అది సవాల్‌తో కూడుకున్న పని : డా.డి.రామానాయుడు | Oka Criminal Prema Katha releasing on July 18th | Sakshi
Sakshi News home page

అది సవాల్‌తో కూడుకున్న పని : డా.డి.రామానాయుడు

Published Tue, Jul 15 2014 11:40 PM | Last Updated on Sat, Sep 2 2017 10:20 AM

అది సవాల్‌తో కూడుకున్న పని :  డా.డి.రామానాయుడు

అది సవాల్‌తో కూడుకున్న పని : డా.డి.రామానాయుడు

 ‘‘సమాజాన్ని ఆలోచింపజేసేలా సునిల్‌కుమార్‌రెడ్డి సినిమాలుంటాయి. తాను దర్శకత్వం వహించే ప్రతి సినిమాతోనూ  కొత్తవాళ్లను పరిచయం చేయడం అభినందనీయం. కొత్త ప్రతిభను పరిశ్రమకు పరిచయం చేయడం తేలికైన విషయం కాదు. సవాల్‌తో కూడుకున్న పని. ఈ నెల 18న విడుదల కానున్న ఈ చిత్రం విజయం సాధించాలి’’ అని డా.డి.రామానాయుడు అకాంక్షించారు. పి.సునిల్‌కుమార్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఒక క్రిమినల్ ప్రేమకథ’.
 
  మనోజ్ నందం, అనిల్ కల్యాణి, ప్రియాంక పల్లవి, దివ్య ఇందులో ప్రధాన పాత్రధారులు. శ్రావ్య ఫిలింస్ పతాకంపై కృష్ణమూర్తి సమర్పణలో యక్కలి రవీంద్రబాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రవీణ్ ఇమ్మడి స్వరపరిచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో రామానాయుడు చేతుల మీదుగా విడుదల చేశారు. సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని సునిల్‌కుమార్‌రెడ్డి చెప్పారు. సమాజంలో జరుగుతున్న తప్పుల్ని వేలెత్తి చూపించే అతి కొద్ది మంది దర్శకుల్లో సునిల్‌కుమార్‌రెడ్డి ఒకరని ఆర్పీ పట్నాయక్ అన్నారు. ఇంకా యూనిట్ సభ్యులతో పాటు ఎం.ఎం.శ్రీలేఖ, జయచంద్రారెడ్డి తదితరులు కూడా మాట్లాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement