తెలుగు సినిమా ప్రగతి | Telugu Cinema Pragathi Book Launch | Sakshi
Sakshi News home page

తెలుగు సినిమా ప్రగతి

Published Tue, Sep 17 2013 1:12 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

తెలుగు సినిమా ప్రగతి - Sakshi

తెలుగు సినిమా ప్రగతి

తన కెరీర్‌లో రాసిన పలు వ్యాసాలన్నింటినీ కలిపి సినీ పాత్రికేయుడు భగీరథ రూపొందిన గ్రంథం ‘తెలుగు సినిమా ప్రగతి’. వందేళ్ల భారతీయ సినిమా సంబరాలను పురస్కరించుకొని హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో ఆయన ఈ పుస్తకాన్ని ఆవిష్కరింపజేశారు. 
 
సీనియర్ నటి జమున తొలి పుస్తకాన్ని ఆవిష్కరించి నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్‌కి అందించారు.  వీరితో పాటు డా.డి.రామానాయుడు, కె.వి.రమణాచారి, డా.ఎస్.వరదాచారి, అల్లాణి శ్రీధర్ ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరై భగీరథ ప్రయత్నాన్ని అభినందించారు. 
 
భగీరథ మాట్లాడుతూ -‘‘నేను రాసిన వ్యాసాల్లో ముఖ్యమైన వాటిని ఎంపిక చేసి, ప్రస్తుత చిత్రపరిశ్రమ స్థితిగతుల్ని ప్రస్తావిస్తూ ఈ పుస్తకాన్ని రూపొందించాను. సినిమాపై నాకున్న అపారమైన అభిమానమే ఈ పుస్తకం రచనకు ప్రేరణ’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement