D. Ramanaidu
-
మన గడ్డంటే ‘మూవీ మొఘల్’కు ఎంత మక్కువో..
అమలాపురం టౌన్ :వెండితెరకు ‘ప్రేమనగర్, జీవనతరంగాలు’ వంటి ఎన్నో కళాఖండాలను నజరానాగా ఇచ్చిన మూవీ మొఘల్ డాక్టర్ డి.రామానాయుడికి గోదావరి జిల్లాలంటే వల్లమాలిన అభిమానం. ఇక్కడి గోదావరి పరవళ్లు, ప్రకృతి అందాలంటే ప్రాణం. గ్రామీణ వాతావరణంతో ముడిపడ్డ కథ అయితే గోదావరి , ఏటిగట్లు, లంకలు, పల్లెపట్టుల్నే ఎంచుకుని చిత్రీకరించే వారు. జిల్లాలో ముఖ్యంగా కోనసీమలో షూటింగ్ జరిగేటప్పుడు రామానాయుడు చిత్రీకరణ పర్యవేక్షణపై కంటే గోదావరి పరవళ్లనే చూస్తూ మురిసిపోయేవారు. నూటయాభై చిత్రాల ఆ మహానిర్మాత మరణం జిల్లావాసులను కలచివేస్తోంది. దాదాపు నలభైఏళ్ల క్రితం శోభన్‌బాబు హీరోగా, 2005లో తరుణ్ హీరోగా ‘సోగ్గాడు’ పేరుతో రామానాయుడు తీసిన రెండు సినిమాలను జిల్లాలోని గోదావరి తీరాల్లో చిత్రీకరించారు. ఇక 1982లో శోభన్‌బాబు, శ్రీదేవి, జయప్రదలతో నిర్మించిన ‘దేవత’ చాలా వరకూ కోనసీమలోని గోదావరిపాయల్లో, లంకల్లో చిత్రీకరించారు. ఈ చిత్రంలో ‘వెల్లువొచ్చి గోదారమ్మా... వెల్లాకిలా పడ్డాదమ్మా’ అనే పాట కోనసీమవాసుల నోట నేటికీ పల్లవిస్తూనే ఉంటుంది. మామిడికుదురు మండలం పెదపట్నంలంకను ఆనుకుని ప్రవహించే వైనతేయ నదీ తీరాన..లంకలో ఆ పాటను పూర్తిగా చిత్రీకరించారు. పాట ఆద్యంతం గోదావరిలో తేలియాడుతూ కనిపించే బిందెలను అమర్చినప్పుడు దర్శకుడు రాఘవేంద్రరావుకు రామానాయుడు పలు సూచనలు ఇచ్చారని ఆ గ్రామస్తులు అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. అమలాపురం వచ్చి బాలయోగికి నివాళులు ‘చంటి’ సినిమాకు కె.ఎస్.రామారావు నిర్మాతైనా అందులో తన కుమారుడు సురేష్ కూడా భాగస్వామి కాావటంతో రామానాయుడు కోనసీమలో ఆ చిత్రం షూటింగప్పుడు వారం రోజులు రాజోలులో మకాం చేశారు. మలికిపురం మండలం కేశనపల్లిలోని శంకరగుప్పం కౌశిక కాల్వలో ‘ఎన్నెన్నో అందాలు’ అనే పాటను చిత్రీకరించినప్పుడు ఆ గ్రామంలో రామానాయుడు నాలుగు రోజులు గడిపారు. 1998లో రాజశేఖర్ హీరోగా ‘శివయ్య’ సినిమాను అల్లవరం మండలం కోడూరుపాడు, బోడసకుర్రు వైనతేయ ఒడ్డున చిత్రీకరించారు. ఈ సినిమాలోని పలు దృశ్యాలకు అప్పటి రాష్ట్ర మంత్రి డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు క్లాప్ కొట్టారు. ‘అహనా పెళ్లంట, ముందడుగు, నాయుడుగారి కుటుంబం, నువ్వులేక నేను లేను, హిందీ చిత్రం అనారీ’ల షూటింగ్ కూడా వంటి కోనసీమలో ఎక్కువశాతం జరిగింది. 2002లో అప్పటి లోక్‌సభ స్పీకర్ బాలయోగి మృతి చెందినప్పుడు రామానాయుడు అమలాపురం వచ్చి ఎస్కేబీఆర్ కళాశాలలో ఉంచిన బాలయోగి భౌతికకాయానికి నివాళులర్పించారు. ‘అన్నదాతా! సుఖీభవ’ అని దీవించారు.. మండపేట రూరల్ : ముందు వచ్చిన ‘సోగ్గాడు’లో హీరో శోభన్‌బాబు రైతు బిడ్డగా ఎడ్లబండిపై పంట పొలాల్లో వెళుతున్న దృశ్యాలను మండపేట తదితర ప్రాంతాలతో పాటు కోనసీమలోనూ చిత్రీకిరించారు. మండపేటలో చౌదరి అనే రైతుకు చెందిన ఎడ్లను, బండిని ఆ సినిమాలో ఉపయోగించారు. రామానాయుడు ఆ ఎడ్లను చూసి మురిసిపోవటమే కాక వాటితో సరదాగా గడిపేవారని మండపేట ప్రాంత వాసులు చెబుతున్నారు. అప్పట్లో తెల్లదుస్తులు, నల్లకళ్లజోడుతో హుందాగా కనిపించే రామానాయుడుని చూసి ‘ఈయనా సోగ్గాడే’ అని ఇక్కడి వారు వ్యాఖ్యానించేవారు. మూడేళ్ల కిందట ‘బెండు అప్పారావు’ చిత్రీకరణ సమయంలో కూడా రామానాయుడు రాజమండ్రి, తాపేశ్వరరం వంటి ప్రదేశాల్లో కొద్దిరోజులు ఉన్నారు. ఆ సినిమా షూటింగ్ శ్రీభక్తాంజనేయ స్వీట్‌స్టాల్‌లో మూడు రోజులు జరిగింది. అక్కడే ఉండి పర్యవేక్షించిన రామానాయుడు ఆ మూడురోజులూ శ్రీభక్తాంజనేయస్వీట్స్టాల్లోనే భోజనం చేశారు. ఆయన సమయపాలనను, భోజనం చేసిన అనంతరం ‘అన్నదాతా సుఖీభవ’ అని దీవించారని శ్రీభక్తాంజనేయస్వీట్స్టాల్ యాజమాన్యం, సిబ్బంది ఇప్పటికీ గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఆయన మృతి పట్ల స్వీట్‌స్టాల్ అధినేత సలాది శ్రీనుబాబు, సిబ్బంది సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయనకు మూడు రోజులు భోజనం పెట్టే అవకాశం కలగడం మరువలేని అనుభూతి అన్నారు. మొక్కలంటే తగని మక్కువ కడియం : రామానాయుడికి మొక్కలంటే అమితమైన ఆసక్తి అని కడియం నర్సరీ రైతులు గుర్తు చేసుకున్నారు. ఆయన మరణవార్త విని దిగ్భ్రాంతి చెందిన వారు పలు సినిమా షూటింగ్‌లకు ఆయన తమ నర్సరీలకు వచ్చిన రోజులను గుర్తు చేసుకున్నారు. వచ్చినప్పుడల్లా వివిధ రకాల మొక్కలను గురించి ఎంతో ఆసక్తిగా అడిగి తెలుసుకునే వారని చెప్పారు. ‘నాయుడుగారికుటుంబం, పరువుప్రతిష్ట’ వంటి చిత్రాల్లో పలు సన్నివేశాలతోపాటు, ఏవీఎస్ దర్శకత్వంలో నిర్మించిన ‘శ్రీకట్నలీలలు’ అధికభాగం పల్ల వెంకన్న నర్సరీలోనే చిత్రీకరణ జరుపుకొంది. ఈ నేపథ్యంలో రామానాయుడితో ఏర్పడిన అనుబంధాన్ని పల్లవెంకన్న గుర్తు చేసుకున్నారు. -
అది సవాల్‌తో కూడుకున్న పని : డా.డి.రామానాయుడు
‘‘సమాజాన్ని ఆలోచింపజేసేలా సునిల్‌కుమార్‌రెడ్డి సినిమాలుంటాయి. తాను దర్శకత్వం వహించే ప్రతి సినిమాతోనూ కొత్తవాళ్లను పరిచయం చేయడం అభినందనీయం. కొత్త ప్రతిభను పరిశ్రమకు పరిచయం చేయడం తేలికైన విషయం కాదు. సవాల్‌తో కూడుకున్న పని. ఈ నెల 18న విడుదల కానున్న ఈ చిత్రం విజయం సాధించాలి’’ అని డా.డి.రామానాయుడు అకాంక్షించారు. పి.సునిల్‌కుమార్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఒక క్రిమినల్ ప్రేమకథ’. మనోజ్ నందం, అనిల్ కల్యాణి, ప్రియాంక పల్లవి, దివ్య ఇందులో ప్రధాన పాత్రధారులు. శ్రావ్య ఫిలింస్ పతాకంపై కృష్ణమూర్తి సమర్పణలో యక్కలి రవీంద్రబాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రవీణ్ ఇమ్మడి స్వరపరిచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో రామానాయుడు చేతుల మీదుగా విడుదల చేశారు. సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని సునిల్‌కుమార్‌రెడ్డి చెప్పారు. సమాజంలో జరుగుతున్న తప్పుల్ని వేలెత్తి చూపించే అతి కొద్ది మంది దర్శకుల్లో సునిల్‌కుమార్‌రెడ్డి ఒకరని ఆర్పీ పట్నాయక్ అన్నారు. ఇంకా యూనిట్ సభ్యులతో పాటు ఎం.ఎం.శ్రీలేఖ, జయచంద్రారెడ్డి తదితరులు కూడా మాట్లాడారు. -
లాస్ ఏంజిల్స్ టాకీస్ ప్రారంభం
-
‘తొలి సంధ్య వేళలో’ స్టిల్స్
-
అందరికీ కనెక్ట్ అయ్యే నేనేం చిన్నపిల్లనా
‘‘నిజ జీవితంలో ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో దర్శకుడు చాలా బాగా తెరకెక్కించారు. మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని డి.రామానాయుడు చెప్పారు. రాహుల్, తన్వి జంటగా పి.సునీల్‌కుమార్‌రెడ్డి దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆయన నిర్మించిన ‘నేనేం చిన్న పిల్లనా’ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్మీట్లో దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఇది పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రం. పాటలు, సంగీతం ప్రేక్షకుల్ని అలరిస్తాయి. కష్టానికి తగిన ఫలితం దక్కుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇదని రాహుల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా అన్నపూర్ణమ్మ, సంజన, అలీ, సుమన్, కాశీవిశ్వనాథ్, అనిత తదితరులు మాట్లాడారు. -
భిన్నమైన చిన్నపిల్ల..!
‘‘రెండేళ్ల విరామం అనంతరం మా సంస్థ నుంచి వస్తున్న ఈ చిత్రం తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకీ నచ్చుతుంది. టైటిల్ అనౌన్స్ చేసినప్పట్నుంచీ సినిమాపై అంచనాలు అధికమయ్యాయి’’ అని డా.డి.రామానాయుడు అన్నారు. సామాజిక అంశాలకు వాణిజ్య విలువలను మేళవిస్తూ చిత్రాలు తెరకెక్కించే దర్శకుడు పి. సునీల్‌కుమార్‌రెడ్డి. ఆయన దర్శకత్వంలో డి.రామానాయుడు నిర్మించిన చిత్రం ‘నేనేం చిన్నపిల్లనా?’. రాహుల్, తన్వివ్యాస్ జంటగా నటించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామానాయుడు మాట్లాడారు. ‘‘బలభద్రపాత్రుని రమణి కథ, సత్యానంద్ మాటలు, శ్రీలేఖ సంగీతం ఈ చిత్రానికి హైలైట్‌గా నిలువనున్నాయి. తన్వికి ఇది తొలి సినిమా అయినా చాలా చక్కగా అభినయించింది. ఈ సినిమా తర్వాత తనకు విరివిగా అవకాశాలు వస్తాయి. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది’’అని రామానాయుడు చెప్పారు. తన గత చిత్రాలతో పోల్చి చూస్తే ఈ సినిమా భిన్నంగా ఉంటుందని, సురేష్ సంస్థలో వచ్చిన గత విజయాల చెంత చేరే సినిమా అవుతుందని సునీల్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఇంకా ఈ చిత్రంలో భాగమైనందుకు రాహుల్, తన్వి, బలభద్రపాత్రుని రమణి ఆనందం వ్యక్తం చేశారు. -
తెలుగు సినిమా ప్రగతి
తన కెరీర్లో రాసిన పలు వ్యాసాలన్నింటినీ కలిపి సినీ పాత్రికేయుడు భగీరథ రూపొందిన గ్రంథం ‘తెలుగు సినిమా ప్రగతి’. వందేళ్ల భారతీయ సినిమా సంబరాలను పురస్కరించుకొని హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో ఆయన ఈ పుస్తకాన్ని ఆవిష్కరింపజేశారు. సీనియర్ నటి జమున తొలి పుస్తకాన్ని ఆవిష్కరించి నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్‌కి అందించారు. వీరితో పాటు డా.డి.రామానాయుడు, కె.వి.రమణాచారి, డా.ఎస్.వరదాచారి, అల్లాణి శ్రీధర్ ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరై భగీరథ ప్రయత్నాన్ని అభినందించారు. భగీరథ మాట్లాడుతూ -‘‘నేను రాసిన వ్యాసాల్లో ముఖ్యమైన వాటిని ఎంపిక చేసి, ప్రస్తుత చిత్రపరిశ్రమ స్థితిగతుల్ని ప్రస్తావిస్తూ ఈ పుస్తకాన్ని రూపొందించాను. సినిమాపై నాకున్న అపారమైన అభిమానమే ఈ పుస్తకం రచనకు ప్రేరణ’’ అన్నారు. -
అచ్చమైన తెలుగు సినిమా
సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డా. డి.రామానాయుడు నిర్మించిన చిత్రం ‘నేనేం చిన్నపిల్లనా..’. సొంత ఊరు, గంగపుత్రులు, రొమాంటిక్ క్రైమ్‌స్టోరీ వంటి విభిన్న చిత్రాలను అందించిన సునీల్‌కుమార్‌రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. రాహుల్, తన్వీ వ్యాస్ జంటగా నటించారు. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి రామానాయుడు చెబుతూ- ‘‘టైటిల్ ఎనౌన్స్ చేసినప్పట్నుంచీ సినిమాకు మంచి టాక్ వచ్చింది. అచ్చ మైన తెలుగు సినిమా చూసినట్లుందని సెన్సార్ సభ్యులు అభినందించారు. త్వరలో ప్లాటినమ్ డిస్క్ వేడుక జరుపుతాం. ఈ నెలాఖరున సినిమా విడుదల చేస్తాం’’ అని తెలిపారు. తన గత చిత్రాలతో పోల్చి చూస్తే ఇది కచ్చితంగా కొత్తగా ఉంటుందని, కుటుంబసమేతంగా చూడదగ్గ సినిమా ఇదని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి కథ: బలభద్రపాత్రుని రమణి, మాటలు: సత్యానంద్, కెమెరా: సాబు జేమ్స్, సంగీతం: శ్రీలేఖ. -
పదకొండు భాషల తారలతో సంతోషంగా అవార్డుల వేడుక
11 భాషలకు చెందిన సినీ ప్రముఖుల ఆగమనంతో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియం కళకళలాడింది. ‘సంతోషం’ సినీ వారపత్రిక 11వ వార్షికోత్సవ వేడుక ఈ తారల ఆగమనానికి వేదిక అయ్యింది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ‘సంతోషం ఫిలిం అవార్డు వేడుక’ను ఆ పత్రిక సంపాదకుడు, నిర్మాత సురేష్ కొండేటి ఘనంగా నిర్వహించారు. రెండేళ్ల క్రితం వరకూ తెలుగు సినిమాకే పరిమితమైన ఈ అవార్డు వేడుకను... గత ఏడాదితో దక్షిణభారతానికి చెందిన అన్ని భాషలకూ విస్తరింపజేశారు సురేష్. అయితే... ఈ ఏడాది అంతకంటే ఘనంగా... దేశంలోని 11 భాషల చిత్రాలకు ఈ అవార్డులను అందించారు సురేష్. 2012వ సంవత్సరానికి సంబంధించిన ఈ అవార్డు వేడుకలో తెలుగు సినిమాకు గాను ఉత్తమనటునిగా మహేష్‌బాబు (బిజినెస్‌మేన్), ఉత్తమనటిగా సమంత(ఈగ) అవార్డులను గెలుచుకున్నారు. ఇంకా వివిధ భాషల్లోని పలువురు సినీ ప్రముఖులకు సంతోషం అవార్డులు వరించాయి. దాసరి నారాయణరావు, డి.రామానాయుడు, కృష్ణ, కృష్ణంరాజు, జమున, వాణిశ్రీ, విజయనిర్మల, జయంతి, వెంకటేష్, రవిచంద్రన్, డా.రాజేంద్రప్రసాద్, రామ్‌చరణ్, రానా, ఆర్.నారాయణమూర్తి, గీతాంజలి, రోజారమణి, రావు బాలసరస్వతి, తార, మమతామోహన్‌దాస్, హన్సిక, నిఖిషాపటేల్ తదితర సినీ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. చార్మి, అక్ష, రేష్మ, అభినయల నాట్యం ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలువగా... కృష్ణంరాజు, వాణిశ్రీ కూడా ఈ వేడుకపై కలిసి స్టెప్పులేయడం విశేషం. -
‘ప్రేమనగర్’ తర్వాత... నేనేం చిన్నపిల్లనా?
‘‘ఈ పాటలు విన్నాను. చాలా బాగున్నాయి. శ్రీలేఖ మంచి ట్యూన్స్ ఇచ్చారు. సురేష్ ప్రొడక్షన్స్ నుంచి మంచి చిత్రాలు వచ్చాయి. ఈ సినిమా కూడా ఆ కోవకు చెందుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు వెంకటేష్. రాహుల్, తన్వి వ్యాస్ జంటగా పి. సునీల్‌కుమార్‌రెడ్డి దర్శకత్వంలో డా. డి.రామానాయుడు నిర్మించిన చిత్రం ‘నేనేం చిన్నపిల్లనా?’. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ఆడియో వేడుకలో పాల్గొన్న వెంకటేష్ సీడీని ఆవిష్కరించి, రామానాయుడు, రానాకి ఇచ్చారు. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ -‘‘వందేళ్ల భారత సినిమా చరిత్రలో సురేష్ ప్రొడక్షన్స్‌ది 49 ఏళ్ల చరిత్ర. ఎంతోమంది ఈ బేనర్లో నటించారు. కానీ ఇప్పటివరకు నాకు అవకాశం రాలేదు. ఇప్పటివరకు మా సంస్థలో వచ్చిన చిత్రాల్లానే ఈ చిత్రం కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. రామానాయుడు మాట్లాడుతూ -‘‘మా సంస్థ నుంచి వచ్చిన ‘ప్రేమనగర్’ తర్వాత ఆరు పాటలూ అద్భుతంగా వచ్చిన సినిమా ఇది. అలాగే ‘కలిసుందాం రా’లాంటి మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. సంగీతం, సాహిత్యం బాగా కుదిరాయి. మా సంస్థలో సునీల్‌కుమార్‌రెడ్డి దర్శకత్వం వహించిన తొలి సినిమా ఇది’’ అన్నారు. ఈ సంస్థలో 14 సినిమాలు చేశానని, అన్నీ మ్యూజికల్ హిట్ అయ్యాయని, ఈ సినిమా కూడా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని శ్రీలేఖ చెప్పారు. సునీల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ -‘‘దర్శకుడిగా చాలా సినిమాలు చేసినా, సినిమా పరిశ్రమతో ఏదో గ్యాప్ ఉందనే ఫీలింగ్ ఉండేది. అది ఈ చిత్రంతో తీరిపోయింది. నాయుడిగారి బేనర్లో సినిమా చేయడం నా అదృష్టం. చక్కని కథ, మాటలు, టైటిల్, పాటలు కుదిరాయి. సినిమా పెద్ద హిట్ అవుతుందని నమ్మకంగా చెప్పగలను’’ అన్నారు. ఇంకా ఈ సమావేశంలో శరత్‌బాబు, బలభద్రపాత్రుని రమణి, భాస్కరభట్ల, రాహుల్, తన్వి, సంజనా, అనంత్ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. -
‘నేనేం చిన్నపిల్లనా?’
రాహుల్, తన్వి వ్యాస్ జంటగా పి. సునీల్‌కుమార్‌రెడ్డి దర్శకత్వంలో డా. డి.రామానాయుడు నిర్మించిన చిత్రం ‘నేనేం చిన్నపిల్లనా?’. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ఆడియో వేడుకలో పాల్గొన్న వెంకటేష్ సీడీని ఆవిష్కరించి, రామానాయుడు, రానాకి ఇచ్చారు.