతోంది. అన్ని వయసుల వారూ.. . ‘‘2017లో మొదటి సెషన్ప్రారంభమైనప్పుడు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసున్న మహిళలు అని మాత్రమే అనుకున్నాం. ఆ తర్వాత సగటు వయసు 25 నుంచి 30కి చేర్చాం. కానీ, మాతో ఆడుకోవడానికి ఉత్సాహం చూపే 12–14 ఏళ్ల వయసున్న అమ్మాయిలు కూడా ఉన్నారు. అలాగే, 65 ఏళ్ల మహిళలు కూడా ఆసక్తి చూపారు. అలా చిన్న వయసు నుంచి సీనియర్ మహిళల వరకు అందరూ మా గ్రూప్‌లో ఉన్నారు. వీరితోపాటు పరిశ్రమల యజమానులు, తల్లులు, గృహిణులు, విద్యార్థులూ ఉన్నారు. కాలేజీల్లో ఆడుకోవడానికి విద్యార్థులకు అవకాశం ఉందని మొదట్లో మేం అనుకునేవాళ్లం. కానీ, అలాంటి వ్యవస్థ చాలా వరకు మన విద్యా సంస్థల్లో లేదని తెలిసింది. మొత్తమ్మీద వివిధ రకాలప్రోఫైల్స్ మా వద్దకు చేరాయి. సాధారణంగా క్రీడలు అబ్బాయిలు, పురుషుల కోసమే అనే ఆలోచన మన సంస్కృతిలో పాతుకుపోయాయి. స్కూల్ స్థాయిలో మన దగ్గర కొన్ని విద్యా సంస్థలు అమ్మాయిలకు క్రీడల్లో అవకాశాలను ఇస్తాయి. కానీ, వారి ఎంపికలో చాలా వ్యత్యాసాలు ఉంటాయి. కాలేజీల్లోనూ ఇదే తేడా కనిపిస్తుంది. అందువల్లే, క్రీడల్లో పాల్గొనాలని ఉన్నా మహిళలు డ్రాప్‌ఔట్ అవుతుంటారు. వీటన్నింటినీ ఆలోచించి మేం ఈ ఏర్పాటు చేశాం’ అని తాన్వి చెబుతుంది. ‘మహిళలు ఇతర మహిళలతో ఆడుకోవడానికి మేం అవకాశాలు కల్పిస్తున్నాం. దీని వల్ల వారు సుఖంగా, సురక్షితంగా ఉంటారు. తమ కోసం మంచి సమయం గడుపుతారు’ అంటుంది శ్వేత. బెంగళూరులో ప్రతివారం ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, బ్యాడ్మింటన్, టచ్ రగ్బీ సెషన్స్ నిర్వహిస్తున్నారు ఈ టీమ్. అలాగే, ప్రతి ఆదివారం, మూడు నెలలకోసారి సైక్లింగ్ ఈవెంట్లను నిర్వహిస్తున్నారు. స్విమ్ సెషన్స్ కూడా నిర్వహిస్తూ తమ బృంద సభ్యులను మరింత ఉల్లాసపరుస్తున్నారు. ఇందుకోసం స్పెషల్‌గా తమలోనే కోచ్‌లను నియమించుకుంటున్నారు. ఆసక్తి ఉన్నవాళ్లు ఎవరైనా వీరి బృందంలో చేరవచ్చు. ‘ఈ స్పోర్ట్స్ కమ్యూనిటీలో చేరడానికి మహిళలు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. క్రీడల్లో పాల్గొనడానికి మాత్రం నామమాత్రపు రుసుము చెల్లించాలి’ అని చెబుతున్నారు తాన్వీ, శ్వేత. ప్రతి ఈవెంట్‌కు స్పాన్సర్లను వెతకడం, వాటి ద్వారా ఖర్చులు తగ్గించడం వల్ల క్రీడల్లో పాల్గొనే మహిళలు ఈ సెషన్స్‌లో సంతోషంగా పాల్గొంటున్నారని వివరిస్తున్నారు. -
ఎంత చదివినా 'తన్వి' తీరదు!
పదేళ్ల పిల్లలు ఏం చేస్తారు? ఆడుతూ పాడుతూ..స్కూల్లో చెప్పిన పాఠాలను వల్లేవేస్తూ ఉంటారు. ఇది ఒకప్పటి మాట. టెక్నాలజీతో ఆడుతూ పాడుతూ ఆన్లైన్ గేమ్‌లతో బిజీగా ఉంటున్నారు నేటితరం పిల్లలు. ఐదోతరగతి చదువుతున్న వోరుగంటి తన్వి మాత్రం కవితలు రాస్తూ ఏకంగా ఒక బుక్‌ను çప్రచురించింది. ఎంత చదివినా తన్వి తీరనంతగా అందరినీ ఔరా అనిపిస్తోంది. లాక్డౌన్ కాలంలో ఎక్కడివారు అక్కడే ఇళ్లలో ఉండిపోవలసి రావడంతో తమకు దొరికిన సమయాన్ని చాలా మంది రకరకాలుగా సద్వినియోగం చేసుకున్నారు. పదేళ్ల చిన్నారి తన్వి కూడా ఎవరికీ తీసిపోలేదు. తనకొచ్చిన ఆలోచనలకు అక్షర రూపం ఇచ్చింది. చక్కటి కవితలుగా మార్చింది. ఇలా రాసిన కవితలను ‘ఫ్రం ది ఇన్సైడ్–ద ఇన్నర్ సోల్ ఆఫ్ యంగ్ పొయెట్’ పేరిట పుస్తకం విడుదల చేసింది. దీంతో అమెరికాలో అతిపిన్న రచయితల జాబితాలో నిలిచింది. మార్చి15న విడుదలైన ఈ బుక్ ప్రస్తుతం ఆన్లైన్ వేదికపై ఫైవ్‌స్టార్ రేటింగ్‌తో దూసుకుపోతోంది. ప్రపంచమంతటా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సమయంలో అందరూ అనుభవించిన, ఎదుర్కొంటున్న సమస్యలు, చేస్తున్న ఆలోచనలు, కష్టాలను కవితల రూపంలో వివరిస్తోంది. ముఖ్యంగా భావోద్వేగాలు, బాధ, కోపం, విచారం, ఒంటరితనం, ఇష్టమైన వారిని కోల్పోవడం, లాక్‌డౌన్‌తో స్వేచ్ఛను కోల్పోవడం వంటి అనేక అంశాలను పుస్తకంలో తన్వి ప్రస్తావించింది. అంతేకాకుండా ప్రకృతిపట్ల మనం చూపాల్సిన ప్రేమ బాధ్యత, ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలు, మర్చిపోలేని బంధాలు... వంటివాటన్నిటì నీ కవితల ద్వారా వివరించింది. హ్యారీపోటర్ సీరిస్‌లను ఇష్టపడే తన్విని కవితలు రాయాలనే అభిరుచే రచయితగా మార్చిందని చెబుతోంది. పదేళ్ల వయసులో బుక్ రాసిన తన్వి భారత సంతతికి చెందిన అమ్మాయి కావడం విశేషం. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్‌కు చెందిన మహేందర్ రెడ్డి, దీపికా రెడ్డి దంపతుల ఏకైక సంతానమే తన్వి వోరుగంటి. ఐదోతరగతి చదువుతోన్న తన్వి వయసులో మాత్రమే చిన్నది. ఆలోచనల్లో ఒక రచయిత అంత వయసు తనది. అందుకే అందరు పిల్లల్లా వేసవి సెలవల్లో ఆడుకోలేదు తన్వి. తనకి ఎంతో ఇష్టమైన కవితలు రాస్తూ కాలం గడిపేది. అలా తాను రాసుకున్న కవితలన్నింటికి ఒక పుస్తకరూపం ఇవ్వడంతో అమెరికా లో యంగెస్ట్ రచయితల సరసన పదేళ్ల తన్వి నిలవడం విశేషం. తన్వి మాటల్లోనే విందాం...‘‘నాపేరు తన్వి వోరుగంటి. నేను అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రంలోని చాడ్లర్ నగరంలో అమ్మానాన్నలతో ఉంటున్నాను. మా స్వస్థలం కరీంనగర్ అయినప్పటికీ నాన్న మహేందర్ రెడ్డి ఇంటెల్‌లో హార్డ్‌వేర్ ఇంజినీర్‌గా, అమ్మ దీపిక సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పనిచేస్తుండడంతో నేను ఇక్కడే పుట్టాను. రెండేళ్లకోసారి మాత్రమే ఇండియా వచ్చి తాతయ్య దగ్గర ఒక నెలరోజులు గడుపుతాము. నా కవితల ప్రస్థానం గతేడాది వేసవికాలం సెలవుల్లో మొదలైంది. సమ్మర్ హాలిడేస్‌లో టైమ్‌పాస్ కోసం కవితలు రాయం మొదలు పెట్టాను. అలా రాస్తూ రాస్తుండగానే నేను కవితలు రాస్తున్న విషయం అమ్మానాన్నలకు తెలియడంతో వారు కూడా నన్ను బాగా ప్రోత్సహించారు. అంతేగాకుండా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా స్కూల్ టీచర్ల ప్రోత్సాహం తో నేను మరిన్ని కవితలు రాయగలిగాను. వారి సహకారంతో ఆ కవితలకు పుస్తకరూపం తీసుకు రాగలిగాను. అయితే పుస్తక ప్రచురణ ఏమంత సులభం కాలేదు. చాలా సవాళ్లను ఎదుర్కొనవలసి వచ్చింది. నామీద నాకు పూర్తిస్థాయిలో విశ్వాసం లేకపోవడం వల్ల బుక్ ముద్రించడానికి అర్హురాలినేనా అనిపించేది. పుస్తకాన్ని ముద్రించడానికి నా రచన సరిపోతుందా అనిపించేది. ఇలా ఎన్నో ఆలోచనలు, సందిగ్ధతల నడుమ నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ.. తల్లిదండ్రుల సహకారంతో బుక్ పబ్లిష్ చేసాను. అయితే అందరూ అర్థం చేసుకునేలా అర్థవంతమైన కవిత్వం రాశానని మాత్రం చెప్పగలను’’ అని చెప్పింది ఆరిందలా. ‘‘కొత్తగా కవితలు రాయాలనుకుంటున్నవారు ముందుగా మిమ్మల్ని మీరు బాగా నమ్మండి. ఎప్పటికప్పుడు మీకు మీరే నేను చేయగలను అని చెప్పుకుంటూ ఉండాలి. అనుకున్న లక్ష్యాన్నీ చేరేందుకు కష్టపడాలి’’అని చెప్పింది. పిల్లలు, పెద్దల కోసం భవిష్యత్ లో రియలిస్టిక్ ఫిక్షన్ నావెల్స్ రాయాలనుకుంటున్నట్లు తన్వి వివరించింది. ఆమె ఆకాంక్ష నెరవేరాలని కోరుకుందాం. ‘‘నా మనవరాలు చిన్నవయసులో కవితలు రాసి బుక్ పబ్లిష్ చేసే స్థాయికి ఎదగడం నాకెంతో గర్వంగా ఉంది. తన్వి అమెరికాలో పుట్టినప్పటికీ ఏడాదికోసారి ఇండియా రావడాన్ని ఎంతో ఇష్టపడుతుంది. చిన్నప్పటి నుంచి తను చాలా కామ్‌గా ఉండే తత్వం. ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడేది. ఎప్పుడూ ఆలోచిస్తూ తనకు నచ్చిన వాటిని చిన్న నోట్‌బుక్‌లో రాసి పెట్టుకునేది. రీడింగ్, రైటింగ్ అంటే తనకు ఎంతో ఇష్టం. స్కూల్లో టీచర్ల ప్రోత్సాహంతో మంచి వకాబులరీ నేర్చుకుంది. మా ఫ్యామిలీలో రచయితలు ఎవరూ లేరు. ఈ లోటును తన్వి తీర్చింది. తను ఇలానే మంచి మంచి రచనలు చేస్తూ..మరిన్ని పుస్తకాలు రాయాలని కోరుకుంటున్నాను. తన స్టడీస్తోపాటు రచయితల ప్రపంచంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను’’ –తన్వి తాతయ్య వోరుగంటి హనుమంత రెడ్డి, (కరీంనగర్ డెయిరీ అడ్వైజర్) -
చిన్నప్పటి మహేంద్ర బాహుబలిని ఇప్పుడు చూశారా..
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ బాహుబలి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపించిన విషయం తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ సినిమా రెండు భాగాలు తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలు వ్యాపించేలా చేసింది. ఈ సినిమాలో బాహుబలిగా ప్రభాస్‌కు ఎంత పేరు వచ్చిందో, భళ్ళాదేవుడుగా రానా కూడా అదే స్థాయిలో మెప్పించారు. ఇక శివగామిగా రమ్యకృష్ణ పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అయితే బాహుబలి- ది బిగినింగ్‌లో శివగామి తన చేతిలో ఉన్న చిన్నారిని నీటిలో మునగకుండా పైకి లేపి “మహేంద్ర బాహుబలి బ్రతకాలి ” అంటూ తుది శ్వాస విడిచిన సన్నివేశం అందరికీ గుర్తుండే ఉంటుంది. చదవండి: ఆచార్య: 20 నిమిషాల కోసం రూ. కోటి పసిబిడ్డను రెండు చేతులతో పైకి ఎత్తి పట్టుకుని ప్రవాహానికి ఎదురు వెళ్లడం. పైకి ఎత్తుకున్న రెండు చేతుల్లోని పసిబిడ్డ పోస్టర్ కూడా అప్పట్లో విపరీతంగా పాపులర్ అయింది. ఈ అద్భుతమైన ఆ దృశ్యం ప్రేక్షకుల జ్ఞాపకాల నుంచి ఇప్పటికీ చెదిరిపోదు. అయితే ఆ చిన్నారిని చిన్నప్పటి ప్రభాస్‌గా మనకు చూపించగా, ఆ పాత్ర పోషించింది తన్వి అనే అమ్మాయి. సినిమాలో నెలల పిల్లగా చిన్నగా చూపించగా, ఇప్పుడు ఆమె చాలా పెద్దది అయ్యింది. ఇప్పుడే స్కూల్‌కు కూడా వెళుతోంది. యూకేజీ చదువుతోంది. ప్రస్తుతం కొందరు తన్వితో దిగిన ఫోటోలను ట్విటర్లో పోస్టు చేయడంతో ఆ ఫొటోలు ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. చదవండి: బాహుబలిని తలపించే ఫేక్ వీడియో వైరల్ బాహుబలి సినిమాలో కట్టప్ప ఎత్తుకున్న ఈ పాప(మహేంద్ర బాహుబలి) ఇప్పుడు యూకేజీ చదువుతుంది. పేరు తన్వి. @ssrajamouli pic.twitter.com/Aj31XvG6EB — DONTHU RAMESH (@DonthuRamesh) January 27, 2021 -
రసాయనాల్లేని రక్షణ
తన్వీ ఉత్పత్తి చేస్తున్న బయోడీగ్రేడబుల్ నాప్కిన్స్ విరివిగా అందుబాటులోకి వస్తే.. గర్భాశయ ఇన్ఫెక్షన్ల నుంచి మహిళ ఆరోగ్యాన్ని, పర్యావరణ కాలుష్యం నుంచి భూమాతను కూడా రక్షించినట్లవుతుంది. ‘పరిశుభ్రత ఒక అలవాటుగా మారాలి’ అంటుంటాం. దేహ పరిశుభ్రత గురించి అందరి ముందు మాట్లాడగలుగుతాం. నోటి పరిశుభ్రత గురించి దంత వైద్యులు ఒక సమావేశం ఏర్పాటు చేస్తే పక్కవారిని కూడా పిలుచుకుని మరీ వెళ్తాం. అయితే రుతుక్రమం సమయంలో పాటించాల్సిన పరిశుభ్రత గురించి అవగాహన కోసం మాట్లాడటానికి ఎవరైనా వస్తే మనలో ఎంతమందిమి హాజరు అవుతాం? అలాగని రుతుక్రమ పరిశుభ్రత గురించి సమాజంలో సంపూర్ణ అవగాహన ఉందా అంటే.. అదీ ఇరవై శాతానికి మించదు. భారతదేశంలో ఈ అంశం ఇంకా ఒక కళంకిత భావనగానే ఉంది. ఆ భావన తొలగిపోయే వరకు రుతుక్రమ పరిశుభ్రత క్యాంపెయిన్ల అవసరం కాదనలేనిది అంటున్నారు తన్వీ జోరీ. అనడమే కాదు, తనే శానిటరీ నేప్కిన్లను తయారు చేస్తూ, క్యాంపెయిన్‌ను నడుపుతున్నారు. ఇళ్లకే నేరుగా డెలివరీ తన్వీ జోరీకి స్వయంగా ఎదురైన ఇబ్బందుల నుంచి ఈ ఆలోచన వచ్చింది. బయోడీగ్రేడబుల్ నాప్కిన్ల అవసరాన్ని గుర్తించి, వాటి వాడకాన్ని మహిళలకు అలవాటు చేయాలనుకుంది. తనే వాటిని తయారు చేసింది. ఇక ఇప్పుడు వాటి వాడకం ఎంత అవసరమో తెలియచేసే ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. తన్వీ జోరీ న్యూఢిల్లీలో బిజినెస్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ చేసింది. మార్కెట్లో దొరికే శానిటరీ నాప్కిన్స్ వల్ల ఆమెకు స్కిన్ ర్యాష్ వస్తుండేది. దీని నుంచి బయటపడే మార్గం ఏమిటని ఆలోచించి తానే సొంతంగా 2016లో మాన్యుఫాక్చరింగ్ యూనిట్ పెట్టింది. మొక్కజొన్న పిండి, వెదురు పీచులను కలిపి నాప్కిన్లను తయారు చేసే టెక్నాలజీని కనుక్కుంది. ఇప్పుడు ఆమె ప్రారంభించిన ‘కార్మెసీ’ కంపెనీకి ఐదువేల మంది వినియోగదారులున్నారు. నేరుగా వాళ్ల ఇళ్లకే నేప్కిన్లు నెలనెలా డెలివరీ అవుతుంటాయి. ఈ ఉత్పత్తుల కోసం వెబ్సైట్ ద్వారా లాగిన్ అవుతున్నారు మహిళలు. తన్వీ వినియోగదారుల్లో 24–36 ఏళ్ల మధ్య వారే ఎక్కువ. నగరాల్లో నేచర్ బాస్కెట్ వంటి సహజమైన ఉత్పత్తులను విక్రయించే అవుట్లెట్లను ఇందుకోసం తన్వీ ఎంచుకుంది. ‘‘నెల నెలకూ 30 శాతం వ్యాపారం పెరుగుతోంది’’ అంటోంది తన్వి. ధైర్యమివ్వడమే ధ్యేయం కంపెనీ స్థాపనలో తన ఉద్దేశం అమ్మకాలు– కొనుగోళ్ల ఆధారంగా జరిగే వ్యాపారం కాదని, ఆధునిక మహిళలను కూడా వదలని సామాజిక కళంక భావనను సమూలంగా తుడిచేయడమేననీ ఆమె అంటోంది. రుతుక్రమం సమయంలో వాడి పారవేసే వ్యర్థాలు ఏటా మనదేశంలో లక్షా పదమూడు వేల టన్నులుగా ఉంటున్నాయి. రసాయనాలు, జెల్స్, సింథటిక్ ఫైబర్‌తో తయారైన నాప్కిన్లకు బదులుగా సహజపద్ధతుల్లో నేలలో కలిసి పోయే (బయోడీగ్రేడబుల్) నాప్కిన్ల వాడకం గురించి అవగాహన పెరగాలని ఆమె కోరుకుంటోంది. అంతకంటే ముందుగా తన అవసరాన్ని ధైర్యంగా చెప్పగలిగేటట్లు మహిళల్లో చైతన్యం తీసుకురావాలనేదే.. ఈ యూనిట్‌ను ప్రారంభించడంలో ఆమె ముఖ్యోద్దేశం. ఉన్నవాటికంటే మంచివి రెండు మూడు తరాలకు ముందు మహిళలు ఇంట్లో చేసుకుని వాడిన శానిటరీ నాప్కిన్స్ స్థానాన్ని ఇప్పుడు అధునాతన నాప్కిన్స్ భర్తీ చేస్తున్నాయి. మార్కెట్లో ఉన్న రసాయనాల ప్రభావంతో కూడిన నాప్కిన్స్ వాడకం మీద కొన్ని సందేహాలు ఉన్నప్పటికీ ప్రస్తుతానికైతే అంతకంటే మరో మార్గం లేదు. అందువల్లనే ప్రభుత్వాలు కూడా పరిశుభ్రత లేని, అనారోగ్యకరమైన సంప్రదాయ పద్ధతుల నుంచి బయటకు వచ్చి మార్కెట్లో దొరికే స్టెరిలైజ్డ్ నాప్కిన్లను వాడమని సూచిస్తున్నాయి. ఇప్పటికి అందుబాటు ఉన్నవాటిలో అవే కొంత ఆరోగ్యకరం కాబట్టి! అయితే తన్వీ ఉత్పత్తి చేస్తున్న బయోడీగ్రేడబుల్ నాప్కిన్స్ విరివిగా అందుబాటులోకి వస్తే.. గర్భాశయ ఇన్ఫెక్షన్ల నుంచి మహిళ ఆరోగ్యాన్ని, పర్యావరణ కాలుష్యం నుంచి భూమాతను కూడా రక్షించినట్లవుతుంది. మహిళలకు ఎదురయ్యే ఆ కష్టం ఎవరికీ అర్థం కాదు.. అలాంటి సమస్యనే ఎదుర్కొన్న మరో మహిళకు తప్ప. నేను పడిన ఇబ్బందిని మాటల్లో చెప్పలేను. సంపన్న మహిళ అయినా, సాధారణ మహిళ అయినా ఇందులో అంతా సమానమే. అధునాతనమైన పరిశుభ్రమైన జీవనశైలిలో కూడా ఆ కష్టం తప్పలేదంటే, సాధారణ జీవితంలో ఇంకెలా ఉంటుందో అనుకునేదాన్ని. స్త్రీలకు ఆరోగ్యక రమైన జీవితాన్నివ్వడానికి నేను ఎంచుకున్న మార్గం ఇది. – తన్వీ జోరీ, కార్మెసీ ఫౌండర్ – మంజీర -
అందరికీ కనెక్ట్ అయ్యే నేనేం చిన్నపిల్లనా
‘‘నిజ జీవితంలో ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో దర్శకుడు చాలా బాగా తెరకెక్కించారు. మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని డి.రామానాయుడు చెప్పారు. రాహుల్, తన్వి జంటగా పి.సునీల్‌కుమార్‌రెడ్డి దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆయన నిర్మించిన ‘నేనేం చిన్న పిల్లనా’ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్మీట్లో దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఇది పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రం. పాటలు, సంగీతం ప్రేక్షకుల్ని అలరిస్తాయి. కష్టానికి తగిన ఫలితం దక్కుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇదని రాహుల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా అన్నపూర్ణమ్మ, సంజన, అలీ, సుమన్, కాశీవిశ్వనాథ్, అనిత తదితరులు మాట్లాడారు.