Sunil Kumar reddy
-
తండ్రీకొడుకుల ఎమోషనల్ కథే ‘మా నాన్న నక్సలైట్’
‘‘నక్సల్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే తండ్రీకొడుకుల ఎమోషనల్ కథే ‘మా నాన్న నక్సలైట్’ చిత్రం. ఈ చిత్రం ప్రేక్షకుల మనసులను హత్తుకుంటుంది. చదలవాడ శ్రీనివాసరావుగారు కథ విని మంచి సినిమా అవుతుందనే నమ్మకంతో మమ్మల్ని ప్రోత్సహించారు. ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న ఈ బ్యానర్లో సినిమా చేయడాన్ని హ్యాపీగా ఫీలవుతున్నాను’’ అన్నారు దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి. గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు రఘు కుంచె ప్రధాన పాత్రలో సునీల్‌కుమార్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మా నాన్న నక్సలైట్’. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో అనురాధ ఫిలిమ్స్ డివిజన్‌పై చదలవాడ శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘మా నాన్న నక్సలైట్’ చిత్రం బాగా వచ్చింది. నక్సలైట్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న మంచి సెంటిమెంట్ సినిమా ఇది. సోసైటీకి ఉపయోగపడుతుంది. నా బ్యానర్లో వస్తోన్న మరో అద్భుతమైన చిత్రం ఇది. సునీల్కుమార్గారితో మరిన్ని సినిమాలు చేస్తా’’ అన్నారు. -
Land Suneel: ఎలాంటి సందర్భాల్లో అసైన్డ్ భూములు అమ్మవచ్చు?
సాక్షి, హైదరాబాద్: అసైన్డ్ భూముల అంశం పరిష్కరించలేనిది ఏమీ కాదని, ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే నిర్దిష్ట కార్యా చరణ, విస్తృత చర్చలతో దీనికి శాశ్వత పరిష్కారం తేవొచ్చని భూ చట్టాల నిపుణుడు, నల్సర్ అనుబంధ ప్రొఫెసర్ ఎం. సునీల్ కుమార్ (భూమి సునీల్) తెలిపారు. అసలు అసైన్డ్ చట్టంలో ఉన్న వెసులుబాట్లు, లోటుపాట్లు సరిదిద్దేలా మార్పులు తేవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన అసైన్డ్ భూములకు సంబంధించిన అనేక అంశాలు, సందేహాలపై ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్య్వూ ఇచ్చారు. సాక్షి: పేదలకు ప్రభుత్వం ఇచ్చిన భూములను అమ్ముకోవచ్చా? సునీల్: ప్రభుత్వం పేదలకు రెండు సందర్భాల్లో భూములిస్తుంది. ఒకటి వ్యవసాయం కోసం. రెండు ఇళ్లు కట్టుకునేందుకు. ఈ అసైన్మెంట్ భూములను తరతరాలుగా వారసత్వంగా అనుభవించవచ్చు కానీ అమ్మడం లేదా మరే విధంగానూ ఇతరులకు బదలాయింపు చేయడానికి వీల్లేదు. సాక్షి: ఎలాంటి సందర్భాల్లో అసైన్మెంట్ భూములను అమ్మే వీలుంది? సునీల్: ఇందుకు పీవోటీ చట్టంలోనే మినహాయింపులిచ్చారు. 1977లో వచ్చిన చట్టంలో ఇప్పటి వరకు 11 రకాల వెసులుబాట్లు కల్పించారు. అసైన్డ్ పట్టాలో అమ్మకూడదు అనే నిబంధన పేర్కొనకపోతే, భూమిలేని నిరుపేదలు ఎవరైనా 1977 కంటే ముందు కనుక అసైన్డ్ భూములను కొనుగోలు చేసి ఉంటే అమ్ముకోవచ్చు. అసైన్డ్ భూములను బ్యాంకులకు, సహకార సమాఖ్యలకు కుదువ పెట్టవచ్చు. అప్పు తీర్చకపోతే కుదువ పెట్టిన భూములను బ్యాంకులు వేలం వేసి విక్రయించవచ్చు. అలా వేలంలో కొన్న వారికి పూర్తి యాజమాన్య హక్కులు వస్తాయి. మాజీ సైనికులు, స్వాతంత్య్ర సమరయోధులు, రాజకీయ బాధితులకు భూములిస్తే వాళ్లు పదేళ్ల తర్వాత అమ్ముకోవచ్చు. రాజకీయ బాధితులైతే పట్టా చేతికి వచ్చిన మరుక్షణమే అమ్ముకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం నిర్దేశించిన ధర చెల్లించిన వారికి అసైన్ చేస్తారు. వారికి ఫామ్–జీ పట్టాలిస్తారు. అవి పట్టాభూములే. వాటిని తక్షణమే అమ్ముకోవచ్చు. 1977 నుంచి 2007 వరకు ఆంధ్రప్రదేశ్‌లో, 2017 వరకు తెలంగాణలో ఎవరైనా భూమి లేని పేదలు అసైన్డ్ భూములను కొనుగోలు చేస్తే కొన్న వారికి మళ్లీ అసైన్మెంట్ పట్టా ఇవ్వవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంటి స్థలాల కోసం ఇచ్చిన పట్టా భూములను 20 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చు. 2019 జనవరి కంటే ముందు అమ్ముకుని ఉంటే క్రమబద్ధీకరించుకోవచ్చు. అలాగే, రక్తసంబంధీకులకు దానం కానీ వీలునామా రూపంలో కానీ ఇవ్వవచ్చు. వారసుల పేరిట పట్టా మార్పిడి చేయొచ్చు. సాక్షి: చట్టాన్ని ఉల్లంఘించి కొనుగోలు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? సునీల్:అసైన్డ్ భూములను చట్టాన్ని ఉల్లంఘించి కొనుగోలు చేస్తే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశముంది. సివిల్ చర్యల కింద వారిని ఆ భూమి నుంచి తొలగించి ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకుంటుంది. పీవోటీ చట్టం సెక్షన్–7 ప్రకారం తహసీల్దార్ క్రిమినల్ కేసు (కొనుగోలు చేసిన వారిపై, అడ్డుపడిన వారిపై) పెట్టవచ్చు. సాక్షి: అసైన్డ్ భూముల విషయంలో ఇప్పుడెలాంటి నిబంధనలుండాలి? సునీల్: దీన్ని విçస్తృత కోణంలో ఆలోచించాలి. బ్యాంకుల్లో కుదువపెట్టి వేలం వేయించుకోవడం కొందరికి దొడ్డిదారిగా మారింది. అసైన్డ్ భూములు వేలానికి వెళితే వాటిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోనేరు రంగారావు కమిటీ సిఫారసు చేసింది. కానీ అమల్లోకి రావడం లేదు. ఇప్పటి వరకు జరిగిన అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించి వాళ్లకు పట్టాలివ్వాలని చట్టంలోనే ఉంది. కానీ అదీ అమలు చేయడం లేదు. ఇప్పుడు దాన్ని అమలు చేస్తే సరిపోతుంది. 2017తర్వాత కొను గోలు చేసినా ఇదే నిబంధన వర్తింపు చేస్తే చాలు. సాక్షి: పెద్దలు ఈ భూములను కొనుగోలు చేసినా, కబ్జా చేసినా పరిస్థితేంటి? సునీల్: పేదలు కాని వారు అసైన్డ్ భూములను కొనుగోలు చేస్తే ఏం చేయాలన్న దానిపై మూడు అభిప్రాయాలున్నాయి. మొదటిది అసైన్మెంట్ చట్టాన్ని తు.చ. తప్పకుండా అమలు చేయాలి. ప్రభుత్వం ఆ భూములను తీసుకుని, మళ్లీ అసైన్‌చేయాలి లేదంటే ప్రజావసరాల కోసం వినియోగించుకోవాలి. రెండోది.. క్రమబద్ధీకరణ. మార్కెట్ విలువ కట్టించుకుని వారికి యాజమాన్య హక్కులివ్వాలి. ఇప్పుడున్న పీవోటీ చట్టంలో అలాంటి వెసులుబాటు లేదు. చట్టాన్ని మార్చుకుంటే కానీ ఇది సాధ్యం కాదు. ఇక, మూడోది.. ఫలానా తేదీ తర్వాత పెద్దలు ఈ భూములను కొనుగోలు చేసేందుకు అవకాశం ఇవ్వకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే భూమిని కొనుగోలు చేసి భూమిలేని మరో నిరుపేదకు పంపిణీ చేయాలి.. లేదా విస్తృత ప్రజా ప్రయోజనం కోసం వాడొచ్చు. సాక్షి: అసైన్డ్ భూముల విషయంలో ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా? సునీల్: వారసత్వంగా అసైన్మెంట్ భూమి వచ్చి నా ఇంకా పట్టా మార్చడం లేదు. వారసుల పేరు మీద మ్యుటేషన్ చేసేందుకు చట్టంలో ఎక్కడా అడ్డంకులు లేవు. ఈ మ్యుటేషన్ ఫీజు ఎకరాకు రూ.2,500 భారమవుతుంది కనుక ఉచితంగా చే యాలి. లావుణి పట్టాలకు సంబంధించి ఇంకా కొత్త పాస్‌పుస్తకాలు ఇవ్వలేదు. ఇదేమంటే అసైన్డ్ భూమి అంటున్నారు. కానీ చట్టప్రకారం కొత్త పాస్ పుస్తకా లు ఇచ్చేందుకు అడ్డంకులు లేవు. అసైన్మెంట్ పట్టాలో ఉన్న సర్వే నెంబర్‌కు, అసైనీ కబ్జాలో ఉన్న భూమి సర్వే నెంబర్‌కు తేడాలున్నాయి. వీటిని పరిష్కరించకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు వస్తాయి. వీటన్నింటినీ పరిష్కరిస్తేనే అసైన్డ్ భూములకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. సాక్షి: చట్ట ఉల్లంఘన జరిగితే చర్యలు తీసుకునేందుకు అవలంబించాల్సిన పద్ధతులేంటి? సునీల్:అసైనీదారులు, కొనుగోలుదారులకు మొదట నోటీసులివ్వాలి. ఆ తర్వాత తహసీల్దార్ విచారణ జరపాలి. చట్ట ఉల్లంఘన జరిగిందని ప్రకటిస్తే కొనుగోలుదారుడు లేదా కబ్జాదారులను ముందు ఆ భూమి నుంచి తొలగించాలి. ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనపర్చుకోవాలి. క్రిమినల్ చర్యల్లో భాగంగా కేసు పెట్టాల్సింది తహసీల్దార్ మాత్రమే. తహసీల్దార్ లేదంటే ఆ పై స్థాయి అధికారి పెట్టవచ్చు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. సాక్షి: అసైన్డ్ భూములను ప్రభుత్వం తన విచక్షణతో స్వాధీనం చేసుకోవచ్చా?నష్టపరిహారం ఇస్తారా? సునీల్: అసైన్‌పట్టాను పరిశీలిస్తే ‘ప్రభుత్వానికి ఎలాంటి అవసరం వచ్చినా ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటుంది’ అనే నిబంధన ఉంటుంది. దీని ప్రాతిపదికగా చాలా సందర్భాల్లో అసైన్ భూములను ప్రభుత్వం తీసుకుంది. ఏ ఉద్దేశం కోసమైతే ప్రభుత్వం అసైన్ చేస్తుందో మూడేళ్లలో ఆ ఉద్దేశం నెరవేరకపోతే తిరిగి స్వాధీనం చేసుకోవచ్చు. అసైనీనే ప్రభుత్వానికి భూమిని సమర్పించవచ్చు. ప్రభుత్వం తీసుకుంటే 1992 వరకు నష్ట పరిహారం ఇవ్వలేదు. ఆ తర్వాత ఎకరానికి కంటితుడుపుగా ఎక్స్‌గ్రేషియా ఇచ్చేవారు. రెండు నెలల క్రితం వచ్చిన కోర్టు తీర్పుల ప్రకారం కూడా ఏ విధంగా అసైన్డ్ భూములను ప్రభు త్వం తీసుకున్నా పరిహారం ఇవ్వాల్సిందే. పట్టా భూములకు ఎంత చెల్లిస్తారో అంత చెల్లించాల్సిందే. భూమి హక్కులకు ఉల్లంఘన జరిగితే ఎన్నేళ్ల తర్వాత వచ్చి అడిగినా పరిహారం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. సాక్షి: అసైన్మెంట్ చట్టాల్లో మార్పులేమైనా చేయాలా? సునీల్: ఈ చట్టాల్లో కచ్చితంగా మార్పులు చేయాల్సిందే. కొన్ని నిబంధనలను తొలగించడం, కొన్నింటిని చేర్చడం జరగాలి. ఈ చట్టంలో మార్పులు చేసేటప్పుడు స్థానిక పరిస్థితులు, పరిస్థితుల్లో మార్పు, పక్క రాష్ట్రాల్లో అనుభవాలు లాంటి అంశాలను విస్తృతంగా చర్చించి మార్పులు చేయాలి. -
అదే ముసుగుల కాన్సెప్ట్
‘‘యువత చెడిపోవడానికి వారి తల్లిదండ్రులు కూడా ఓ కారణం. సరైన గైడెన్స్ లేకనే యువత చెడు మార్గాల్లోకి వెళ్తున్నారు. ఆ రకంగా తల్లిదండ్రులకు రొమాంటిక్ క్రిమినల్స్ ఒక చెంపపెట్టులాంటి చిత్రం అవుతుంది’’అన్నారు దర్శకులు పి. సునీల్‌కుమార్ రెడ్డి. మనోజ్ నందం ప్రధాన పాత్రలో సునీల్‌కుమార్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘రొమాంటిక్ క్రిమినల్స్’. రొమాంటిక్ క్రైమ్ కథ, ఓ క్రిమినల్ ప్రేమ కథ చిత్రాలకు సీక్వెల్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం నేడు విడుదల కానుంది. సునీల్‌కుమార్ మాట్లాడుతూ– ‘‘రెండేళ్లకొకసారి ఈ రొమాంటిక్ చిత్రాలను తెరకెక్కించాలని ప్లాన్ చేశాం. కాకపోతే గ్యాప్ వచ్చింది. ఓ జర్నలిస్టుగా స్టడీ చేసి ఈ కథలను రాసుకుంటున్నా. యువత వ్యసనాల గురించి ఈ సినిమాలో చూపించబోతున్నాం. సినిమా పోస్టర్లో ముగ్గురు అమ్మాయిలకు ముసుగులు వేశాం. వారు మూడు కాలాలను ప్రతిబింబిస్తారు. గతంలో చేసిన తప్పులకు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఇప్పుడు ఎలాంటి పొరపాట్లు చేస్తున్నారు? రేపు ఎలా ఉండబోతున్నారన్నది ఈ ముసుగుల కాన్సెప్ట్. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది’’ అని అన్నారు. -
కొత్తవారైనా ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు!
‘‘భావోద్వేగంతో కూడిన సినిమాను ప్రేక్షకులు ఆదరించడం ఆనందంగా ఉంది. 150 సెంటర్లలో ‘గల్ఫ్’ను విడుదల చేస్తే ఇప్పటికీ 16 కేంద్రాల్లో ఆడుతోంది. రూరల్ లెవల్లోనూ మా సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది’’ అని దర్శకుడు పి.సునీల్‌కుమార్ రెడ్డి అన్నారు. చేతన్ మద్దినేని, డింపుల్ జంటగా ఆయన దర్శకత్వంలో యక్కలి రవీంద్రబాబు, యమ్. రామ్‌కుమార్ నిర్మించిన ‘గల్ఫ్’ విడుదలై మంగళవారానికి 25 రోజులైంది. సునీల్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘జగిత్యాల వంటి సెంటర్లో మా సినిమా 25 రోజులు రన్ కావడం గ్రేట్. తెలంగాణలో మంచి స్పందన వస్తోంది. రూరల్ పీపుల్ ఓన్ చేసుకున్నారు. ఇందులో నటించింది కొత్తవారైనా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యారు. వాళ్లు కొన్ని గ్రామాలకు వెళ్లినప్పుడు అక్కడివారు గల్ఫ్‌లో ఉన్న తమ పిల్నల్ని వీళ్లలో చూసుకోవడం చూశా’’ అన్నారు. ‘‘రెండు మూడు రోజులకే చిన్న సినిమాను ఎవరూ పట్టించుకోవడం లేదు. అలాంటిది ‘గల్ఫ్’కి ఇంతమంచి స్పందన వస్తుండటం హ్యాపీ’’ అన్నారు చేతన్ మద్దినేని. ‘‘మా గత సినిమాల కన్నా ‘గల్ఫ్’కి ఎక్కువ స్పందన వస్తున్నందుకు హ్యాపీగా ఉంది’’ అన్నారు యక్కలి రవీంద్రబాబు. -
మూవీ రివ్యూ: గల్ఫ్
ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ క్రైమ్ కథ వంటి కమర్షియల్ సక్సెస్ సాధించిన సినిమాలతో పాటు గంగ పుత్రులు లాంటి సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన మరో సందేశాత్మక చిత్రం గల్ఫ్. పొట్ట కూటి కోసం దేశం విడిచి వెళ్లిన గల్ఫ్ వలస బాధితుల కష్టాలే కథాంశంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తెలంగాణకు చెందిన నేత కార్మికుడి కొడుకు శివ (చేతన్). తన స్నేహితుడు దుబాయ్ వెళ్లి బాగా సంపాదించడంతో తాను కూడా అలాగే డబ్బు సంపాదించాలనుకుంటాడు. అమ్మానాన్నలకు ఇష్టం లేకపోయినా.. గల్ఫ్ బాట పడతాడు. డబ్బు సంపాదించాలన్న ఆలోచనతోనే లక్ష్మీ (డింపుల్ హయాతి) కూడా దుబాయ్ వెళుతుంది. గల్ప్ ప్రయాణంలోనే పరిచయం అయినా శివ, లక్ష్మీలు ప్రేమలో పడతారు. ఎన్నో ఆశలతో దుబాయ్ లో అడుగు పెట్టిన శివకు అడుగడుగునా కష్టాలే ఎదురవుతాయి. తానే కాదు అక్కడ లక్షల మంది భారతీయులు ఇలాగే శ్రమదోపిడీకి గురవుతున్నారన్న నిజం తెలుసుకుంటాడు. డబ్బు ఆశతో గల్ఫ్ బాట పట్టిన మన వారి బతుకులను పరిచయం చేయటమే ఈ సినిమా కథ. యదార్థ పరిస్థితులను కథాంశంగా ఎంచుకున్న సునీల్ కుమార్ అక్కడే సగం విజయం సాధించాడు. గల్ప్ లో జీవితాల గురించి యువత ఎలాంటి కలలు కంటుంది. నిజంగా అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి, అక్కడి పరిస్థితుల గురించి పూర్తిగా తెలుసుకోకుండా వెళ్లటం మూలంగా బ్రోకర్లు, అరబ్బుల చేతుల్లో మనవాళ్లు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు. ఎన్ని కష్టాలు పడుతున్నారు అన్న విషయాలను చాలా బాగా చూపించారు. గల్ప్ లోని లోకేషన్లో చిత్రీకరణ చేయటం వలన సినిమా చాలా నేచురల్ గా అనిపిస్తుంది. భావోద్వేగ సన్నివేశాలు కంటతడి పెట్టిస్తాయి. హీరో హీరోయిన్ల నటన ఆకట్టుకుంటుంది. అయితే ఫస్ట్ అంతా ఎంతో బలంగా రాసుకున్న దర్శకుడు ద్వితియార్థంలో కాస్త తడబడ్డాడు. దుబాయ్ లో మోసపోయిన హీరో ఎదురుతిరిగిన తరువాత వచ్చే సన్నివేశాలు ఆకట్టుకునేలా లేకపోవటం నిరాశకలిగిస్తుంది. ఒకే తరహా కష్టాలను మళ్లీ మళ్లీ చూపించటం కూడా కాస్త విసిగిస్తుంది. పాజిటివ్ గా ముగుస్తుందనుకున్న సినిమాకు నెగెటివ్ ఎండింగ్ ఇవ్వడం కూడా ఇబ్బంది పెడుతుంది. పులగం చిన్నారాయణ అందించిన డైలాగ్స్ అక్కడక్కడా మెరిశాయి. సంగీతం, సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. మొత్తం మీద గల్ఫ్ మరోసారి సునీల్ కుమార్ రెడ్డి నుంచి వచ్చిన మంచి ప్రయత్నమనే చెప్పాలి. -
ఆయన అందరి దర్శకుల్లా కాదు!
‘‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’ చిత్రం ద్వారా నాకు సునీల్ కుమార్ రెడ్డి పరిచయం. ఆయన డైరెక్ట్ చేసిన ‘గంగపుత్రులు’ చుశాను. ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’ చిత్రం చూసి ఆశ్యర్యపోయాను. ఈ మూవీని హిందీలో ఆయన డైరెక్ట్ చేయకపోతే నేను రీమేక్ చేయాలనుకున్నాను. సునీల్ అందరి దర్శకుల్లా కాదు. గల్ఫ్‌లో ఉన్న పాతిక లక్షల మంది తెలుగువారి జీవితాలపై పరిశోధన చేసి, ఈ ‘గల్ఫ్’ తీశారు. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అని ప్రముఖ దర్శకుడు సుకుమార్ అన్నారు. సునీల్ కుమార్ దర్శకత్వంలో రవీంద్రబాబు నిర్మించిన ‘గల్ఫ్’ టైటిల్ లోగోను సుకుమార్ ఆవిష్కరించారు. ‘‘సోషల్ ఇష్యూలకు వినోదం కలిపి ఈ సినిమా తీశాం’’ అని సునీల్ కుమార్ అన్నారు. ఈ చిత్రానికి పులగం చిన్నారాయణ మాటల రచయిత. -
ఉపాధి వ్యథల ‘గల్ఫ్’
సామాజిక సమస్యలే ఇతివృత్తాలుగా సినిమాలు తెరకెక్కిస్తున్న దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి. ‘సొంత ఊరు’, ‘గంగపుత్రులు’ లాంటి సినిమాలు ఈ దర్శకుడిలోని సామాజిక బాధ్యతను చూపిస్తాయి. ప్రస్తుతం ఆయన మరో సోషల్ ఇష్యూతో ‘గల్ఫ్’ రూపొందిస్తున్నారు. శ్రావ్య ఫిలింస్ బ్యానర్‌పై యెక్కలి రవీంద్రబాబు, మద్దినేని రమణకుమారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చేతన్ మద్దినేని, సంతోష్ పవన్, అనిల్ కళ్యాణ్, డింపుల్ ముఖ్య తారలు. ప్రస్తుతం కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. సునీల్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ - ‘‘పొట్టకూటి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తున్న వారి కష్టాలను ఇందులో చూపిస్తున్నాం. ఈ వ్యథలో ఓ స్వచ్ఛమైన ప్రేమకథను చెప్పబోతు న్నాం. సెప్టెంబర్‌లో రిలీజ్ చేయాలను కుంటున్నాం’’ అన్నారు. -
ఇవన్నీ సమాజంలో జరుగుతున్నవే!
అక్రమ సంబంధాలు మానవ జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తాయనే కథాంశంతో దర్శకుడు పి. సునీల్‌కుమార్ రెడ్డి తీసిన చిత్రం ‘మిస్ లీలావతి’. కార్తీక్, లీలావతి ముఖ్య తారలుగా కీ ప్రొడక్షన్స్, శ్రావ్య ఫిలింస్‌పై యెక్కలి రవీంద్రబాబు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 3న విడుదల కానుంది. సునీల్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ -‘‘వైజాగ్‌లో పోలీస్‌గా చేస్తున్న నా స్నేహితుడు, ‘అక్రమ సంబంధాల వల్ల ఎన్నో జీవితాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి... ఆ పాయింట్ మీద సినిమా తీస్తే బాగుంటుంది’ అన్నాడు. అందుకే ఈ సినిమా చేశా. సమాజంలో జరుగుతున్నవే నా సినిమాల్లో చూపిస్తున్నా. విమర్శలు, ప్రశంసలూ రెండూ వస్తున్నాయి. మంచి సందేశం ఉన్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది’’ అన్నారు. అసభ్యతకు తావు లేకుండా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారని నిర్మాత చెప్పారు. సునీల్‌కుమార్ రెడ్డి ఏ సినిమా చేసినా మంచి సందేశం ఉంటుందని ఎగ్జిక్యూటివ్ నిర్మాత బాపిరాజు అన్నారు. పాటలు మాత్రమే కాదు, రీ-రికార్డింగ్ కూడా అద్భుతంగా కుదిరిందని సంగీతదర్శకుడు ప్రవీణ్ ఇమ్మడి చెప్పారు. ఛాయాగ్రాహకుడు ఎస్.వి. శివరాం, నటులు కార్తీక్, మహేశ్ కూడా మాట్లాడారు. -
లీలావతి కథేంటి?
హుద్ హుద్ రాకముందు, వచ్చిన తర్వాత పరిణామాలను ప్రధానాంశంగా చేసుకుని పి. సునీల్‌కుమార్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘మిస్ లీలావతి’. కీ ప్రొడక్షన్స్ సమర్పణలో రాజాజీ ఎంటెర్టైన్మెంట్స్ సారథ్యంలో శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై యెక్కలి రవీంద్రబాబు నిర్మిస్తున్నారు. కార్తీక్, లీలావతి, మహేశ్, ఎఫ్.ఎమ్.బాబాయ్, దివ్య, గీత, మల్లిక, బుగతా సత్యనారాయణ, సముద్రం వెంకటే శ్ తదితరులు ముఖ్య తారలు. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ - ‘‘ఒకసారి చరిత్రను తిరగేస్తే, ఎన్నో యుద్ధాలు, అధిక శాతం ప్రళయాలు.. ఇవి మనిషి తనకు తానుగా తెచ్చుకున్న ఉపద్రవాలే కానీ, సహజమైనవి కావు. స్త్రీ, పురుష సంబంధాల్లో ఇదే తరహా సూత్రం వర్తిస్తుందన్న కథాంశంతో రూపొందిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది’’ అని చెప్పారు. ఈ నెలలో పాటలను, వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి, కెమెరా: శివరాం, ఎడిటర్: శివ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బి. బాపిరాజు, సహనిర్మాతలు: కుర్రా విజయ్‌కుమార్, శాంతయ్య. -
వేంపల్లిలో వృద్ధాప్య పింఛన్ డబ్బు మాయం
కడప: జిల్లాలోని వేంపల్లి మండలం వీఎన్‌పల్లిలో గురువారం వృద్ధాప్య పింఛన్ డబ్బు మాయమైంది. వీఎన్పల్లికి చెందిన సునీల్ కుమార్ రెడ్డి నుంచి డబ్బు మాయమైనట్టు తెలిసింది. వీఎన్‌పల్లి నుంచి వేంపల్లికి ఆర్టీసీ బస్సులో వస్తుండగా డబ్బుల బ్యాగ్ మిస్ అయింది. దాంతో ఆయన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన వేంపల్లి పోలీసులు సిబ్బందిపై అనుమానంతో వారిని విచారిస్తున్నట్టు సమాచారం. -
అది సవాల్‌తో కూడుకున్న పని : డా.డి.రామానాయుడు
‘‘సమాజాన్ని ఆలోచింపజేసేలా సునిల్‌కుమార్‌రెడ్డి సినిమాలుంటాయి. తాను దర్శకత్వం వహించే ప్రతి సినిమాతోనూ కొత్తవాళ్లను పరిచయం చేయడం అభినందనీయం. కొత్త ప్రతిభను పరిశ్రమకు పరిచయం చేయడం తేలికైన విషయం కాదు. సవాల్‌తో కూడుకున్న పని. ఈ నెల 18న విడుదల కానున్న ఈ చిత్రం విజయం సాధించాలి’’ అని డా.డి.రామానాయుడు అకాంక్షించారు. పి.సునిల్‌కుమార్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఒక క్రిమినల్ ప్రేమకథ’. మనోజ్ నందం, అనిల్ కల్యాణి, ప్రియాంక పల్లవి, దివ్య ఇందులో ప్రధాన పాత్రధారులు. శ్రావ్య ఫిలింస్ పతాకంపై కృష్ణమూర్తి సమర్పణలో యక్కలి రవీంద్రబాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రవీణ్ ఇమ్మడి స్వరపరిచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో రామానాయుడు చేతుల మీదుగా విడుదల చేశారు. సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని సునిల్‌కుమార్‌రెడ్డి చెప్పారు. సమాజంలో జరుగుతున్న తప్పుల్ని వేలెత్తి చూపించే అతి కొద్ది మంది దర్శకుల్లో సునిల్‌కుమార్‌రెడ్డి ఒకరని ఆర్పీ పట్నాయక్ అన్నారు. ఇంకా యూనిట్ సభ్యులతో పాటు ఎం.ఎం.శ్రీలేఖ, జయచంద్రారెడ్డి తదితరులు కూడా మాట్లాడారు. -
క్రిమినల్ ప్రేమకథ
డెంకాడ: సమాజంలో యువతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధాన ఇతివృత్తంగా క్రిమినల్ ప్రేమకథ చిత్రాన్ని తీస్తున్నామని సినీదర్శకుడు సునీల్‌కుమార్ రెడ్డి చెప్పారు. జొన్నాడ వద్ద ఉన్న లెండి ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యువతులు సమాజంలో అనేక మంది ఉన్మాదులు, శాడిస్టులు వంటి రకరకాల వ్యక్తులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇలాంటి అంశాలను ఆధారంగా చేసుకుని, కళాశాలల్లో తాను వెళ్లేటప్పుడు విద్యార్థినుల వద్ద సేకరించిన అంశాలనే ఆధారంగా తీసుకుని క్రిమినల్ ప్రేమకథ సినిమా తీయటం జరిగిందన్నారు. ఈ సినిమాల్లో లెండి ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన అనణ్య, ప్రత్యూష, రమణి, కౌషిక్లకు పాట పాడే అవకాశం కల్పించామన్నారు. కళాశాల ప్రిన్స్‌పాల్ డాక్టర్ వీవీ రామారెడ్డి మాట్లాడుతూ లెండి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించటం హర్షనీయమన్నారు. మ్యూజిక్ డెరైక్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ఆర్తిని ఈ సినిమా పాటల్లో చూపించటం జరుగుతుందన్నారు. సమావేశంలో ఎన్ఎస్ఎస్ పీఓ టి.హరిబాబు, చిత్ర నటులు మనోజ్, అనిల్, ప్రియాంక, పల్లవి, దివ్య, మనోప్రియ తదితరులు పాల్గొన్నారు. -
ఆ అమ్మాయి ప్రశ్నలకు నిశ్చేష్టుణ్ణయ్యా!
ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో సామాజిక స్పృహతో సినిమాలు చేయాలని తపించే అతి తక్కువమంది దర్శకుల్లో ఒకరు సునీల్‌కుమార్‌రెడ్డి. గంగపుత్రులు, సొంత ఊరు, ఒక రొమాంటిక్ క్రైమ్ కథ చిత్రాలతో ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ మంచి స్థానాన్ని ఏర్పరుచుకున్న సునీల్‌కుమార్‌రెడ్డి నుంచి రాబోతున్న చిత్రం ‘ఒక క్రిమినల్ ప్రేమకథ’. వచ్చే నెలలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ విలక్షణ దర్శకునితో సాక్షి జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ. మళ్లీ అమ్మాయిల ఫేసులకు పరదాలు కట్టారేంటి? ఈ దఫా చర్చ దేనిమీద? ‘రొమాంటిక్ కైమ్ కథ’ మాదిరిగానే... ఇది కూడా యువతరం నేపథ్యమే. అయితే... ఆ సినిమా కంటే... ముందుకెళ్లి ఇంకాస్త బోల్డ్‌గా తీసిన సినిమా ఇది. తప్పకుండా నచ్చుతుంది అనుకున్నా. దాదాపు 28 ఇంజనీరియంగ్ కళాశాలలకు, 12 జూనియర్ కాలేజ్‌లకు అతిథిగా వెళ్లి వందలాది మంది విద్యార్థులతో మాట్లాడటం జరిగింది. అప్పుడు ఓ అమ్మాయి అడిగిన ప్రశ్నలు... నన్ను ఆలోచింపజేశాయి. ‘ఒక తాగుబోతు అర్ధరాత్రి అమ్మాయిని ఏదైనా చేస్తే... అది పేపర్లో పతాక శీర్షిక అవుతుంది. కానీ... ఇంట్లో బాబాయో..లేక అన్నయ్యో, పాఠాలు చెప్పే గురువో ఒక అమ్మాయిని లైంగికంగా వేధిస్తే అది మాత్రం పేపర్లో మూడో పేజీకో నాల్గవ పేజీకో పరిమితం అవుతుంది. ఎందుకు? అమ్మాయిలు ఇళ్లలోనే క్షేమంగా ఉంటారని ప్రపంచం మొత్తం నమ్ముతుంది. కానీ... అక్కడే వాళ్లు డేంజర్లో ఉన్నారు. ఇది అన్నింటికంటే పెద్ద సమస్య. మరి దీన్నెందుకు తేలిగ్గా తీసుకుంటున్నారు? ఒక తాగుబోతు తప్పు చేస్తే... ‘వాణ్ణి చంపేయాలి చంపేయాలి’ అని గోల చేసే ఈ సమాజం... ఒక తండ్రి, ఒక అన్న, ఒక గురువు తప్పు చేస్తే... ఎందుకు తేలిగ్గా తీసుకుంటున్నారు? అని ఆ అమ్మాయి అడుతుంటే నిశ్చేష్ణుణ్ణై అలా నిలుచుండిపోయాను. వెంటనే ఈ సమస్యపై పూర్తిగా అధ్యయనం చేయాలనిపించింది. రీసెర్చ్ మొదలుపెట్టాను. అప్పుడు షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. లైంగిక వేధింపుల్లో ప్రపంచంలో మనదేశానిది రెండో స్థానం. ప్రతి ఏడాదీ దేశంలో అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ... 53 శాతం మంది లైంగిక వేధింపులకు గురవుతున్నారు. ఇందులో సమైఖ్యాంధ్రప్రదేశ్ది రెండో స్థానం. ఇది సాక్షాత్తూ మన భారత ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్. ప్రతి ఇద్దరమ్మాయిల్లో ఒక అమ్మాయి ఎవరితోనో ఒకరితో వేధింపులు గురవుతూ చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. వీరి బాధను ఫోకస్ చేసే విషయంలో మీడియా కూడా చురుకుగా వ్యవహరించడంలేదు. అందుకే... సినిమా ద్వారా వారి గొంతును ఎందుకు వినిపించకూడదు అనిపించింది. ఆ ఆలోచనకు రూపమే... ‘ఓ క్రిమినల్ ప్రేమకథ’. ఈ సమస్యకు సరైన పరిష్కారం చెప్పేననే అనుకుంటున్నారా? ఒక సమస్యకు వందల పరిష్కారాలంటాయి. వాటిలో నేను ఒక పరిష్కారం చెప్పాను. ఈ సినిమా చేసే ముందు చాలామంది చదువుకునే అమ్మాయిలను ప్రత్యేకంగా కలిశాను. వారిలో 60 శాతం మంది తమ సమస్యల్ని చెప్పుకొని ఘొల్లు మన్నారు. 6వ తరగతిలో పాఠాలు చెప్పే నెపంతో అక్కడక్కడ చేతులేసిన మాస్టారు దగ్గర్నుంచి ప్రస్తుతం సాటి విద్యార్థుల వల్ల ఎదురవుతున్న లైంగిక వేధింపుల వరకూ వారు చెప్పిన సమస్యలు నన్ను ఎంతో కదిలించాయి. ఈ సమస్యలకు తెరపై నేనిచ్చిన పరిష్కారమేంటో నేను చెప్పడం కంటే మీరు తెరపై చూస్తేనే బావుంటుంది. సమస్యల చుట్టూ పరుగు పెడితే.. డాక్యుమెంటరీ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది కదా! మీరన్నది నిజం. జాగ్రత్తగా తీయకపోతే... ఇలాంటి కాన్సెప్ట్‌లు డ్రైగా అనిపిస్తాయి. దాన్ని కథగా చెప్పాలనుకున్నప్పుడు అంతర్లీనంగా వినోదాన్ని కూడా జత చేయాలి. కంటి నుంచి నీరు, పెదాలపై నవ్వు ఒకేసారి వచ్చేలా చేయాలి. అదే ఇందులో చేశాను. కమర్షియల్ పంథాలో వెళ్లకుండా సమస్యల వెంట పరుగెత్తడం రిస్క్ అనిపించట్లేదా? లేదు... సినిమా శక్తిమంతమైన మాధ్యమం. దాన్ని వినోదానికే పరిమితం చేయకూడదు. ఏదో ఒక మంచి చెప్పాలి. అయితే... దాన్ని ఆసక్తికరంగా చెప్పినప్పుడు విజయం తథ్యం. ‘ఒక క్రిమినల్ ప్రేమకథ’లో నేను తీసుకున్న సమస్య సామాన్యమైనది కాదు. వేధింపులు గురైన ప్రతి ఒక్కరూ ఎవరో ఒకర్ని వేధింపులకు గురి చేయడానికే చూస్తారు. ఇదొక చైన్ లింక్. వేధింపులకు గురైన కోడలు... అత్తగా మారాక, తన కోడల్ని వేధించడమే అందుకు ఓ నిదర్శనం. నిర్భయ కేసులో హంతకులందరూ వేధింపులకు గురైనవారే. ఇలా అన్ని విషయాలనూ ఇందులో సృ్ఫశించాను. అమ్మాయిలు ప్రేమించలేదని ముఖంపై యాసిడ్ పోసేవారి గురించి కూడా ఈ కథలో ఉంటుంది. చెడు వెళ్లినంత త్వరగా మంచి జనాల్లోకి వెళ్లదు. ఇలాంటి సినిమాలు చేసేటప్పుడు ప్రేక్షకులు మరో కోణంలో ఎడ్యుకేట్ అయ్యే ప్రమాదం ఉంది. ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మనం చెబితే కానీ తెలుసుకోలేనంత అమాయకంగా జనాలు లేరు. నేను ఇందులో కొత్తగా ఏమీ చెప్పడం లేదు. తప్పుని నిర్భయంగా ఒప్పుకునే స్థైర్యాన్ని ఇస్తున్నానంతే. నా ఇంట్లో ఈ తప్పు జరుగుతోంది అని చెప్పడానికి ఓ ధైర్యం కావాలి. ఓ ఎనిమిదో తరగతి అమ్మాయి... తన తల్లి ముందు కూర్చొని ‘అమ్మా.. బాబాయి ఇలా చేస్తున్నాడు’ అని చెప్పుకోగలగాలి. ఒక్కసారి అంతా బయటకు కక్కేసి, భోరున ఏడ్చుకోగలితే సమస్యలన్నీ తీరిపోతాయి. కండోమ్స్ గురించి ప్రస్తావిస్తే ఒకప్పుడు సెన్సార్‌వాళ్లు గుండెలు బాదేసుకునేవారు. కానీ... ఇప్పుడు కండోమ్స్ గురించి కోట్లు ఖర్చుపెట్టి మరీ పబ్లిసిటీ చేస్తున్నారు. ఒక్క దేవాలయాలు మినహా బళ్లలో కూడా కండోమ్స్‌పై అవగాహన కలిగిస్తున్నారు. అ చైతన్యమే జనాల్లో రావాలి. చెత్త పక్కనుంటే ‘ముక్కుమూసుకొని వెళ్తే సరిపోతుంది’ అనుకునే భావదారిద్య్రం మనం బయటపడాలి. ఆ చెత్తను అక్కడున్నంచి తొలగించే చైతన్యం రావాలి. ఇవన్నీ జరగాలంటే... సమాజం తన మనసులకు కప్పుకున్న ముసుగు విప్పేయాలి. అందుకు సింబాలిక్‌గానే అమ్మాయిల ముఖాలకు ముసుగులు తొడిగాను. అంతేతప్ప స్త్రీలను కించపచడానికి ఆ ముసుగుల్ని చూపించలేదు. వార్తను పేపర్లో చదవడానికీ, తెరపై చూడటానికీ తేడా ఉంది. ఘోరాలను కళ్లకు కట్టడం చూసేవారికి క్కూడా కష్టంగా ఉంటుంది కదా! కేంద్ర మంత్రి నితీష్కుమార్కి ఓ అమ్మాయి ఉత్తరం రాసింది. గత కొన్నాళ్లుగా తన తండ్రే తనను రేప్ చేస్తున్నాడని, ఈ విషయం తన అన్నకు చెబితే... తానూ తనను వాడుకోవడం మొదలుపెట్టాడని, ఇదేంటి అన్నయ్యా... అంటే... నాన్న బాధ తీరుస్తున్నావు, మరి నా బాధ ఎవరు తీరుస్తారు? అనడిగాడని ఆ ఉత్తరం సారంశం. వెంటనే నితీశ్కుమా సదరు తండ్రికొడుకులపై చర్య తీసుకున్నారు. ఈ విషయం బయటకు రాగానే... ఇలాంటి కేసులు పదుల సంఖ్యలో వెలుగు చూశాయి. ఆ చైతన్యం మరింతగా జనాల్లో రావాలనే ఈ ప్రయత్నం. దీని వల్ల కొంతైన మార్పొస్తే... నా ప్రయత్నం సఫలం అయినట్లే. సాంకేతికంగా కూడా నా గత చిత్రాలకంటే మిన్నగా ఉంటుందీ సినిమా. తేలిగ్గా విజయాలను అందుకోవడానికి సునీల్‌కుమార్‌రెడ్డి ఇలాంటి సినిమాలు తీస్తున్నాడనే విమర్శ మీపై ఉంది. దీనికి మీ సమాధానం? గంగపుత్రులు,సొంత ఊరు, రొమాంటిక్ క్రైమ్ కథ ఇవన్నీ.. సమాజంలోని ఆయా విభాగాలకు సంబంధించిన ప్రజల అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి చేసిన ప్రయత్నాలు. ఇప్పుడు రాబోతున్న ‘ఓ క్రిమినల్ లవ్‌స్టోరీ’ కూడా అలాంటి సినిమానే. అంతేతప్ప... తేలిగ్గా డబ్బులు సంపాదించడానికి చేసిన ప్రయత్నం కాదు. సొసైటీలోని విషయాలపై విమర్శించే ధైర్యం నాకున్నప్పుడు... నాపై వచ్చే విమర్శల్నికూడా స్వీకరించే ఓర్పు కూడా ఉండాలి. మీ ‘రొమాంటిక్ కైమ్ కథ’లో అభ్యంతర సన్నివేశాలు ఉన్నాయనే విమర్శలు ఎదురయ్యాయి. మరి ఈ సినిమాలో కూడా అలాంటివి ఉంటాయా? చూడండీ... నా సినిమాల్లో ఒక్క డబుల్‌మీనింగ్ డైలాగ్‌ని కూడా మీరు వినలేరు. నేను కలిసి వ్యక్తుల మనోభావాలే నా సంభాషణలు. నిజాన్ని నిర్భయంగా చెబుతున్నప్పుడు విమర్శలు సహజం. ఒక్క సినిమా తీయడం కోసం ఇంత రీసెర్చ్ అవసరమా? మీకు టైమ్ వేస్ట్ కదా? ఇలా చేయడంలోనే నేను ఎంజాయ్ చేస్తా. నేను చెప్పే ఏ విషయం అయినా... జనానికి సూటిగా తగలాలి. అంతేతప్ప రాంగ్సెన్స్ రాకూడదు. దానికోసమే ఈ ప్రయత్నం. మెసేజ్ ఇవ్వాలనుకుంటే... ఒక ఎస్ఎంఎస్ కొడితే సరిపోతుందా. ‘రెండుగంటలు ఈ టార్చెర్ దేనికి?’ అనేవాళ్లు కూడా ఉన్నారు. అలాంటి వారు కూడా ఎంజాయ్ చేసేలా సినిమా ఉన్నప్పుడే మనం విజయం సాధించినట్లు. అంటే మీ నుంచి మామూలు సినిమాలు రావన్నమాట? డెఫనెట్లీ.. ఫ్యూచర్లో ఇవే మామూలు సినిమాలు అవుతాయనుకుంటున్నా. టి.కృష్ణ, వేజళ్ల సత్యనారాయణ... లాంటి వాళ్లు సినిమాలు చూస్తున్నప్పుడు ‘ఇదిరా మన సినిమా’ అన్నారు యువతరం. వారి బాటలోనే నేనూ. తెలుగు సినిమాకు నేషనల్ అవార్డు తేవడమే మీ ధ్యేయమా? నా పని నేను చేసుకుంటూ పోతున్నా. వస్తే కచ్చితంగా ఆనందమే. అసలు దర్శకునిగా మీ ప్రేరణ? నా చుట్టు ఉన్న సమస్యలే. -
మెరిపిస్తాం..మురిపిస్తాం..
‘న్యూస్‌లైన్’తో విశాఖ సినీ తేజాల మాటామంతీ విశాఖ నగరానికి సినిమా పరిశ్రమకు అవినాభావ సంబంధం ఉంది. ఈ అందాల తీరం షూటింగ్‌లకు నుకూలమన్న విషయం తెలిసిందే. అలాగే ఎంతోమంది నటీనటులు, దర్శకులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, విలన్లు, నిర్మాతలు మన నగరం నుండి వెళ్లి తెలుగు చిత్ర పరిశ్రమను సుసంపన్నం చేశారు. వీరిలో కొంతమంది తమ న్యూ ఇయర్ కమిట్మెంట్స్ను ‘న్యూస్‌లైన్’కు వివరించారు. లవ్ స్టోరీతో వస్తున్నా... నర్సీపట్నం ప్రాంతానికి చెందిన దర్శకుడు పూరి జగన్నాథ్ నితిన్ హీరోగా నటిస్తున్న హార్ట్ ఎటాక్ చిత్రం షూటింగ్లో బిజీబిజీగా ఉన్నారు. ఈ చిత్రం చాలా వరకు పూర్తి కావచ్చింది. మంచి యూత్ ఫుల్ లవ్‌స్టోరీగా నిలుస్తుందని ఆయన చెప్పారు. జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి నెలలో హార్ట్ ఎటాక్‌ను విడుదల చేయనున్నామన్నారు. ఇప్పుడాయన బ్యాంకాక్‌లో షూటింగ్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం తన దృష్టి ఈ చిత్రంపైనే ఉందని, మిగతా ప్రాజెక్టుల వివరాలు తర్వాత వెల్లడిస్తానన్నారు. ప్రేక్షకులకు ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. ఈ ఏడాది ఎన్నో చిత్రాలు విజయవంతమై పరిశ్రమలో అందరూ ఆనందంగా ఉండాలని కోరుతున్నానన్నారు. ఈ ఏడాది కూడా విశాఖలో షూటింగ్... ఈ ఏడాది కూడా విశాఖలోనే తన తదుపరి చిత్ర షూటింగ్ జరుగుతుందని ప్రముఖ దర్శకుడు సునీల్‌కుమార్ రెడ్డి చెప్పారు. ఆయనకు ఈ నగరమంటే సెంటిమెంట్. హీరో, గంగపుత్రులు, రొమాంటిక్ క్రైమ్ కథ.. ఇలా తాను డెరైక్ట్ చేసిన సినిమాలు విశాఖలోనే తీశారు. తన సొంత బ్యానర్ శ్రావ్య ఫిలిమ్స్‌పై యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ చిత్రం రూపొందిస్తున్నానని, జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి తొలి వారంలో షూటింగ్ ప్రారంభిస్తానని చెప్పారు. ఇద్దరు పెద్ద హీరోలతో సినిమాలు చేయడానికి చర్చలు సాగుతున్నాయన్నారు. ప్రజలందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెబుతూ సామాజిక దృక్పథంతో సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని కోరారు. మరింత కామెడీ పండిస్తా... విశాఖ నుండి వెళ్లిన కొద్ది కామెడియన్లలో ప్రస్తుత జనరేషన్లో బాగా పాపులర్ అయిన నటుడు సుమన్ శెట్టి. పూర్ణామార్కెట్ ప్రాంతానికి చెందిన ఈ నటుడు కామెడీ పండించడంలో తనదంటూ ఓ ముద్ర వేశాడు. కొత్త సంవత్సరంలో మరి న్ని మంచి చిత్రాల్లో నటిస్తున్నానని, బెస్ట్ కామెడీ పండి స్తానని చెప్పాడు. ఈ ఏడాది ఓ స్త్రీ ప్రేమకధ, రింగ్‌టోన్, తనీష్ హీరోగా చేస్తున్న తమిళ, తెలుగు చిత్రాలు, వరుణ్ సందేశ్ నటిస్తున్న నాతో వస్తావా చిత్రంలో నటిస్తున్నాడు. ఈ ఏడాది నాకు చాలా ప్రత్యేకం స్టార్ మేకర్ సత్యానంద్ అంటే తెలియని వారుండరు. సుమారు 70మంది హీరోలను, 12మంది క్యారెక్టర్ నటులను, ఎనిమిదిమంది దర్శకులను, ఎందరో టీవీ ఆర్టిస్టులను అందించిన ఘనత ఆయనది. ఈ సంవత్సరం తనకు చాలా ప్రత్యేకమని సత్యానంద్ చెప్పారు. కారణం ఇరవై ఏళ్ల సినీ ప్రస్థానంలో తాను తొలిసారిగా నటిస్తున్న బిల్లారంగ చిత్రం ఈ ఏడాది విడుదలవుతోంది. దర్శకుడు సునీల్‌కుమార్‌రెడ్డి తీస్తున్న కొత్త చిత్రంలో కూడా సత్యానంద్ నటించబోతున్నారు. ఈ ఏడాది తన దృష్టి అంతా యాక్టింగ్పైనేనని చెప్పారు. నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్, చిరు మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌ల చిత్రాలు ఈ ఏడాది రిలీజవుతున్నాయి. వీరిద్దరూ సత్యానంద్ స్కూలు నుండి వచ్చిన వారే. ఈ ఏడాది విశాఖ నుండి మరింతమంది చిత్ర పరిశ్రమకు చేరాలని కోరుతున్నానన్నారు. -
‘నిర్భయ’ ప్రేరణతో గులాబి
‘‘ఇటీవల కాలంలో స్త్రీలపై అత్యాచారాలు అధికమైపోయాయి. నిర్భయ సంఘటన తర్వాత ఆడవాళ్లు దుర్గామాతలుగా మారారు. ఆ ప్రేరణతో సందేశాత్మకంగా దర్శకుడు ఈ చిత్రాన్ని మలచడం అభినందనీయం’’ అని మాదాల రవి అన్నారు. గోగిశెట్టి క్రియేషన్స్ పతాకంపై మాదాల కోటేశ్వరరావు స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్న ‘గులాబి’ చిత్రం ఆడియో ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు సునీల్‌కుమార్‌రెడ్డి పాటల సీడీని, నిర్మాత యెక్కలి రవీంద్రబాబు ప్రచారం చిత్రాలను ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘నిర్భయ సంఘటన తర్వాత నేను, నా మిత్రుడు కలిసి ఎంతో చర్చించి ఈ కథ తయారు చేశాం. చిత్రీకరణ పూర్తయింది. పవన్‌శేష మంచి సంగీతం ఇచ్చారు’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంకా బసిరెడ్డి, బాపిరాజు, వైభవ్, యశోకృష్ణ పాల్గొన్నారు. -
రక్తంతో తడిసిన రహదారులు
రహదారులు రక్తం రుచిమరిగాయి. జిల్లాలో ప్రతి రోజూ రెండు, మూడు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఒకరిద్దరు మృత్యువాతపడుతుండగా, వీరి సంఖ్య కొన్ని సందర్భాల్లో రెట్టింపుగా కూడా ఉంటోంది. మరెందరో కాళ్లు, చేతులు పోగొట్టుకుని వికలాంగులుగా మిగిలిపోతున్నారు. దీంతో ఆయా కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉంటోంది. తాజాగా శనివారం వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మొత్తం పదకొండు మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరు భారతి సిమెంట్ ఉద్యోగులు కూడా ఉన్నారు. ప్రమాదాల నివారణలో యంత్రాంగం వైఫల్యం కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. ప్రొద్దుటూరు క్రైం/ఎర్రగుంట్ల, న్యూస్‌లైన్: ఎర్రగుంట్లలోని కడప రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మొత్తం ఐదుగురు గాయపడ్డారు. వీరిలో సునీల్‌కుమార్‌రెడ్డి, వినోద్ సహా వల్లపు సురేంద్ర, కొమ్మెర వెంకటసుదర్శన్, కొమ్మెరప్రతాప్ ఉన్నారు. చిలంకూరుకు చెందిన సునీల్కుమమార్రెడ్డి భారతి సిమెంట్ కర్మాగారంలోని హాజీ ఏపీబావా కన్స్ట్రక్షన్ కంపెనీలో అకౌంటెంట్‌గా పని చేస్తుండగా, కేరళకు చెందిన వినోద్ కూడా అదే కంపెనీలో సూపర్వైజర్గా పని చేస్తున్నాడు. వీరు ఎర్రగుంట్లలో నివాసం ఉంటూ ప్రతి రోజూ విధులకు వెళ్లొచ్చేవారు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం ప్లాటినా బైక్‌లో సిమెంట్ ఫ్యాక్టరీకి బయలు దేరారు. ఎర్రగుంట్లలోని మహేశ్వరనగర్‌లో నివాసముంటున్న బేల్దారీలు సురేంద్ర, వెంకటసుదర్శన్, కొమ్మెరప్రతాప్ టీవీఎస్ ఎక్స్ఎల్లో నల్లింగాయపల్లెకు బయలు దేరారు. కడప రోడ్డులోని పెట్రోల్ బంకు సమీపానికి రాగానే ఎదురుగా వచ్చిన ఫర్చూనర్ అనే కారు రెండు ద్విచక్ర వాహనాలను ఢీ కొంది. ముందుగా టీవీఎస్ ఎక్స్ఎల్ను ఢీకొన్న కారు తర్వాత వారి వెనకాలే వస్తున్న సునీల్‌కుమార్‌రెడ్డి, వినోద్ బైక్‌ను ఢీకొంది. ఘటనలో ఐదుగురూ గాయపడ్డారు. స్థానికులు వెంటనే వారిని 108లో ప్రొద్దుటూరులోని జిల్లా స్థాయి ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం సునీల్‌కుమార్‌రెడ్డి, వినోద్‌లను కర్నూలుకు, వెంకటసురేంద్ర, ప్రతాప్‌ను కడప రిమ్స్‌కు తరలించారు. చిలంకూరు సర్పంచ్ కె.పుల్లయ్య, ఆనందరెడ్డి జిల్లా ఆస్పత్రికి విచ్చేసి సహాయక చర్యలు చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎర్రగుంట్ల ఏఎస్ఐ చంద్రశేఖర్‌రెడ్డి తె లిపారు. సింహాద్రిపురంలో... సింహాద్రిపురం మండలం గురిజాల సమీపంలో శనివారం ఉదయం బొలెరో బోల్తా పడిన సంఘటనలో అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం పాతపల్లె మాజీ సర్పంచ్ సహా ఆయన కుటుంబ సభ్యులు ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పాతపల్లెకు చెరందిన మాజీ సర్పంచ్ నాగార్జునరెడ్డి తన కుమారుడు శశికుమార్‌రెడ్డి, కోడలు స్వాతితో పాటు వియ్యంకురాలు ప్రభావతి ఆస్ట్రేలియా నుంచి విమానంలో శుక్రవారం రాత్రి బెంగళూరుకు వచ్చారు. వారిని పిల్చుకొచ్చేందుకు నాగార్జునరెడ్డి బొలెరోలో బెంగళూరు వెళ్లి వారిని పిల్చుకొని స్వగ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యంలోని గురిజాల సమీపానికి రాగానే ఇక్కడి ఓ మలుపులో వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఘటనలో శశికుమార్‌రెడ్డి, స్వాతి, ప్రభావతి తీవ్రంగా గాయపడగా, నాగార్జునరెడ్డి స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రులను అనంతపురం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అట్లూరులో... అదుపు తప్పిన ఓ కారు అట్లూరు మండలం మాడపూరు చెరువులోకి దూసుకెళ్లింది. మన్యంవారిపల్లె గ్రామంలోని భాస్కర్‌రెడ్డికి చెందిన టాటా ఇండికా కారు బద్వేలు వైపు నుంచి వేమలూరుకు బయలుదేరింది. మార్గమధ్యంలోని మాడపూరు చెరువు కట్టపైకి రాగానే అదుపు తప్పి చెరువులోకి బోల్తా కొట్టింది. ఈ సంఘటనలో కారు డ్రైవర్ స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అతన్ని బద్వేలులోని ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. కమలాపురంలో... సి.గోపులాపురం వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కలమల్లకు చెందిన కుమార్ తీవ్రంగా గాయపడ్డాడని గ్రామస్తులు తెలిపారు. రోడ్డు దాటుతున్న అతన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోవడంతో తల, చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని 108లో ప్రొద్దుటూరు ఆస్పత్రికి తరలించారు. అయితే అతని పరిస్థితి విషమంగా ఉంది. -
రక్తంతో తడిసిన రహదారులు
రహదారులు రక్తం రుచిమరిగాయి. జిల్లాలో ప్రతి రోజూ రెండు, మూడు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఒకరిద్దరు మృత్యువాతపడుతుండగా, వీరి సంఖ్య కొన్ని సందర్భాల్లో రెట్టింపుగా కూడా ఉంటోంది. మరెందరో కాళ్లు, చేతులు పోగొట్టుకుని వికలాంగులుగా మిగిలిపోతున్నారు. దీంతో ఆయా కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉంటోంది. తాజాగా శనివారం వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మొత్తం పదకొండు మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరు భారతి సిమెంట్ ఉద్యోగులు కూడా ఉన్నారు. ప్రమాదాల నివారణలో యంత్రాంగం వైఫల్యం కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. ప్రొద్దుటూరు క్రైం/ఎర్రగుంట్ల, న్యూస్‌లైన్: ఎర్రగుంట్లలోని కడప రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మొత్తం ఐదుగురు గాయపడ్డారు. వీరిలో సునీల్‌కుమార్‌రెడ్డి, వినోద్ సహా వల్లపు సురేంద్ర, కొమ్మెర వెంకటసుదర్శన్, కొమ్మెరప్రతాప్ ఉన్నారు. చిలంకూరుకు చెందిన సునీల్కుమమార్రెడ్డి భారతి సిమెంట్ కర్మాగారంలోని హాజీ ఏపీబావా కన్స్ట్రక్షన్ కంపెనీలో అకౌంటెంట్‌గా పని చేస్తుండగా, కేరళకు చెందిన వినోద్ కూడా అదే కంపెనీలో సూపర్వైజర్గా పని చేస్తున్నాడు. వీరు ఎర్రగుంట్లలో నివాసం ఉంటూ ప్రతి రోజూ విధులకు వెళ్లొచ్చేవారు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం ప్లాటినా బైక్‌లో సిమెంట్ ఫ్యాక్టరీకి బయలు దేరారు. ఎర్రగుంట్లలోని మహేశ్వరనగర్‌లో నివాసముంటున్న బేల్దారీలు సురేంద్ర, వెంకటసుదర్శన్, కొమ్మెరప్రతాప్ టీవీఎస్ ఎక్స్ఎల్లో నల్లింగాయపల్లెకు బయలు దేరారు. కడప రోడ్డులోని పెట్రోల్ బంకు సమీపానికి రాగానే ఎదురుగా వచ్చిన ఫర్చూనర్ అనే కారు రెండు ద్విచక్ర వాహనాలను ఢీ కొంది. ముందుగా టీవీఎస్ ఎక్స్ఎల్ను ఢీకొన్న కారు తర్వాత వారి వెనకాలే వస్తున్న సునీల్‌కుమార్‌రెడ్డి, వినోద్ బైక్‌ను ఢీకొంది. ఘటనలో ఐదుగురూ గాయపడ్డారు. స్థానికులు వెంటనే వారిని 108లో ప్రొద్దుటూరులోని జిల్లా స్థాయి ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం సునీల్‌కుమార్‌రెడ్డి, వినోద్‌లను కర్నూలుకు, వెంకటసురేంద్ర, ప్రతాప్‌ను కడప రిమ్స్‌కు తరలించారు. చిలంకూరు సర్పంచ్ కె.పుల్లయ్య, ఆనందరెడ్డి జిల్లా ఆస్పత్రికి విచ్చేసి సహాయక చర్యలు చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎర్రగుంట్ల ఏఎస్ఐ చంద్రశేఖర్‌రెడ్డి తె లిపారు. సింహాద్రిపురంలో... సింహాద్రిపురం మండలం గురిజాల సమీపంలో శనివారం ఉదయం బొలెరో బోల్తా పడిన సంఘటనలో అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం పాతపల్లె మాజీ సర్పంచ్ సహా ఆయన కుటుంబ సభ్యులు ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పాతపల్లెకు చెరందిన మాజీ సర్పంచ్ నాగార్జునరెడ్డి తన కుమారుడు శశికుమార్‌రెడ్డి, కోడలు స్వాతితో పాటు వియ్యంకురాలు ప్రభావతి ఆస్ట్రేలియా నుంచి విమానంలో శుక్రవారం రాత్రి బెంగళూరుకు వచ్చారు. వారిని పిల్చుకొచ్చేందుకు నాగార్జునరెడ్డి బొలెరోలో బెంగళూరు వెళ్లి వారిని పిల్చుకొని స్వగ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యంలోని గురిజాల సమీపానికి రాగానే ఇక్కడి ఓ మలుపులో వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఘటనలో శశికుమార్‌రెడ్డి, స్వాతి, ప్రభావతి తీవ్రంగా గాయపడగా, నాగార్జునరెడ్డి స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రులను అనంతపురం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అట్లూరులో... అదుపు తప్పిన ఓ కారు అట్లూరు మండలం మాడపూరు చెరువులోకి దూసుకెళ్లింది. మన్యంవారిపల్లె గ్రామంలోని భాస్కర్‌రెడ్డికి చెందిన టాటా ఇండికా కారు బద్వేలు వైపు నుంచి వేమలూరుకు బయలుదేరింది. మార్గమధ్యంలోని మాడపూరు చెరువు కట్టపైకి రాగానే అదుపు తప్పి చెరువులోకి బోల్తా కొట్టింది. ఈ సంఘటనలో కారు డ్రైవర్ స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అతన్ని బద్వేలులోని ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. కమలాపురంలో... సి.గోపులాపురం వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కలమల్లకు చెందిన కుమార్ తీవ్రంగా గాయపడ్డాడని గ్రామస్తులు తెలిపారు. రోడ్డు దాటుతున్న అతన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోవడంతో తల, చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని 108లో ప్రొద్దుటూరు ఆస్పత్రికి తరలించారు. అయితే అతని పరిస్థితి విషమంగా ఉంది. -
ఇది లవ్‌స్టోరీ కాదు.. లైఫ్ స్టోరీ..!
‘‘ ‘సొంతవూరు’ సినిమాలో మరణం గురించి చర్చించాను. ఈ చిత్రంలో జీవితం గురించి చెప్పాను. జీవితాన్నీ మరణాన్నీ ఎవ్వరూ తప్పించుకోలేరు. అందుకే ఆ సినిమాలాగే ఇది కూడా అందరికీ కనెక్ట్ అవుతుంది. ‘వెయిటింగ్ ఫర్ యూ’ అనేది లవ్‌స్టోరీ కాదు. లైఫ్ స్టోరీ’’ అని పి.సునీల్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఆయన దర్శకత్వంలో యక్కలి రవీంద్రబాబు నిర్మించిన ‘వెయిటింగ్ ఫర్ యూ’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా సునీల్‌కుమార్ రెడ్డి విలేకర్లతో ముచ్చటిస్తూ -‘‘వైజాగ్‌కు చెందిన ఓ అమ్మాయి యదార్థ జీవితం ప్రేరణతో చాలా పరిశోధన చేసి ఈ కథ తయారు చేశాను. గర్భం దాల్చిన ఓ ఒంటరి అమ్మాయి జీవితం తాలూకు అనేక కోణాల్ని ఇందులో ఆవిష్కరించాం’’ అన్నారు. పేరున్న కథానాయికతో ఈ సినిమా చేసి ఉండొచ్చుగా అన్న ప్రశ్నకు సునీల్‌కుమార్ జవాబిస్తూ -‘‘ఇది కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ. ఆ కాన్సెప్ట్‌ని వదిలేసి స్టార్ ఇమేజ్‌ని నమ్ముకోవాలనుకోలేదు... అమ్ముకోవాలనుకోలేదు’’ అన్నారు. ఈ సినిమాకు చేస్తున్న విభిన్న ప్రచారం గురించి విశ్లేషిస్తూ -‘‘ ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’కు ముసుగు వేసుకున్న అమ్మాయిల పోస్టర్లతో చేసిన ప్రచారం ఫలించింది. దీనికి ఓ ప్రెగ్నెంట్ అమ్మాయి ఫొటోతో ప్రచారం చేస్తున్నాం. కాన్సెప్ట్ కోసమే ఇలా చేస్తున్నాం. ఇలా అన్ని సినిమాలకూ చేయలేము’’ అని తెలిపారు. 2001లో ‘సెలైన్స్ ప్లీజ్’ చిత్రంతో దర్శకునిగా తన కెరీర్ మొదలైందని, తనకిది పదో చిత్రమని సునీల్‌కుమార్‌రెడ్డి చెప్పారు. రామానాయుడు సంస్థలో చేస్తున్న ‘నేనేం చిన్నపిల్లనా’ కూడా తన కెరీర్‌కి మంచి మలుపు అవుతుందని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో మరిన్ని ప్రయోజనాత్మక, ప్రయోగాత్మక చిత్రాలు చేస్తానని ఆయన వెల్లడించారు. -
వెయిటింగ్ ఫర్ యు పాటలు
‘‘సునీల్‌కుమార్ రెడ్డి చాలా మంచి సినిమాలు చేస్తున్నాడు. అన్ని భాషల్లోనూ సినిమాలు చేయాలనే తపన ఉంది ఆయనకు. రామానాయుడుగారే పిలిచి చిత్రం ఇచ్చారంటేనే ఆయన సత్తా ఏంటో తెలుస్తోంది’’ అని సీనియర్ దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి అన్నారు. గాయత్రి, రవి, సాయి అనిల్, సోనిచరిష్టా ముఖ్యతారలుగా సుఖీభవ సమర్పణలో పి.సునీల్‌కుమార్‌రెడ్డి దర్వకత్వంలో ఎక్కలి రవీంద్రబాబు నిర్మిస్తున్న ‘వెయిటింగ్ ఫర్ యు’ చిత్రం పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. కోదండరామిరెడ్డి పాటల్ని ఆవిష్కరించి, తొలి ప్రతిని రామిరెడ్డికి ఇచ్చారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘యువతను ఆకట్టుకునే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి’’ అన్నారు. ఈ నెల 30న చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. గత చిత్రాల మాదిరిగా ఈ సినిమా కూడా విజయం సాధించాలని నీలకంఠ, ‘మధుర’ శ్రీధర్ ఆకాంక్షించారు. సునీల్‌కుమార్ రెడ్డితో తనకిది మూడో సినిమా అని బసిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా కె.ఎం.రాధాకృష్ణన్, రవీంద్రబాబు, ప్రవీణ్ ఇమ్మడి, శ్రేష్ట, బాపిరాజు తదితరులు మాట్లాడారు.