అచ్చమైన తెలుగు సినిమా
అచ్చమైన తెలుగు సినిమా
Published Mon, Sep 16 2013 1:18 AM | Last Updated on Fri, Sep 1 2017 10:45 PM
సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డా. డి.రామానాయుడు నిర్మించిన చిత్రం ‘నేనేం చిన్నపిల్లనా..’. సొంత ఊరు, గంగపుత్రులు, రొమాంటిక్ క్రైమ్‌స్టోరీ వంటి విభిన్న చిత్రాలను అందించిన సునీల్‌కుమార్‌రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. రాహుల్, తన్వీ వ్యాస్ జంటగా నటించారు.
సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి రామానాయుడు చెబుతూ- ‘‘టైటిల్ ఎనౌన్స్ చేసినప్పట్నుంచీ సినిమాకు మంచి టాక్ వచ్చింది. అచ్చ మైన తెలుగు సినిమా చూసినట్లుందని సెన్సార్ సభ్యులు అభినందించారు. త్వరలో ప్లాటినమ్ డిస్క్ వేడుక జరుపుతాం.
ఈ నెలాఖరున సినిమా విడుదల చేస్తాం’’ అని తెలిపారు. తన గత చిత్రాలతో పోల్చి చూస్తే ఇది కచ్చితంగా కొత్తగా ఉంటుందని, కుటుంబసమేతంగా చూడదగ్గ సినిమా ఇదని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి కథ: బలభద్రపాత్రుని రమణి, మాటలు: సత్యానంద్, కెమెరా: సాబు జేమ్స్, సంగీతం: శ్రీలేఖ.
Advertisement
Advertisement