అందరికీ కనెక్ట్ అయ్యే నేనేం చిన్నపిల్లనా | Nenem Chinna Pillana movie release sheduled for friday | Sakshi
Sakshi News home page

అందరికీ కనెక్ట్ అయ్యే నేనేం చిన్నపిల్లనా

Nov 7 2013 12:13 AM | Updated on Sep 2 2017 12:20 AM

అందరికీ కనెక్ట్ అయ్యే నేనేం చిన్నపిల్లనా

అందరికీ కనెక్ట్ అయ్యే నేనేం చిన్నపిల్లనా

‘‘నిజ జీవితంలో ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో దర్శకుడు చాలా బాగా తెరకెక్కించారు. మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’

‘‘నిజ జీవితంలో ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో దర్శకుడు చాలా బాగా తెరకెక్కించారు. మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని డి.రామానాయుడు చెప్పారు. రాహుల్, తన్వి జంటగా పి.సునీల్‌కుమార్‌రెడ్డి దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆయన నిర్మించిన ‘నేనేం చిన్న పిల్లనా’ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఇది పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రం. పాటలు, సంగీతం ప్రేక్షకుల్ని అలరిస్తాయి. కష్టానికి తగిన ఫలితం దక్కుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇదని రాహుల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా అన్నపూర్ణమ్మ, సంజన, అలీ, సుమన్, కాశీవిశ్వనాథ్, అనిత తదితరులు మాట్లాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement