‘ప్రేమనగర్’ తర్వాత... నేనేం చిన్నపిల్లనా? | Venkatesh and Rana Daggubati at Nenem Chinna Pillana Audio Launch | Sakshi
Sakshi News home page

‘ప్రేమనగర్’ తర్వాత... నేనేం చిన్నపిల్లనా?

Published Sat, Aug 24 2013 12:22 AM | Last Updated on Fri, Sep 1 2017 10:03 PM

‘ప్రేమనగర్’ తర్వాత... నేనేం చిన్నపిల్లనా?

‘ప్రేమనగర్’ తర్వాత... నేనేం చిన్నపిల్లనా?

‘‘ఈ పాటలు విన్నాను. చాలా బాగున్నాయి. శ్రీలేఖ మంచి ట్యూన్స్ ఇచ్చారు. సురేష్ ప్రొడక్షన్స్ నుంచి మంచి చిత్రాలు వచ్చాయి. ఈ సినిమా కూడా ఆ కోవకు చెందుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు వెంకటేష్. రాహుల్, తన్వి వ్యాస్ జంటగా పి. సునీల్‌కుమార్‌రెడ్డి దర్శకత్వంలో డా. డి.రామానాయుడు నిర్మించిన చిత్రం ‘నేనేం చిన్నపిల్లనా?’. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ఆడియో వేడుకలో పాల్గొన్న వెంకటేష్ సీడీని ఆవిష్కరించి, రామానాయుడు, రానాకి ఇచ్చారు.
 
 ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ -‘‘వందేళ్ల భారత సినిమా చరిత్రలో సురేష్ ప్రొడక్షన్స్‌ది 49 ఏళ్ల చరిత్ర. ఎంతోమంది ఈ బేనర్లో నటించారు. కానీ ఇప్పటివరకు నాకు అవకాశం రాలేదు. ఇప్పటివరకు మా సంస్థలో వచ్చిన చిత్రాల్లానే ఈ చిత్రం కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. రామానాయుడు మాట్లాడుతూ -‘‘మా సంస్థ నుంచి వచ్చిన ‘ప్రేమనగర్’ తర్వాత ఆరు పాటలూ అద్భుతంగా వచ్చిన సినిమా ఇది.
 
 అలాగే ‘కలిసుందాం రా’లాంటి మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. సంగీతం, సాహిత్యం బాగా కుదిరాయి. మా సంస్థలో సునీల్‌కుమార్‌రెడ్డి దర్శకత్వం వహించిన తొలి సినిమా ఇది’’ అన్నారు. ఈ సంస్థలో 14 సినిమాలు చేశానని, అన్నీ మ్యూజికల్ హిట్ అయ్యాయని, ఈ సినిమా కూడా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని శ్రీలేఖ చెప్పారు. సునీల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ -‘‘దర్శకుడిగా చాలా సినిమాలు చేసినా, సినిమా పరిశ్రమతో ఏదో గ్యాప్ ఉందనే ఫీలింగ్ ఉండేది.
 
 అది ఈ చిత్రంతో తీరిపోయింది. నాయుడిగారి బేనర్లో సినిమా చేయడం నా అదృష్టం. చక్కని కథ, మాటలు, టైటిల్, పాటలు కుదిరాయి. సినిమా పెద్ద హిట్ అవుతుందని నమ్మకంగా చెప్పగలను’’ అన్నారు. ఇంకా ఈ సమావేశంలో శరత్‌బాబు, బలభద్రపాత్రుని రమణి, భాస్కరభట్ల, రాహుల్, తన్వి, సంజనా, అనంత్ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement